AP Corona Updates: ఏపీలో మళ్లీ పెరిగిన కేసులు, కొత్తగా 1,891 మందికి పాజిటివ్, 5 మరణాలు
ఏపీలో కొత్తగా 1,891 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 5 మంది మరణించారు. రాష్ట్రంలో 54,040 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 26,236 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 1,891 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 5 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,677కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,241 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,38,226 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 54,040 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,06,943కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,27,05,524 నిర్థారణ పరీక్షలు చేశారు.
#COVIDUpdates: 08/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 8, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,06,943 పాజిటివ్ కేసు లకు గాను
*22,38,226 మంది డిశ్చార్జ్ కాగా
*14,677 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 54,040#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/b3SCJI4jps
దేశంలో కరోనా కేసులు
భారత్‌లో కరోనా కేసులు మరోసారి తగ్గాయి. పాజిటివ్ కేసులు వరుసగా మూడోరోజు లక్ష దిగువన నమోదు కాగా, కొవిడ్ మరణాల సంఖ్య మాత్రం నిన్న సైతం వెయ్యి దాటడం ఆందోళన పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 67,597 (67 వేల 597) మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో కరోనాతో పోరాడుతూ 1,188 మంది మరణించారు. ఇటీవల వరుసగా అయిదు రోజులు వెయ్యి పైగా నమోదైన మరణాలు తగ్గాయి. కానీ నేడు మరోసారి వెయ్యికి పైగా కరోనా బాధితులు చనిపోయారు.
నిన్న ఒక్కరోజులో 1,80,456 (1 లక్షా 80 వేల 456) మంది కరోనా మహమ్మారిని జయించారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో ప్రస్తుతం 9,94,891 (9 లక్షల 94 వేల 891) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపితే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 5,04,062 (5 లక్షల 4 వేల 062)కు చేరింది. ఇక రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు రేటు 5.02 శాతానికి తగ్గింది.
170 కోట్ల కోవిడ్ డోసులు..
భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 170 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం డోసులు 170 కోట్ల 21 లక్షల 72 వేల 615 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద దాదాపు 13 కోట్ల మేర వ్యాక్సిన్ డోసుల వరకు నిల్వ ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేటు 2.25 శాతానికి తగ్గడం విశేషం. రికవరీ రేటు 96.46 శాతానికి పెరిగినట్లు తాజా బులెటిన్‌లో తెలిపారు.