X

Viral Video: పాకిస్తాన్ లో మరో మహిళపై దాడి... రిక్షాలో ప్రయాణిస్తోన్న మహిళకు ముద్దు.... వైరల్ అవుతున్న వీడియో...

పాకిస్తానీ మహిళా టిక్ టాకర్ పై దాడి జరిగిన రోజే మరో మహిళపై కూడా దాడి జరిగింది. రిక్షాలో ప్రయాణిస్తోన్న మహిళపై అమాంతం దూకి ముద్దు పెట్టాడో ఓ బైకర్. ఈ వీడియో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

ఆగస్టు 14న పాకిస్తాన్ లో మహిళా టిక్ టాకర్ పై వందల మంది మూకుమ్మడి దాడి ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ దాడిని నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ఆ దాడి జరిగిన రోజే పాకిస్తాన్ లో మరో మహిళపై  దాడి జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిని ఖండిస్తూ సోషల్ మీడియా యాష్ టాగ్ లు నడుస్తున్నాయి. 

మహిళపై బైకర్ లైంగిక దాడి 

సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోలో ఇద్దరు మహిళలు రద్దీగా ఉండే రోడ్డుపై ఓపెన్ రిక్షాలో ప్రయాణిస్తుండగా, ఫుట్‌బోర్డ్‌ పై నుంచి ఓ వ్యక్తి అమాంతం రిక్షాలోకి ఎక్కి మహిళ చెంపపై ముద్దు పెట్టాడు. ఆ వీడియో ఆధారంగా పాకిస్థాన్‌లో రద్దీగా ఉన్న ఓ వీధిలో ప్రయాణిస్తున్న రిక్షాలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారితో కలిసి ప్రయాణిస్తున్నారు. (సోషల్ మీడియాలో చాలా మంది ఆ ప్రాంతం లాహోర్ అని చెబుతున్నారు) 

ఎవరూ అడ్డుకోలేదు 

ఇద్దరు మోటార్‌ సైకిలిస్టులు రిక్షాను వెంబడించి మహిళలను వేధించడం మొదలుపెట్టారు. ఓపెన్ రిక్షాలో ఉన్న మహిళల వైపుగా వచ్చిన ఓ యువకుడు రిక్షాపైకి దూకి, బలవంతంగా ఆ మహిళను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో మహిళ భయంతో గట్టిగా అరిసింది. కానీ ఆమె పక్కనున్న మహిళ కానీ ఇతరులు ఎవరూ జోక్యం చేసుకోలేదని జియో టీవీ తెలిపింది. బైకర్ ప్రవర్తనతో విసిగిపోయి పక్కనున్న మహిళ తన చెప్పు తీసి హెచ్చరించింది. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన మహిళ  రిక్షాను దిగివెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. పక్కనున్న మహిళ ఆమెను వారించింది.

Also Read: Bhumika Chawla: దట్ ఈజ్ భూమిక.. రవిబాబు వద్ద ఆ విషయం దాచి షూటింగ్, నిజం తెలిసి అంతా షాక్!

 

 

స్వాతంత్ర్య దినోత్సవం రోజునే...

మహిళపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. ఇటువంటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో పరిశీలిస్తే రిక్షా చుట్టూ చాలా కార్లు ఉన్నాయి. వాళ్లంతా జాతీయ పతాకాలు పట్టుకుని ఉన్నారు. దీంతో ఈ ఘటన పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు రాత్రి జరిగి ఉంటుందని తెలుస్తోంది.

Also Read: Pakistan Mindest : ఆమె వేసుకున్న బ్రా కలరే వాళ్లకు ముఖ్యం... స్వాతంత్ర్యం దినోత్సవం కాదు ! పాకిస్తాన్ జనం తీరుపై నటి ఫైర్

" మహిళా టిక్ టాకర్ పై దాడి జరిగినప్పుడు ఎవరినో నిందించి, ఆమెది కూడా తప్పు ఉందని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ. వీళ్లు టిక్ టాకర్లు కాదు. అయినా దాడులు ఆగడంలేదు. అలాంటి ప్రవర్తనను ఆహ్వానిస్తారా ? మహిళలు సురక్షితంగా ఉన్నారా? ఎవరైనా వింటున్నారా?" అని అస్మత్ అలీ జైన్‌ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. 

