అన్వేషించండి

CM Jagan : విద్యార్థుల సిలబస్‌లో ఏఐ తప్పనిసరి కావాలి - సీఎం జగన్ ఆకాంక్ష !

విద్యా కరికులంలో ఏఐ భాగంకావాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వైస్ చాన్సలర్లతో జరిగిన భేటీలో ఆయన పలు ఆలోచనలు వెల్లడించారు.

 

CM jagan :    విద్యా వ్యవస్థలో  వర్చువల్‌ రియాలిటీ ,  అగ్‌మెంటెడ్‌ రియాలిటీ ,  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లు సిలబస్‌లో  భాగంగా ఉండాలని.. సీఎం జగన్ ఆకాంక్షించారు.  టెక్నాలజీల సాంకేతికతను విద్యా వ్యవస్థలో పెంచాల్సి ఉందన్నారు.  లో లెవల్‌ మెషిన్‌ లెర్నింగ్, మెటావర్స్‌తో మిళితం చేయాలి. మన విద్యార్థులు ఏఐలో నిష్ణాతులుగా మారి, ఆ తర్వాత క్రియేటర్లుగా రాణించేలా ఇక్కడి నుంచే తొలి అడుగు వేయాలి. అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్య స్థాయిలో వేర్వేరుగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైస్ చాన్సలర్లతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ తన ఆలోచనలు వివరించారు.  అత్యుత్తమ ప్రతిభావంతుల ద్వారా పాశ్చాత్య దేశాల విద్యా విధానంలోని అంశాలతో మన కరిక్యులమ్‌ను రీడిజైన్‌ చేద్దామని పిలుపునిచ్ారు. 

ఆంధ్రప్రదేశ్‌ విద్యా విధానంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ బోధన, నేర్చుకునే సామర్థ్యం పెంచడంతో పాటు.. వారిని ఏఐ క్రియేటర్లుగా తీర్చిదిద్దేలా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్సిటీల వీసీలకు పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్‌లో ఏఐ ఒక భాగం కావాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు విద్యా విధానాన్ని ఏఐ మార్చబోతోందని, ఈ రూపంలో ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.

బోధన, నైపుణ్యాభివృద్ధిలో తొలిసారిగా ఎమర్జింగ్‌ టెక్నాలజీ అనుసంధానం చేసేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా శాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రాక్టికల్‌ అప్లికబులిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ను తీసుకురావడంతో పాటు మరిన్ని వర్టికల్స్‌ చదువుకునే అవకాశం ఇవ్వాలన్నారు.
 
  ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. అందుకు తగ్గట్టుగా మనం చదువులు అందిస్తున్నామో లేదో ఆలోచించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ విప్లవం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో మనం వెనుకబడితే కేవలం అనుసరించే వాళ్లుగానే మిగిలిపోతాం. ఏఐ అభివృద్ధి చెందేకొద్దీ.. దానిని వినియోగించుకుని, సామర్థ్యాన్ని పెంచుకునే వర్గం ఒకటైతే.. ఏఐని క్రియేట్‌ చేసే వర్గం మరొకటి తయారవుతుందని జోస్యం  చెప్పారు.  జర్మనీ వంటి దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉంది.  భారతదేశంలోనైనా.. ఆంధ్రప్రదేశ్‌లో చూసినా సుమారు 70 శాతం మంది పనిచేసే వయస్కులు ఉన్నారు. వీరికి సరైన విజ్ఞానం, నైపుణ్యం అందించేందకు విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలన్నారు. 
 
  మన వాళ్లు మంచి డిగ్రీ కోసం విదేశాలకు వెళ్లాల్సిందే. ఏపీలో చదువుకునే విద్యార్థులకు నచ్చిన వర్టికల్స్‌ చదువుకునే అవకాశాలు ఇవ్వాలి. తాజాగా డిగ్రీలకు సంబంధించి క్రెడిట్స్‌ ఇస్తున్నాం. ఇకపై వాటి స్థాయిని పెంచుతూ ప్రతి ఫ్యాకల్టీలో ఎక్కువ ఆప్షన్లలో బోధన సాగించాలి. ఇప్పటికే ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. విద్యార్థుల ఉన్నతికి ఇలాంటి ఎన్నో మార్పులు అవసరమ్నారు.  సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వర్టికల్‌ కోర్సులకు బోధన సామర్థ్యం మన దగ్గర అందుబాటులో లేకపోతే.. వర్చువల్‌ రియాలిటీని.. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీతో అనుసంధానించి వర్చువల్‌ క్లాస్‌ టీచర్‌ ద్వారా పాఠాలు చెప్పిద్దామన్నరు.  

వైద్య విద్య కోర్సుల్లోని బోధన పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలి. భవిష్యత్తులో ఐదేళ్ల మెడికల్‌ కోర్సులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి. శరీర భాగాలను కోసి ఆపరేషన్‌ చేసే రోజులు మారిపోయాయి. కంప్యూటర్ల ద్వారా ఏఐను వాడకుని చిన్న చిన్న రంధ్రాలతో ఆపరేషన్‌ చేస్తున్నారు. అందుకే వైద్య విద్యలో రోబోటిక్స్, ఏఐలను భాగస్వామ్యం చేయాలన్నారు.  ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్‌ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోని పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాల సరళి మన కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ టెక్ట్ బుక్స్‌ విద్యార్థులకు ఇచ్చి సమాధానాలు రాయిస్తారు. తద్వారా ప్రాక్టికల్‌ అప్లికబిలిటీని పరీక్షిస్తారు. అందుకే మనదగ్గర కూడా ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలన్నారు.  


విద్యా వ్యవస్థలో పాఠశాల స్థాయి నుంచే సమూల మార్పులు రావాలి. ఇప్పటికే మనం ఆ దిశగా చర్యలు చేపట్టాం. ఇంగ్లిష్‌ మీడియం చదువులు, బైలింగ్వల్‌ పాఠ్య పుస్తకాలు, ఆరో తరగతి నుంచి డిజిటల్‌ బోధనను తీసుకొచ్చాం. డిసెంబర్‌ నాటికి 63 వేల క్లాస్‌ రూమ్స్‌ను ఐఎఫ్‌పీ ఫ్యానెల్స్‌తో డిజిటలైజ్‌ చేస్తున్నాం. ఇప్పటికే 31 వేల తరగతి గదుల్లో ప్యానెల్స్‌ ఏర్పాటు చేశామన్నారు.   విద్యా రంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే.. లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే వైస్‌ చాన్సలర్లు కూడా ఆలోచించాలన్నారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget