అన్వేషించండి

Andhra News : ఆ ఊళ్లో వైసీపీ ముద్ర పడాల్సిందే - వాలంటీర్లు చేసిన రచ్చ గురించి తెలిస్తే !

Andhra News : శింగనమల నియోజవర్గంలో వాలంటీర్లు అన్ని నిబంధనలు అధిగమించారు. తమ పరిధిలోని ప్రతి ఇంటకి వైసీపీ జెండా కట్టారు.


 
Andhra News : ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నరన్న  విమర్శలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే పలు ప్రాంతాల్లో వైసీపీ విషయంలో వారు చేస్తున్న కార్యక్రమాలు వైరల్ అవుతన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా  శింగనమల నియోజకవర్గంలోని  వాలంటీర్లు చేసిన పని అందర్నీ ఆశ్చర్య పరిచింది.  బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ప్రజలకు ఇష్టమున్నా లేకపోయినా తమ ఇళ్లపై వైసిపి జెండా ఎగరాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారు స్థానిక నాయకులు. ఇంటిపైన వైసీపీ జెండా కట్టించుకోకపోతే ప్రభుత్వము నుంచి వచ్చే సంక్షేమ  పథకాలను తొలగిస్తామని వాలెంటరి ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు.                                       

వలంటీర్లు తమ పరిధిలో ఉన్న 50 ఇళ్లకు వెళ్లి జెండాలు కట్టిస్తున్నారు. ‘చంద్రబాబు అమలు చేసిన పథకాలు ఎలా ఉన్నాయి? జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలు ఎలా ఉన్నాయి?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్షలో జగన్‌కు పదికి పది మార్కులు, చంద్రబాబుకు సున్నా మార్కులు వేయకపోతే పథకాలు రావని కొందరు గ్రామ వలంటీర్లు బెదిరింపులకు దిగుతున్నారు. చివరగా జగన్‌ పరిపాలన బాగుందని ఆ ఇంట్లోవారితో చెప్పించి, అందుకు సాక్ష్యంగా ఓ సెల్ఫీదిగి.. వైసీపీ నాయకుల వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు.                                  

ఆపు బాబు నాటకం  ...జగనే  మా నమ్మకం అనే స్టాంపును గ్రామాల్లో ఉన్న ఇండ్లకు కొందరు స్థానికులు వద్దంటున్నా కూడా బలవంతంగా వాలంటీర్లు వేస్తున్నారు.అంతటితో ఆగకుండా  వాటిని సెల్ఫి తీసి   సంతకం చేసి సోషల్ మీడియా గ్రూపులలో పోస్టు చేస్తున్నారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది . స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతా పార్టీ పెద్దలకు సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి తెలిసే జరుగుతోందా..? లేక మండల నాయకులు అత్యుత్సాహంతో వాలంటీర్ల ద్వారా ఇలా చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.                            

 ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారో, లేదో తెలుసుకోవడానికి వలంటీర్లతో ఇలా బలవంతపు సర్వే చేయిస్తున్నారు. దీనికోసం మండలానికో కన్వీనర్‌ను వైసీపీ ఏర్పాటు చేసింది. చాలామంది వలంటీర్లు ఇష్టం లేకుండానే ఈ సర్వేలో పాల్గొని, సెల్ఫీ దిగుతున్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఓ క్రాంటాక్టు ఉద్యోగి వద్దకు వలంటీరు వెళ్లి ‘నువ్వు కూడా ఫొటో దిగాలి. లేకపోతే ఉద్యోగం నుంచి తొలగించాలని వైసీపీ నాయకులకు చెబుతా..’ అని బెదిరించారు. ఇంటికి కచ్చితంగా వైసీపీ జెండా కట్టి, సెల్ఫీ దిగాలనడంతో సదరు ఉద్యోగి ఆ పని చేయక తప్పడం లేదన్న  విమర్శలు వినిపిస్తున్నాయి.              

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Viral Video: 'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget