Breaking News Live: లఖింపుర్ ఖేరి ఘటన.. కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 13న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE

Background
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో ఏడో రోజు దుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
లఖింపుర్ ఖేరి ఘటన.. కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ
యూపీలోని లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టివేసింది. ఆశిష్ మిశ్రాకు జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను చికిత్స నిమిత్తం ఢిల్లీలో ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో దారుణం.. బొప్పాయి తోటలో బాలుడి డెడ్ బాడీ..
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడి హత్య కలకలం రేపుతోంది. నిన్న కిడ్నాప్ అయిన తేజేష్ అనే బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. బొప్పాయి తోటలో బాలుడి డెడ్ బాడీని గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులు ప్రస్తుతం కువైట్ లో ఉంటున్నారు. పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన తేజేష్ హత్యకు గురికావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
బద్వేల్ ఉప ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు
ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ తుది గడువు నేటి మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. చివరిరోజైన బుధవారం నాడు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. బద్వేల్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు.. చివరిరోజు 12 నామినేషన్లు విత్‌డ్రా
హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ తుది గడువు నేటి మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. చివరిరోజైన బుధవారం నాడు మొదట ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. చివరి క్షంలో మరో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అందులో బీజేపీ నుంచి ఈటల జమున, కాంగ్రెస్ నుంచి లింగారెడ్డి, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు పోటీ నుంచి తప్పుకున్నారు. రెండు ఈవీఎంలతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ తరువాత హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















