అన్వేషించండి

AP volunteers strike: ఏపీలో వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె- జీతాలు పెంచాలని డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వాలంటీర్లతోపాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు.

AP volunteers strike: ఆంధ్రప్రదేశ్‌ (Andra Pradesh)లో ఎన్నికల ముందు జగన్‌ సర్కార్‌పై సమ్మెల సెగ తగులుతోంది. జగన్‌ సొంత సైన్యంగా భావించే వాలంటీర్లు (volunteers) కూడా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. వేతనం (salaries) పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా... 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమాన్ని కూడా బహిష్కరించాలని నిర్ణయించారు వాలంటీర్లు. వాలంటర్లు సమ్మెకు దిగకుండా ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఫలితం కలపించలేదు. తీవ్ర అసంతృప్తితో ఉన్న వాలంటీర్లు సమ్మెకే సై అన్నారు. 

ఎదురు తిరుగుతున్న వాలంటీర్లు

2019లో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. 2లక్షల 65వేల మందిని వాలంటీర్లుగా నియమించింది. వీరికి నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం  చెల్లిస్తోంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారని.. ప్రభుత్వ సేవలను లబ్దిదారుల ఇంటికే చేరవేయాలనే ఆలోచనతో గ్రామ, వార్డు, సచివాలయ వాలంటీర్లను  నియమించింది. సంక్షేమ పథకాల అమలులో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తరఫున నిర్వహించే సర్వేల్లోనూ పాలుపంచుకుంటున్నారు. అయితే...  గౌరవ వేతనానికి సంబంధించి కొంత కాలంగా వలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేతనం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం వారి సమస్యల్ని  పట్టించుకోకపోవడంతో వారు సమ్మెకు పిలుపునిచ్చారు.

రూ. 750 పెంపు ప్రకటనతో మరింత కాక

అయితే... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP government) వాలంటీర్ల జీతాన్ని 750 రూపాయలకు పెంచుతామని... 2024, జనవరి నుంచి పెంచిన జీతాలు అందిస్తామని ప్రకటించింది. అయితే... ఆ ప్రకటనతో వాలంటీర్లు సంతృప్తి చెందలేదు. దీంతో సమ్మెకే మొగ్గుచూపారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికుల ఇచ్చే జీతాలు కూడా తమకు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా...తమ గురించి ఆలోచించడంలేదని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. చాలా జిల్లాల్లో వాలంటీర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. 

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, కర్నూలు జిల్లా హొళగుంద, మన్యం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తదితర ప్రాంతాల్లో వాలంటీర్లు సమ్మెకు వెళ్తున్నట్లు మండల పరిషత్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాలంటీర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు అధికారులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) నేతలు. ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని చెప్పారు. కానీ ఫలితం కనిపించలేదు. మిగతా జిల్లాల్లోని వారు బయటకు రాకపోయినా.. 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమాన్ని బహిష్కరించాలని మాత్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

అదేబాటులో పారిశుద్ధ్యకార్మికులు 

పారిశుద్ధ్య కార్మికులు కూడా నేటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో... పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ కాంట్రాక్ట్‌ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పాల్గొంటున్నారు.  ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి రూ.15వేల వేతనం మాత్రమే ఇస్తున్నారు. అయితే... పారిశుద్ధ్య కార్మికులు తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. కార్మికుల సంఖ్యను పెంచాలన్న వారి డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెరిగిన పని ఒత్తిడి మేరకు వేతనం పెంచాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని ఆరోపిస్తున్నారు. దీంతో సమ్మెకు దిగారు పారిశుద్ధ్య కార్మికులు.

మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు టీడీపీ మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని అన్నారు టీడీపీ (TDP) నేత నారా లోకేష్‌ (Nara Lokesh). పాదయాత్రలో వైఎస్‌ జగన్ ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చి... అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారని ఆరోపించారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు నిరసన చేస్తున్నారన్న ఆయన... డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. అంగన్‌వాడీలకే కాదు... మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget