అన్వేషించండి

Police complaint about uncooked mutton: మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!

Mutton Problem: అనంతపురంలో ఓ వ్యక్తి మటన్ తీసుకుని పోలీస స్టేషన్ కు వచ్చాడు. మటన్ ఎంత వండినా ఉడకడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఏం జరిగిందంటే?

Police complaint about uncooked mutton in Anantapur: సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే గొడవలు, దొంగతనాలు లేదా ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తుంటాయి. కానీ, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. తాను మార్కెట్లో కొనుగోలు చేసిన మటన్ ఎంత వండినా ఉడకడం లేదని, సదరు దుకాణదారుడు తనను మోసం చేశాడంటూ నేరుగా పోలీసులనే ఆశ్రయించాడు ఈ మటన్ బాధితుడు.                 

మార్కెట్‌లో మటన్ కొనుగోలు చేసి వండటానికి ప్రయత్నించిన హాజీ                            

తాడిపత్రికి చెందిన  సోడాల హాజీ అనే వ్యక్తి స్థానిక మార్కెట్‌లో మటన్ కొనుగోలు చేసి ఎంతో ఆశగా ఇంటికి తీసుకెళ్లాడు. రుచికరమైన కూర వండుకుందామని కుక్కర్‌లో పెట్టి ఉడికించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20 విజిల్స్ వేయించినా ఆ మాంసం అస్సలు మెత్తబడలేదు. ఎంత సేపు వండినా రాయిలాగే ఉండటంతో ఆ వ్యక్తికి చిర్రెత్తుకొచ్చింది. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న మాంసం ఇలా ఉడకకపోవడంతో, దుకాణదారుడు తనకు ముదురు మాంసం , నాసిరకం మాంసం ఇచ్చి మోసం చేశాడని భావించాడు.                    

గ్యాస్ అయిపోయిన ఉడకకపోవడంతో మాంసం తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు ..           

వెంటనే ఆలస్యం చేయకుండా, ఉడకని ఆ మటన్ ముక్కలను ఒక కవర్‌లో వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న పోలీసులకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సార్, ఇదిగోండి చూడండి.. 20 విజిల్స్ వేయించినా ఈ మటన్ అస్సలు ఉడకడం లేదు. నా డబ్బులు, గ్యాస్, సమయం అన్నీ వృధా అయ్యాయి. ఆ షాపు యజమానిపై చర్యలు తీసుకోండి అంటూ రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఈ వింత గోల చూసి అక్కడున్న వారంతా నవ్వుకోగా, పోలీసులు మాత్రం ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు.             

సర్ది చెప్పి పంపేసిన పోలీసులు                                                  

చిన్న చిన్న గొడవలు, ఇంటి సమస్యలకే స్టేషన్లకు వస్తున్న ఈ రోజుల్లో, ఏకంగా మటన్ ఉడకలేదని ఒక వ్యక్తి స్టేషన్‌కు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు ఆ వ్యక్తికి నచ్చజెప్పి పంపించినప్పటికీ, ఈ మటన్ ముచ్చట మాత్రం తాడిపత్రి ప్రాంతంలో నవ్వులు పూయిస్తోంది. నెటిజన్లు కూడా  బహుశా అది ఐరన్ మటన్ ఏమో అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget