News
News
X

BJP Vishnu On AP Govt : తుపాను వల్ల రైతులకు తీవ్ర నష్టం - తక్షణం రూ. 10 వేల సాయం ప్రకటించాలని ఏపీ బీజేపీ డిమాండ్ !

తుపాను బాధితులకు తక్షణం పదివేల సాయం అందించాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేసింది. పంట నష్టం అంచనాలను వెంటనే రూపొందించి సాయం చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

FOLLOW US: 
Share:

BJP Vishnu On AP Govt :  మాండూస్ తుఫాన్ ప్రాంత రైతులను తక్షణం ఆదుకోవాలని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.  అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలలోని రైతులకు మాండూస్ తుఫాన్ తీవ్రమైన నష్టాన్ని చేకూర్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  చేతికందిన పంట తుఫాన్ ధాటికి నీటమునిగిపోయిందన్నారు.  ముఖ్యమంత్రి పంట నష్టపోయిన ప్రాంతాల్లో వెంటనే పర్యటించాలని..  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం క్రింద ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

పంట నష్టం అంచనాలకు  వెంటనే కమిటీ వేయాలి 

సంబంధిత జిల్లాల మంత్రులతో, ఇంఛార్జి మంత్రులతో, వ్యవసాయ అధికారులతో పంట నష్టపరిహారానికి సంబంధించిన కమిటీని వెంటనే వేయాలని  ఈ కమిటీ వెంటనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, రైతులకు, ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. ప్రస్తుత మాండోస్ తుపాను వల్ల   ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.  కోతలు పూర్తి చేసుకుని ఆరబోసిన ధాన్యం భీకరమైన వర్షాలకు తడిసి మొలకలొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉందన్నారు.  వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి, మామిడి వంటి ఉద్యాన పంటలలో చెట్లు నేలకొరిగాయని.. కంది, మిరప, టమాటా వంటి వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. మొత్తంమీద లక్షన్నర ఎకరాలలో వివిధ రకాల పంటలను నష్టపోయినట్లు తెలుస్తోందన్నారు.  నష్టపరిహారాన్ని వీలయినంత త్వరగా అందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు . లేకపోతే ఏపీ బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. 

ఏపీపై భారీగా మాండోస్ తుపాన్ ప్రభావం 

తమిళనాడులో తీరం దాటిన మాండూస్ తుపాను కారణంగా ఏపీలోనూ భారీ వర్షాలు పడ్డాయి. అయితే ప్రభుత్వం  మాండోస్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు  ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఒక్క కుటుంబంలో గరిష్టంగా రూ.2000 అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఆర్ధిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని బాధితులకు ఈ ఆర్ధిక సాయాన్ని అందించాలని సర్కార్  నిర్ణయించింది. అయితే పంటల నష్టపరిహారంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాల విమర్శలు

మాండోస్ తుఫాన్ కారణంగా  తిరుపతి , నెల్లూరు , వైఎస్సార్, చిత్తూరు , అన్నమయ్య జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. తడిసిన పంటను కొనుగోలు చేసి, తుఫాన్ బాధితులను ఆదుకోవాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రైతుల ధాన్యాన్ని తడవకుండా వారికి సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు.  

బలప్రదర్శనకు సిద్ధమైన గంటా శ్రీనివాస్‌రావు- కాపునాడు పేరుతో భారీ బహిరంగ సభ!

Published at : 12 Dec 2022 01:16 PM (IST) Tags: BJP Vishnuvardhan Reddy Cyclone Mandoos Cyclone Mandoos damage. Crop loss to farmers

సంబంధిత కథనాలు

Nellore News : ఇద్దరు రెడ్లు పోతే మరో 10 మంది వస్తారు- ఆనం, కోటంరెడ్డిపై విజయ్ కుమార్ రెడ్డి ఫైర్

Nellore News : ఇద్దరు రెడ్లు పోతే మరో 10 మంది వస్తారు- ఆనం, కోటంరెడ్డిపై విజయ్ కుమార్ రెడ్డి ఫైర్

Gudivada Amarnath : ఏపీ భవిష్యత్తును విశాఖ మార్చబోతోంది- మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath : ఏపీ భవిష్యత్తును విశాఖ  మార్చబోతోంది-  మంత్రి గుడివాడ అమర్నాథ్

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం

AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం

AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం

Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?

Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం