Paritala Sunita: అనంతపురం కుంటిమద్దిలో ఉద్రిక్తత... పోలీసులపై పరిటాల సునీత ఫైర్... నీరు-చెట్టు పైలాన్ ధ్వంసంపై ఆగ్రహం
వైఎస్ఆర్సీపీ నేతల దౌర్జన్యాలను పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. నీరు-చెట్టు పైలాన్ ధ్వంసంపై ఆమె నిరసన చేపట్టారు. ఈ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
వైఎస్ఆర్సీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం కుంటిమద్దిలో నీరు-చెట్టు పైలాన్ పగులగొట్టి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై పరిటాల సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటివి మామూలేనని రామగిరి ఎస్సై సమాధానం చెప్పారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి కుంటిమద్ది చెరువుకట్టపై పైలాన్ వద్ద బైఠాయించిన ఆమె ఆందోళన చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని పరిటాల సునీత నిలదీశారు. పైలాన్ ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళన విరమించాలని పరిటాల సునీతను కోరగా, ఆమె వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం ఇలా చూస్తూ ఉంటారని, చర్యలు తీసుకోవటం చేతకాదా అంటూ పోలీసుల తీరును ప్రశ్నించారు.
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం కుంటిమద్ది చెరువు కట్టమీద ఉన్న నీరు - చెట్టు పైలాన్ శిలాఫలకాన్ని గత రాత్రి ధ్వంసం చేసిన వైసీపీ నేతలు.. ఈ చర్యలను నిరసిస్తూ.. స్థానిక నేతలతో కలసి నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొని, ధ్వంసమైన శిలా ఫలకాలను పరిశీలించడం జరిగింది. pic.twitter.com/XWgCCrRJjh
— Paritala Sreeram (@IParitalaSriram) October 18, 2021
విద్యుత్ కోతలపై ప్రజల్ని మోసం చేస్తున్నారు : ఎంపీ కనకమేడల
విద్యుత్ సంక్షోభంపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. దేశమంతా విద్యుత్ కొరతలున్నాయంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. సీఎం జగన్ సతీమణి నిర్వహణలో ఉన్న సండూర్ పవర్ నుంచి విద్యుత్ కొనడానికే ప్రభుత్వం కృత్రిమ విద్యుత్ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. సింగరేణి, మహానది కోల్‌ఫీల్డ్స్‌కు రూ.4,500 కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఎంపీ అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.12 వేల కోట్ల భారం వేసిందని ఆయన తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్‌పై తక్షణమే వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తాం... రూ.కోటి నిధి ఏర్పాటు చేస్తామని పవన్ ట్వీట్
వైసీపీ దుబారా ఖర్చులు : అయ్యన్న పాత్రుడు
వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. సోమవారం మీడియా మాట్లాడిన ఆయన పరిపాలన చేతకాని వారికి ఓట్లు వేస్తే ఎలా ఉంటుందో అర్థమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటి? చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ కూడా అప్పులు తీసుకొచ్చామని, అభివృద్ధి కోసం ఖర్చు చేశామన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తుందని ఆరోపించారు. బ్రాందీ షాపులు 25 ఏళ్లు తాకట్టు పెట్టి మళ్లీ మద్యపాన నిషేధం అంటున్నారని ఎద్దేవా చేశారు.
Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలోకి రఘురామ .. కానీ ఎన్నికలెప్పుడు ?