By: ABP Desam | Updated at : 26 Jan 2022 09:47 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు తాజాగా ఎట్టకేలకు ముందడుగు పడింది. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఉగాది నాటికి ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాథమిక నోటిఫికేషన్‌పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను నెలరోజుల్లోపు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.
కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆన్‌లైన్‌లోనే ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు.
కొత్త జిల్లాలు ఇవే..
జిల్లా పేరు - జిల్లా కేంద్రం
శ్రీకాకుళం - శ్రీకాకుళం
విజయనగరం - విజయనగరం
మన్యం జిల్లా - పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు జిల్లా - పాడేరు
విశాఖపట్నం - విశాఖపట్నం
అనకాపల్లి - అనకాపల్లి
తూర్పుగోదావరి - కాకినాడ
కోనసీమ - అమలాపురం
రాజమహేంద్రవరం - రాజమహేంద్రవరం
నరసాపురం - భీమవరం
పశ్చిమగోదావరి - ఏలూరు
క్రిష్ణా - మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా - విజయవాడ
గుంటూరు - గుంటూరు
బాపట్ల - బాపట్ల
పల్నాడు - నరసరావుపేట
ప్రకాశం - ఒంగోలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు - నెల్లూరు
కర్నూలు - కర్నూలు
నంద్యాల - నంద్యాల
అనంతపురం - అనంతపురం
శ్రీ సత్యసాయి జిల్లా - పుట్టపర్తి
వైఎస్ఆర్ కడప - కడప
అన్నమయ్య జిల్లా - రాయచోటి
చిత్తూరు - చిత్తూరు
శ్రీబాలాజీ జిల్లా - తిరుపతి
కొత్త జిల్లాల ఏర్పాటుపై 2020 ఆగస్టు 7న సీఎస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటైంది ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది, ఆస్తులు తదితర అంశాలపై మరో నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రణాళికా విభాగం అధ్యయనం చేసి ఒక నివేదిక అందజేసింది. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే క్రమంలో ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శానససభ స్థానాలూ కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన మాత్రం కుదరలేదు.
ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. దీనితో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 62కి చేరుతుంది.
Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
NTR Centenary Celebrations : పురోహితునిగా ఎన్టీఆర్ - సినిమాలో కాదు నిజంగా !
Balakrishna About NTR: ఎన్టీఆర్కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం
Anantapuram: నిద్రలోనే ఘోరం- గ్యాస్ సిలిండర్ పేలి మూడేళ్ల పసిపాప సహా నలుగురు మృతి
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Khammam Politics: పాలేరులో గుచ్చే గులాబీ ముళ్లు- పోటీ పక్కా అంటున్న తుమ్మల, మరి కందాల పరిస్థితి ఏంటి..?
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!
Nandamuri Chaitanya Krishna: వెండితెరకు మరో నందమూరి వారసుడు, చైతన్య కృష్ణ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్