News
News
X

Pakistan Mindest : ఆమె వేసుకున్న బ్రా కలరే వాళ్లకు ముఖ్యం... స్వాతంత్ర్యం దినోత్సవం కాదు ! పాకిస్తాన్ జనం తీరుపై నటి ఫైర్

ఆగస్టు 14వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న పాకిస్తాన్‌ ప్రజలకు ఆ దేశ నటి హయత్ శుభాకాంక్షలు చెప్పారు. కానీ సోషల్ మీడియాలో అక్కడి ప్రజలు ఆమె వేసుకున్న బ్రా గురించి చర్చలు పెట్టుకున్నారు.

FOLLOW US: 
Share:

రామాయణం అంతా విని రాముడికి సీత ఏమువుతుంది అని అడిగేవారిని గూట్లే అని తిడితే ఏమనుకుంటారు..?  గూట్లే అంటే ఏమిటండి అని అడుగుతారు..!  ఇలాంటి వాళ్లు పాకిస్తాన్‌లో కోకొల్లలుగా ఉన్నారు. వీళ్లను ప్రత్యేకంగా బయటకు తేవాల్సిన పని లేదు. వారంతటకు వారే వస్తారు. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంది. ఆ సందర్భంగా చిన్నా.. పెద్దా సెలబ్రిటీలు ఉందరూ తమ దేశ ప్రజలకు శుభాకాంక్షాలు చెప్పారు. అలాగే మెహ్‌విష్‌ హయత్ అనే నటి కూడా తమ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పింది. సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసి.. దాని కింద "  ఐక్యమైన ప్రయత్నం.. దేవుడిపై విశ్వాసం ఉన్నప్పుడే మనం కలల పాకిస్తాన్‌ని వాస్తవంగా మార్చగలము.  జెండాను ఎగురవేయడం సరిపోదు,  నిజంగా ఈ దేశాన్ని గౌరవిస్తే .. ఆదర్శంగా ఉండాలి .. అందరికీ  స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..." అని రాసుకొచ్చింది.

మనం భారతీయులందరూ సహోదరులు...సోదరీమణులు అని చెప్పుకుంటున్నట్లే... ఆమె కూడా తోటి పాకిస్తానీయులందరూ సోదరులు..సోదరీమణులు అనుకుని శుభాకాంక్షలు చెప్పింది. అయితే అక్కడ జనం మాత్రం అలా అనుకోలేదు. ఆమె తెల్లని డ్రెస్ వేసుకుని పాకిస్థాన్ జెండా పట్టుకుని దిగిన ఫోటోను పెట్టి శుభాకాంక్షలు చెప్పింది. కానీ పాకిస్థాన్ ప్రజలు మాత్రం ఆమె డ్రెస్‌ను చూడలేదు..  చేతిలో ఉన్న పాకిస్థాన్ జెండాను చూడలేదు.. ఇంకా చెప్పాలంటే స్వాతంత్ర్య దినోత్సవ  వేడుకల సమయం అని కూడా చూడలేదు... వారి చూసిందల్లా...  ఆమె తెల్లని డ్రెస్ వెనుక వేసుకున్న బ్రా కలరేంటి అని. అంతే ఆమె ఆ శుభాకాంక్షలు చెప్పిన సోషల్ మీడియా ఖాతాల్లోనే హయత్ వేసుకున్న బ్రా కలర్ గురించి చర్చలు ప్రారంభించేశారు. దీన్ని చూసి ఆ నటికి పిచ్చెక్కిపోయింది.  ఆమె ఎలాంటి పాకిస్తాన్‌ను ఆశించిందో  పోస్టులో చెప్పింది .. కానీ ఇక్కడ అదే పోస్టు కింద జరుగుతున్న చర్చ చూసి.. సహనం కోల్పోయింది. 

మనషులు ఎంత వక్రబుద్దితో ఉన్నారో దీన్ని బట్టి తెలిసిపోతోందని మండిపడ్డింది. బ్రా కలర్ ఏదైతే మీకేంటని ప్రశ్నించింది.   పాకిస్థాన్ కోసం పరిష్కరించాల్సిన అవసరం ఉన్న పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయని.. వాటిపై సమయం వెచ్చించాలని నెటిజన్లరు హయత్ సూచించారు. నిజానికి పాకిస్తాన్‌లో మహిళకు కనీస గౌరవం దక్కదు. నటీ నటుల్ని కూడా నీచంగా చూస్తారు. హయత్‌కు కూడా అలాంటి అనుభవమే ఎదురయింది. అయితే తమ దేశం.. తమ దేశ ప్రజలు ఎదుగుతున్నారని ఆమె అనుకుంది. కానీ ఎదగలేదు.. దిగజారిపోయారని తన బ్రా కలర్‌పై చర్చ పెట్టినప్పుడే అర్థమైపోయి ఉంటుంది. 

Published at : 20 Aug 2021 08:21 PM (IST) Tags: Pakistan Mehwish Hayat bra colour Independence Day post pakistan actor

సంబంధిత కథనాలు

ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్‌ ఉన్న ట్రక్‌ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు

ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్‌ ఉన్న ట్రక్‌ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు

Pakistan Blast: మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడి, 28 మంది మృతి - పాక్‌లో దారుణం

Pakistan Blast: మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడి, 28 మంది మృతి - పాక్‌లో దారుణం

Balochistan Bus Accident : బలూచిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 41 మంది మృతి

Balochistan Bus Accident : బలూచిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 41 మంది మృతి

UK PM Rishi Sunak: పాలనలో రిషి సునాక్ మార్క్ - సొంత పార్టీ ఛైర్మన్‌పై వేటు వేసిన బ్రిటన్ ప్రధాని

UK PM Rishi Sunak: పాలనలో రిషి సునాక్ మార్క్ - సొంత పార్టీ ఛైర్మన్‌పై వేటు వేసిన బ్రిటన్ ప్రధాని

Pakistan Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం, రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదు

Pakistan Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం, రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదు

టాప్ స్టోరీస్

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపూనకు జీవిత ఖైదు విధించిన గుజరాత్ కోర్ట్

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపూనకు జీవిత ఖైదు విధించిన గుజరాత్ కోర్ట్

TS Assembly : ప్రసంగంలో మార్పులు సూచించిన గవర్నర్ - వాస్తవ అంశాలే ఉంటాయన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి !

TS Assembly : ప్రసంగంలో మార్పులు సూచించిన గవర్నర్ - వాస్తవ అంశాలే ఉంటాయన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి !

Stock Market News: బడ్జెట్‌ ముందు పాజిటివ్‌గా స్టాక్‌ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!

Stock Market News: బడ్జెట్‌ ముందు పాజిటివ్‌గా స్టాక్‌ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!

ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?

ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?