అన్వేషించండి

Inter Advanced Supplementary: సెప్టెంబర్ 15 నుంచి 23 వరకూ ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు–2021 సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ విద్యామండలి మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండియర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చిలో జరగాల్సిన పబ్లిక్‌ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడుతూ చివరకు రద్దయ్యాయి. ఉన్నత చదువులకు వీలుగా హైపవర్‌ కమిటీ సిఫార్సులను అనుసరించి ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు ఇటీవల ఇంటర్‌ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఆ విద్యార్థుల టెన్త్, ఇంటర్‌ ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించారు.  ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది.


Inter Advanced Supplementary: సెప్టెంబర్ 15 నుంచి 23 వరకూ ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

సెకండియర్‌ ఫలితాల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని కొందరు విద్యార్థుల  అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రం ఆప్షన్ లేదు… తప్పనిసరిగా ఈ పరీక్షలు రాయాల్సిందే.  ఆగస్టు 17లోపు  పరీక్ష ఫీజును చెల్లించాలి. జనరల్, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులంతా ఈ గడువులోగా ఫీజులు చెల్లించాలి. పబ్లిక్‌ పరీక్షలకు ఇంతకు ముందు ఫీజు చెల్లించిన ఫస్టియర్‌ విద్యార్థులు మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. బెటర్‌మెంట్‌ కోసం ఈ పరీక్షలకు హాజరవుదామనుకునే సెకండియర్‌ విద్యార్థులు కూడా ఫీజు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఇంతకు ముందు వచ్చిన మార్కులు, ఇప్పుడు వచ్చిన మార్కుల్లో ఏవి ఎక్కువగా ఉంటే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. అటెండెన్స్‌ మినహాయింపుతో ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యే హ్యుమానిటీస్‌ అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించాలి. 2019లో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు బెటర్‌మెంట్‌ మార్కుల కోసం ఈ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలే చివరి అవకాశం. అదనపు మార్కులు కావాలనుకునేవారు ఈ పరీక్షలకు హాజరు కావాల్సిందే. ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షల తేదీలను పొడిగించబోమని బోర్డు కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. 


Inter Advanced Supplementary: సెప్టెంబర్ 15 నుంచి 23 వరకూ ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్ పరీక్షల షెడ్యూల్

సెప్టెంబరు 15న సెకెండ్ లాంగ్వేజ్ పేపర్,

సెప్టెంబరు 16న ఇంగ్లీష్

సెప్టెంబరు 17న మ్యాథ్స్, బోటనీ, సివిక్స్

సెప్టెంబరు 18న మ్యాథ్స్ పేపర్ బి, జువాలజీ, హిస్టరీ

సెప్టెంబరు 20న ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ…ఇదే రోజు సెకెండియర్ వాళ్లకి ఫిజిక్స్, ఎకనామిక్స్

సెప్టెంబరు 21 ఫస్టియర్ కి కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1…ఇదే రోజు సెకెండియర్ కి  కెమిస్ట్రీ,    కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్

సెప్టెంబరు 22 ఫస్టియర్ కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు, మ్యాథ్స్  ( బైపీసీ వారికి)

సెప్టెంబరు 23 జియోగ్రఫీ….సెకెండియర్ వారికి జియోగ్రఫీతో పాటూ మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ కూడా ఉంటుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ట్రంప్ ఒప్పందంపై మొజ్తాబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు 
కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ట్రంప్ ఒప్పందంపై మొజ్తాబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు 
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget