Guntur Murders: గుంటూరు జిల్లాలో దారుణం.. తల్లీకుమార్తెను కత్తితో పొడిచి చంపిన దుండగుడు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగర్జుననగర్ లో దారుణం జరిగింది. ఓ దుండగుడు తల్లీకుమార్తెను కత్తితో పొడిచి చంపాడు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్‌లో దారుణం జరిగింది. తల్లి, కుమార్తెను దుండగుడు కత్తితో నరికి చంపాడు. హత్యలకు ఆస్తి పంపకాల గొడవే కారణమని అనుమానిస్తున్నారు. మృతులు తల్లి పద్మావతి(55), ప్రత్యూష(25)గా గుర్తించారు. ఈ ఘటన సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయింతే బంధువే ఈ హత్యలకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది.
అవే చివరి మాటలు
తల్లీ కుమార్తెలను వారి బంధువే అతి పాశవికంగా హతమార్చాడు. తల్లీ కుమార్తె ఇంట్లోనే రక్తపుమడుగులో విగతజీవులుగా ఉన్నారు. ఇళ్లంతా రక్తం, రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్న తల్లిని చూస్తూ, కత్తిపోట్ల బాధతో యువతి తన సోదరుడికి ఫోన్ చేసింది. శ్రీనివాస్ అమ్మను, తనను పొడిచాడని తెలిపింది. ఇవే ఆమె చివరి మాటలు. యువతిని ఆసుపత్రికి తరలించేలోపు మార్గమధ్యలో మృతిచెందింది.
గర్భిణి అని చూడకుండా
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. ఆస్తి వివాదమే ఈ జంట హత్యలకు కారణమైందని పోలీసులు స్పష్టం చేశారు. తల్లీ కుమార్తెలను వారి బంధువు శ్రీనివాస్ హతమార్చినట్లు డీఎస్పీ విజయభాస్కరరెడ్డి వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తెనపల్లి మండలం కట్టమూరు వీఆర్వోగా పనిచేసిన కోనూరు శివప్రసాద్ నాలుగేళ్ల కిందట చనిపోయారు. కారుణ్య నియామకం కింద ఆయన కుమారుడు లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి వెంకట సుగుణ పద్మావతితో కలిసి నాగార్జుననగర్‌లో ఉంటున్నారు లక్ష్మీనారాయణ. సోదరి లక్ష్మీప్రత్యూషకు పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన సాయితేజస్వికి ఇచ్చి 5 నెలల క్రింత వివాహం జరిపించారు. ప్రస్తుత గర్భిణి అయిన లక్ష్మీప్రత్యూష శ్రావణమాసం కావడంతో సారె కోసం పుట్టింటికి వచ్చింది.
పొలం వివాదం
లక్ష్మీనారాయణ కుటుంబానికి, వారి పెదనాన్న మధుసూదనరావు కుటుంబాల మధ్య పొలం వివాదం నడుస్తోంది. గుంటూరులో ఉంటున్న మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు శనివారం రాత్రి సత్తెనపల్లిలోని చిన్నాన్న ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. లక్ష్మీనారాయణ ఇంట్లో లేరని తెలుసుకుని, పద్మావతి, లక్ష్మీప్రత్యూషలపై శ్రీనివాసరావు కత్తితో దాడిచేశాడు. దీంతో తల్లి, కూతురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. నిందితుడు శ్రీనివాసరావు పట్టణ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోలు పోలీసులు సేకరించారు.
Also Read: Uthra Murder Case: పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంట్రస్టింగ్ కేసు ఇది
Also Read: Uthra Murder Case: పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంట్రస్టింగ్ కేసు ఇది