Afghanistan Crisis: 150 మంది భారతీయులు కిడ్నాప్.. అందరూ సురక్షితమే!
కాబూల్ నుంచి భారత్ వచ్చేందుకు విమానాశ్రయం వద్ద వేచి ఉన్న 150 మంది భారతీయుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేశారంటూ ఈ రోజు వార్తలు వచ్చాయి. అయితే వీరంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది.
అఫ్గానిస్థాన్ లో భారతీయులను కిడ్నాప్ చేశారనే వార్తలు తీవ్ర కలకలం రేపాయి. అఫ్గానిస్థాన్ నుంచి భారత్ వచ్చేందుకు కాబూల్ విమానాశ్రయం వచ్చిన భారతీయుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేశారనే నేడు వార్తలు వచ్చాయి. అయితే వారిని ప్రశ్నించి, విడుదల చేసినట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
Multiple Afghan media outlets report kidnapping by Taliban of persons awaiting evacuation from #Kabul. Among them are reported to be Indian citizens. No official confirmation of this, more details awaited
— ANI (@ANI) August 21, 2021
All Indians citizens in Kabul awaiting evacuation are safe. They were offered lunch and have now left for Kabul airport: Government sources
— ANI (@ANI) August 21, 2021
అందరూ సురక్షితమే..
కాబూల్ విమానాశ్రయం సమీపంలో ఉన్న 150 మంది ప్రయాణికుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు ఈ రోజు ఉదయం అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నట్లు తెలిపాయి. ఈ వార్తలు విన్న వెంటనే భారత విదేశాంగ శాఖ అప్రమత్తమై సంప్రదింపులు చేపట్టింది. కాగా ప్రయాణికుల వద్ద ఉన్న పత్రాలు పరిశీలించేందుకే వారిని తీసుకెళ్లినట్లు తెలిసింది. తనిఖీల అనంతరం వారిని విడుదల చేశారని, త్వరలో వారిని భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
మరోపక్క ఈ కిడ్నాప్ వార్తలు అవాస్తవమని ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెప్పాయి. తాలిబన్ ప్రతినిధి కూడా ఈ వార్తలను ఖండించారు.
భారత ఎంబసీలో సోదాలు..
అఫ్గానిస్థాన్ లోని మూసివేసిన భారత రాయబార కార్యాలయల్లోకి బుధవారం ముష్కరులు చొరబడి సోదాలు నిర్వహించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అక్కడ కీలక పత్రాలు, పార్క్ చేసిన కార్లను తీసుకెళ్లిపోయినట్టు పేర్కొన్నాయి. పైకి శాంతి వచనాలు చెబుతున్నప్పటికీ తాలిబన్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
ALSO READ: Afghanistan News: తాలిబన్లకు అమెరికా డెడ్ లైన్.. ఆగస్టు 31 వరకు నో ఛాన్స్!