అన్వేషించండి

Sri Sathya Sai District Politics: సెగలు రేపుతున్న సత్యసాయి జిల్లా పాలిటిక్స్ - అవినీతిపై ముఖాముఖి చర్చకు కదిరి టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు

Kadiri Wakf Board Lands Issue: సత్యసాయి జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఆరోపణలు, పరస్పర సవాళ్లతో రాజకీయం వేడెక్కుతోంది. కదిరిలో ఓపెన్ డిబేట్‌కు.. ఎమ్మెల్యేకు.. వైసీపీ నేత సవాల్ చేశారు.

Kadiri Politics AP 2026:  సత్యసాయి జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్,  వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మధ్య నడుస్తున్న వ్యక్తిగత ఆరోపణలు, సవాళ్లు కదిరి రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు అవినీతి, కబ్జాలు, కుటుంబ సభ్యులపై ఆరోపణలతో బహిరంగ చర్చలకు సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.
   
జగన్ సతీమణిని అవమానించడంపై ఆగ్రహం

కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాయి వేరు.. ఆయన తండ్రి వైఎస్సార్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి నాయకుడి భార్యను అకారణంగా రాజకీయాల్లోకి లాగి అవమానిస్తావా అంటూ ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యేను నిలదీశారు. నీతి, నిజాయితీల గురించి మాట్లాడే ముందు ఎమ్మెల్యే తన గతం, చరిత్ర గురించి ఆలోచించుకోవాలని, మహిళల గురించి మాట్లాడే ముందు కొంత సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు.

మద్యం షాపుల దందా – కబ్జాలపై సంచలన ఆరోపణలు

ఎమ్మెల్యే ప్రసాద్ అవినీతి గురించి మాట్లాడితే కదిరి ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రవీణ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కదిరి నియోజకవర్గంలో బ్రాందీ షాపులు, పల్లెల్లో బెల్ట్ షాపులు పెట్టించి.. మద్యం బాటిల్‌పై రూ. 20 నుండి రూ. 40 వరకు అధికంగా అమ్మించి కమిషన్లు దండుకుంటోంది ఎమ్మెల్యే కాదా? అని ప్రశ్నించారు. ఆ అక్రమంగా వసూలు చేసిన డబ్బులు మీ ఇంట్లో వాళ్లు ఇస్తున్నారా అని మేము అడిగితే అది తప్పు అవుతుందా? అని ఘాటుగా నిలదీశారు. అంతేకాకుండా, కదిరిలో ఎమ్మెల్యే తన ఇంటి ముందున్న దేవుడి మాన్యం స్థలాన్ని 15 ఏళ్లుగా కబ్జా చేసి సొంత పార్కింగ్‌గా వాడుకోవడం నిజం కాదా అంటూ దేవాదాయ శాఖ భూముల కబ్జాపై సంచలన ఆరోపణలు చేశారు.

 మైనార్టీల ఆస్తులపై కన్ను – షాదీ మహల్ మూసివేత 

గడిచిన రెండున్నరేళ్ల కాలంలో కదిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా కదిరిలో మైనార్టీ ముస్లింలపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  పేద ముస్లింలు పెళ్లిళ్లు చేసుకునే ప్రభుత్వ షాదీ మహల్‌కు రెండున్నరేళ్లుగా ఎందుకు తాళాలు వేశారు? వారు చేసిన పాపం ఏంటి?  అని ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లు, కదిరి కాలేజీ సర్కిల్‌లో కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ బోర్డు స్థలంలో ముస్లింల సమాధులను సైతం తొలగించి, ఆ స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా వేసి అమ్ముకోవాలని ఎమ్మెల్యే ప్రయత్నించడం వాస్తవం కాదా అంటూ నిలదీశారు.

 అనుచరులను బలిచేయొద్దు – డైరెక్ట్ డిబేట్‌కు సై 

కదిరిలో తాను అడిగిన సూటి ప్రశ్నలకు ఎమ్మెల్యే ప్రసాద్ నేరుగా సమాధానం చెప్పాలని, తన అనుచరులను  ప్రయోగించి పారిపోవద్దని ప్రవీణ్ రెడ్డి సవాల్ విసిరారు.  వారిని బలి చేయవద్దు. రేపు ప్రభుత్వం మారితే నీకంటే ముందు వాళ్లే కేసుల్లో ఇరుక్కుంటారు, అప్పుడు వారి పరిస్థితి ఏమిటో ఆలోచించు అని హెచ్చరించారు.  మనం ఇద్దరం నేరుగా కూర్చుని కదిరి అభివృద్ధిపై, కబ్జాలపై మాట్లాడుకుందాం. ఏ చర్చకైనా నేను సిద్ధం  అంటూ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. 

ప్రస్తుతం కదిరిలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. భూకబ్జాలు, మద్యం మాఫియా, వక్ఫ్ ఆస్తుల ఆక్రమణల వంటి కీలకమైన ఆరోపణలు తెరపైకి రావడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. ప్రవీణ్ రెడ్డి విసిరిన ఈ సవాళ్లపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ,  టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో, ఈ బహిరంగ చర్చ సవాల్ ఎక్కడి వరకు దారితీస్తుందో అని కదిరి ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget