Corona Updates: ఏపీలో తగ్గుతున్న కోవిడ్ వ్యాప్తి, కొత్తగా 528 కరోనా కేసులు, ఇద్దరు మృతి
ఏపీలో కొత్తగా 528 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో 9,470 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఏపీలో కరోనా కేసులు(Corona Cases) క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 22,339 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 528 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,707కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,864 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,90,853 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 9,470 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,030కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,29,16,247 నిర్థారణ పరీక్షలు చేశారు.
#COVIDUpdates: 17/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 17, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,15,030 పాజిటివ్ కేసు లకు గాను
*22,90,853 మంది డిశ్చార్జ్ కాగా
*14,707 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9,470#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/sBhzT3e8Wl
#COVIDUpdates: As on 17th February, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 17, 2022
COVID Positives: 23,15,030
Discharged: 22,90,853
Deceased: 14,707
Active Cases: 9,470#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/fUKkoyhImV
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. రోజువారీ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 30,757 కరోనా కేసులు నమోదు కాగా, 541 మరణాలు సంభవించాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 2.61 శాతం నమోదైంది. గత రెండు రోజులుగా పాజిటివిటీ రేటులో స్వలంగా పెరిగింది. 2020 నుంచి 4.27 కోట్ల మందికి ఇప్పటి వరకూ కరోనా సోకింది. అందులో 4.19 కోట్ల మంది వైరస్‌ను నుంచి పూర్తిగా కోలుకున్నారు. బుధవారం ఒక్కరోజే 67 వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.03 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 3.3 లక్షలకు తగ్గాయి. కరోనాతో ఇప్పటి వరకూ 5,10,413 మంది మరణించారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. నిన్న 34.7 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకూ 174 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.