By: ABP Desam | Updated at : 17 Feb 2023 10:13 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
చంద్రబాబు
Chandrababu : రాష్ట్రంలో పోలీసుల రాజ్యం కూడా కాదు రౌడీరాజ్యం నడుస్తుందని టీడీపీ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలభద్రపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడంతో 7 కిలోమీటర్లు కాలినడకన అనపర్తి చేరుకున్నారు చంద్రబాబు. అనంతరం సభలో చంద్రబాబు మాట్లాడుతూ... ఇవాళ సహాయ నిరాకరణ చేస్తున్న ప్రతి పోలీసును గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. సీఎం జగన్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ అంతానికి ఇది ప్రజాతిరుగుబాటు అన్నారు. పోలీసులు దారి ఇవ్వకపోతే ముందుకు దూసుకెళ్తామన్నారు. ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామన్నారు. రౌడీరాజ్యం అంతం చేసేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభం అయిందని చంద్రబాబు అల్టిమేటం జారీచేశారు.
సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో చంద్రబాబు ప్రసంగం
అనపర్తి దేవీ చౌక్ వద్ద పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సభ నిర్వహించకూడదని చెప్తూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. టీడీపీ కార్యకర్తల సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రం కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానని చంద్రబాబు అన్నారు. అనపర్తిలో సభకు అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేశారని మండిపడ్డారు. జగ్గంపేట, పెద్దాపురం వెళ్తే పోలీసులు సహకరించారని, అనపర్తిలో గ్రావెల్ సూర్యనారాయణ వల్ల పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖబడ్దార్ గ్రావెల్ సూర్యనారాయణ, నాతో పెట్టుకుంటున్నావు అంటూ హెచ్చరించారు. జగన్ చెప్పినట్లు చేస్తే అధికారులు ఇబ్బంది పడతారని, తర్వాత నా దగ్గరే పనిచేయాలి గుర్తుపెట్టుకోవాలని పోలీసులను హెచ్చరించారు. పోలీసులు ఇవాళ ప్రవర్తించిన తీరుకు ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుందన్నారు. అనపర్తి నుంచే పోలీసులకు సహాయక నిరాకరణ ప్రారంభించామని చంద్రబాబు ప్రకటించారు. పోలీసుల సరిగాలేదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మిమ్మల్ని కూడా జైల్లో పెట్టిస్తానన్నారు. ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు మా ప్రభుత్వం అడ్డుపడిందా అని ప్రశ్నించారు. అప్పుడు లేని ఆంక్షలను ఇప్పుడెందుకు అని నిలదీశారు. ఒక మాజీ సీఎంపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. తానేమైనా పాకిస్థాన్ నుంచి వచ్చానా, ఎందుకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను కొట్టడం పోలీసులకు మంచిది కాదన్నారు.
కాలినడకన అనపర్తికి
అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తత మధ్యసాగింది. అనపర్తి దేవిచౌక్‌లో బహిరంగ సభకు అనుమతి లేదని ఆఖరి నిమిషంలో పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. చంద్రబాబును అనపర్తి రానీయకుండా మార్గమధ్యలో అడ్డుకున్నారు పోలీసులు. సామర్లకోట నుంచి అనపర్తి బయల్దేరిన చంద్రబాబును బలభద్రపురం వద్ద అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంగా పోలీసు వాహనం పెట్టారు. పోలీస్ కానిస్టేబుళ్లు రోడ్డుపై కూర్చొని చంద్రబాబు కాన్వాయ్ ను ముందుకు రానివ్వలేదు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ దిగి కాలినడకన అనపర్తి వచ్చారు. లక్ష్మీనర్సాపురం వద్ద పోలీసులు మరొక బస్సును రోడ్డుకు అడ్డంగా పెట్టి చంద్రబాబును నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు వాటన్నింటినీ దాటుకుని సెల్‌ఫోన్ లైట్ వెలుతురులోనే ఏడు కిలోమీటర్లు పాదయాత్రగా అనపర్తి చేరుకున్నారు. అనపర్తి చేరుకున్న చంద్రబాబుకు సభకు అనుమతి లేదని చెప్పారు. సభ నిర్వహించకుండా ఉండాలనే ఉద్దేశంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
YSRCP Fail : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పెక్కడ జరిగింది ? - ఎమ్మెల్సీ ఫలితంపై వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !
America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!
KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే?
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
TDP On Mlc Elections : ఇది కదా దేవుడి స్క్రిప్ట్, జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది - గంటా శ్రీనివాసరావు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు
Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి