అన్వేషించండి

Breaking News Live:  ముగ్గురు టీటీడీ ఉద్యోగులపై వేటు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live:   ముగ్గురు టీటీడీ ఉద్యోగులపై వేటు

Background

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ సన్ సిటీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో ఈ తనిఖీలు చేపట్టారు. విదేశీయులే లక్ష్యంగా 40 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. వీసా గడువు ముగిసిన 25 మంది నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి గురించి విచారణ జరుపుతున్నారు.

ఈ వారం సండే ఫండే రద్దు.. ఎందుకంటే..
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కరోనా ప్రబలే ప్రమాదం ఉండడం వల్ల ముందస్తు జాగ్రత్త చేపడుతోంది. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసిన వైద్యశాఖ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ట్యాంక్‌ బండ్‌పై ప్రతి ఆదివారం జరిగే సండే - ఫన్‌డేను రద్దు చేస్తున్నట్లు బుధవారం మున్సిపల్‌ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ట్వీట్ ద్వారా ప్రకటించారు.

అల్వాల్‌లో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్‌ నగరంలోని అల్వాల్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన వ్యక్తిని మాధవ రెడ్డిగా గుర్తించారు. అతడు ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

వాతావరణ వివరాలు
ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా భారీ వర్ష సూచన కొనసాగుతోంది. మరో అల్ప పీడనం ఏర్పడనున్నట్లుగా అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు వారు రాగల 3 రోజుల వాతావరణ పరిస్థితుల గురించి ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: Weather Updates: వచ్చే 3 రోజులు ఏపీలో భారీ వర్షాలే.. ఈ ప్రాంతాల్లో అతి భారీగా.. వాతావరణ కేంద్రం హెచ్చరిక

బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు భారీగా తగ్గింది. గ్రాముకు రూ.25 తగ్గింది. వెండి ధరలో మాత్రం గ్రాముకు రూ.0.20 స్వల్పంగా తగ్గి.. కిలోకు రూ.200 మార్పు కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,600 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,650 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,300గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 

పెట్రోల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నేడు ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర రూ0.03 పైసలు తగ్గి రూ.107.69 అయింది. డీజిల్ ధర కూడా రూ.0.02 పైసలు తగ్గి రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త తగ్గింది. లీటరుకు రూ.0.26 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.37 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.24 పైసలు తగ్గి రూ.96.46గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650గా ఉంది.

19:38 PM (IST)  •  02 Dec 2021

 ముగ్గురు టీటీడీ ఉద్యోగులపై వేటు

ముగ్గురు ఉద్యోగులను టీటీడీ సస్పె్ండ్ చేసింది. ఏడీ బిల్డింగ్ ముందు టీటీడీ కార్మికుల ధర్నాకు మద్దతు పలికారని ఉద్యోగులపై వేటు వేసింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న నాగార్జున్ ,గుణశేఖర్, వేంకటేశం ను అధికారులు తొలగించారు. గత ఐదు రోజులుగా తిరుపతి ఏడీ బిల్డింగ్ ముందు కాంట్రాక్టు, కార్పోరేషన్ కలపాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. 

 

19:35 PM (IST)  •  02 Dec 2021

రైతులకు పరిహారం అందించాలని టీడీపీ నేతలు ధర్నా

తూర్పు గోదావరి జిల్లాలో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయం వద్ద  ఆందోళన చేపట్టారు. మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరారావు, ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృషారెడ్డి, రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిరసన చేశారు. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నష్టపోయిన రైతులకు హెక్టార్ కు రూ.50 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  రబీ పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేతలు ఆర్డీవో పి.సింధుకు వినతిపత్రం అందజేశారు. 

 

 

16:15 PM (IST)  •  02 Dec 2021

అఖండ సినిమాపై అధికారుల చర్యలు... షో ముందుగా వేశారని థియేటర్ల సీజ్ 

బాలకృష్ణ అఖండ సినిమాపై ఏపీలో అధికారులు కొరడా ఝళిపించారు. నిర్దేశించిన సమయానికి ముందుగానే సినిమాను ప్రదర్శించారని థియేటర్లను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా మైలవరంలోని సంగమిత్ర థియేటర్‌ను అధికారులు సీజ్ చేశారు. మరికొన్ని ప్రాంతాలలో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సీజ్ చేసిన థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల ఆందోళన  చేస్తున్నారు. అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో ఓర్వలేక ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. 

11:37 AM (IST)  •  02 Dec 2021

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన

పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న కొన‌సాగుతోంది. నాలుగో రోజు కూడా టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని నిల‌దీశారు. స్పీక‌ర్ పోడియంను కూడా చుట్టుముట్టారు. ప్లకార్డులు ప‌ట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో టీఆర్ఎస్ ఎంపీలు.. వెల్‌లోకి దూసుకువెళ్లి రైతుల‌ను కాపాడాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు, 12 మంది ఎంపీలపై విధించిన స‌స్పెన్షన్‌ను ఎత్తివేయాల‌ని కోరుతూ రాజ్యస‌భ‌లో నేడు విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టగా.. దీంతో ఛైర్మెన్ వెంక‌య్య స‌భ‌ను 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

11:31 AM (IST)  •  02 Dec 2021

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పాడైపోయిన ధాన్యం నుంచి ఆర్ఎస్ స్పిరిట్ తయారు చేసే పరిశోధనలు చేయించాలని ముద్రగడ సూచించారు. పరిశోధనలు ఫలిస్తే జిల్లాకు ఒక స్పిరిట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని లేఖలో ప్రస్తావించారు. తద్వారా ధాన్యానికి మద్దతు సమస్య ఉండబోదని అన్నారు. నిత్యం నీరు ఉండే పొలాల్లో వరి తప్పించి వేరే పంట కష్టమని ముద్రగడ పేర్కొన్నారు.

08:42 AM (IST)  •  02 Dec 2021

శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం

తిరుమల శ్రీవారిని ఏపి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Embed widget