Angelina Jolie Instagram: అఫ్గాన్ తాలిబన్లపై హాట్ బ్యూటీ వార్.. 24 గంటల్లో 5.2 మిలియన్ల ఫాలోవర్స్!
అఫ్గానిస్థాన్ లో మహిళలపై జరుగుతోన్న అరాచకాలపై హాలివుడ్ నటి ఏంజెలినా జోలీ స్పందించారు. వారి గళాన్ని వినిపించేందుకు ఇన్ స్టా ఖాతాను ఓపెన్ చేశారు. 24 గంటల్లోనే లక్షల మంది ఆమెను ఫాలో అయ్యారు.
హాలివుడ్ హాట్ బ్యూటీ ఏంజెలినా జోలీ అఫ్గానిస్థాన్ సంక్షోభంపై స్పందించారు. ఇన్‌స్టాగ్రాం ఖాతాను తెరిచి మహిళలు, చిన్నారులకు తన మద్దతును ప్రకటించారు. అఫ్గాన్ లో వారి దుర్భర పరిస్థితుల్ని ప్రపంచానికి చాటేందుకు తన ఎకౌంట్ ను అంకింతం చేశారు. ఈ సందర్భంగా ఓ అఫ్గాన్ బాలిక తమ కష్టాలను చెప్తూ రాసిన లేఖను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ పోస్టు విపరీతంగా వైరల్ అయింది.
View this post on Instagram
ఈ సందర్భంగా ఏంజెలినా ఓ అఫ్గాన్ బాలిక రాసిన లేఖను షేర్ చేశారు. అయితే ఆ అమ్మాయి వివరాలను మాత్రం వెల్లడించలేదు,
ఏంజెలినా పంచుకున్న లేఖలో ఆ బాలిక తన భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
"20 సంవత్సరాలు తర్వాత మళ్లీ ఇప్పుడు మాకు ఎలాంటి హక్కులు లేవు. మా లోకమంతా చీకటిగా మారింది. మేం బందీలుగా మారిపోయాం" అని ఆవేదన వ్యక్తం చేసింది. ఏంజెలినా ఇన్‌స్టా ఖాతాను ఇప్పటికే 5.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.