Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.... అఫ్గాన్ లో చిక్కుకున్న కార్మికుల కోసం కాల్ సెంటర్... కాబుల్ నుంచి రెండు విమానాలు
అఫ్గానిస్థాన్ లో చిక్కుకున్న కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్మికుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లతో కాల్ సెంటర్ ఏర్పాటుచేసింది.
అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయి. ప్రజలపై తాలిబన్ల చేస్తోన్న హింసాకాండపై అఫ్గాన్ మీడియా సంస్థలు గొంగెత్తి చాటుతున్నాయి. మహిళలపై దాడులు, కాబుల్ ఎయిర్ పోర్టులో కిడ్నాప్ లు అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అఫ్గానిస్థాన్ లో చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటుచేసింది.
Also Read: Raksha Bandhan 2021: వాట్సాప్‌లో రాఖీ స్టిక్కర్లు.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?
ప్రత్యేక కాల్ సెంటర్
అఫ్గానిస్థాన్‌లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న కార్మికుల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ కార్మికుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించింది. ఏపీ కార్మికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ కమిషనర్ రేఖారాణి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అఫ్గనిస్థాన్‌లో ఉన్న కార్మికులు, వారి వివరాలను 0866-2436314 లేదా +91-7780339884 నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని కార్మిక శాఖ వెల్లడించింది.
వీటికి అదనంగా మరో రెండు నెంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. +91-9492555089, 8977925653 నెంబర్ల ద్వారా ఏపీ కార్మికులకు సంబంధించిన వివరాలను తెలియజేయవచ్చని కార్మిక శాఖ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అఫ్గన్ లో చిక్కుకున్నవారిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించినట్టు కార్మిక శాఖ వెల్లడించింది.
Also Read: Angelina Jolie Instagram: అఫ్గాన్ తాలిబన్లపై హాట్ బ్యూటీ వార్.. 24 గంటల్లో 5.2 మిలియన్ల ఫాలోవర్స్!
కాబుల్ నుంచి ప్రతి రోజు రెండు విమానాలు
అఫ్గానిస్థాన్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ నుంచి ఢిల్లీకి ప్రతి రోజు రెండు విమానాలు నడుపుతున్నామని కేంద్రం వెల్లడించింది. మరోవైపు అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. కాబుల్‌లో అడుగడుగునా తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి మహిళలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. తాలిబన్ల చెర నుంచి తప్పించుకుని స్వదేశానికి చేరుకుంటున్న వారు భయానక పరిస్థితులను అధికారులకు వివరిస్తారు.
Also Read: Afghanistan Crisis: 150 మంది భారతీయులు కిడ్నాప్.. అందరూ సురక్షితమే!