నెటిజన్లు ఆగ్రహం

పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు లాహోర్‌లో 400 మంది పురుషులు మహిళపై క్రూరంగా దాడి చేశాడు. బట్టలు చింపేస్తూ విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేశారు. ఈ దాడి ఘటనను ఖండిస్తూ #minarPakistan # 400 మంది పురుషులు హ్యాష్‌ట్యాగ్‌లతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఆగస్టు 14న మినార్-ఇ-పాకిస్తాన్ సమీపంలో టిక్ టాకర్ పై దాడి జరిగింది. దాదాపు 400 మంది ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

Also Read: Gannavaram Slow Down : రేంజ్ ఇంటర్నేషనల్ కానీ డొమెస్టిక్ సర్వీసులే కష్టం ! గన్నవరం ఎయిర్‌పోర్టుకు కష్టాలెందుకు..?

Tags: Pakistan Abp News Viral Pakistan viral videos tiktalker

సంబంధిత కథనాలు

Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. కరోనా కారణంగా 55 పాసింజర్ రైళ్లు రద్దు

Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. కరోనా కారణంగా 55 పాసింజర్ రైళ్లు రద్దు

YSRCP: ‘మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ

YSRCP: ‘మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ

Amar Jawan Jyoti : ఢిల్లీలో ఇక "అమర్ జవాన్ జ్యోతి" కనిపించదు.. ఆర్పడం కాదు విలీనం చేస్తున్నామన్నకేంద్రం !

Amar Jawan Jyoti : ఢిల్లీలో ఇక

Khammam: ఖమ్మం మాస్‌ లీడర్‌, మాజీ మంత్రి ఫ్యామిలీ పాలిటిక్స్‌కు దూరం.. పూర్వవైభవం తెచ్చేదెవరో..!

Khammam: ఖమ్మం మాస్‌ లీడర్‌, మాజీ మంత్రి ఫ్యామిలీ పాలిటిక్స్‌కు దూరం.. పూర్వవైభవం తెచ్చేదెవరో..!

Hyderabad: ‘నిన్ను పెళ్లి చేసుకోను.. ఇంకొకరితో కానివ్వను.. కాదని చేసుకుంటే..’ హైదరాబాద్‌లో సైకో లవర్ హల్‌చల్

Hyderabad: ‘నిన్ను పెళ్లి చేసుకోను.. ఇంకొకరితో కానివ్వను.. కాదని చేసుకుంటే..’ హైదరాబాద్‌లో సైకో లవర్ హల్‌చల్
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Hyderabad Microsoft : హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల గిఫ్ట్.. రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్ !

Hyderabad Microsoft :  హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల గిఫ్ట్.. రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్ !

Balakrishna: అభిమానులూ... బాలయ్యను కలుస్తారా? మీకు ఇదొక మంచి ఛాన్స్!

Balakrishna: అభిమానులూ... బాలయ్యను కలుస్తారా? మీకు ఇదొక మంచి ఛాన్స్!

T20 World Cup 2022: ఈ సారి తగ్గేదే లే! ఈ ప్రపంచకప్‌లోనూ పాక్‌తోనే టీమ్‌ఇండియా తొలి పోరు

T20 World Cup 2022: ఈ సారి తగ్గేదే లే! ఈ ప్రపంచకప్‌లోనూ పాక్‌తోనే టీమ్‌ఇండియా తొలి పోరు

Samantha: విడాకుల అనౌన్స్మెంట్.. పోస్ట్ డిలీట్ చేసిన సమంత..

Samantha: విడాకుల అనౌన్స్మెంట్.. పోస్ట్ డిలీట్ చేసిన సమంత..