అన్వేషించండి

YS Jagan on Amaravati Legal Status: రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, చట్టబద్ధత కల్పించినా ప్రయోజనం ఉంటుందా? : వైఎస్ జగన్

అసెంబ్లీలో అమరావతిపై తీర్మానం ఏపీ సర్కార్ డ్రామా చేసిందని.. 2 లక్షల కోట్లు ఖర్చు భవిష్యత్తులో ఇంకెంత పెంచుతారోనని మాజీ సీఎం జగన్ కామెంట్ చేశారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

తాడేపల్లి: అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు తమ పార్టీ వ్యతిరేకం కాదని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని మనస్ఫూర్తిగా కోరుకున్న పార్టీ వైసీపీ అన్నారు. అయితే, గతంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్న జగన్.. అమరావతికి చట్టబద్ధతపై సైతం పలు అనుమానాలు లేవనెత్తారు. రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారికి అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు చురుగ్గా పాల్గొంటారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తుతారని జగన్ వివరించారు. లక్ష ఎకరాలకు 2 లక్షల కోట్లు ఖర్చు అవసరం అని చెబుతున్న చంద్రబాబు తన అవినీతిని పెంచుకుంటూ పోతున్నారని, చట్టబద్ధత పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ విమర్శించారు.

అమరావతికి చట్టబద్ధతపై ప్రశ్నలు..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో అమరావతి అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో అమరావతిపై తీర్మానం చేయడం ఏపీ ప్రభుత్వం చేసిన డ్రామా. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదమే లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది. కానీ రాష్ట్రానికెక్కడా రాజధానిపై రాజ్యాంగంలో పేర్కొనలేదు. రాష్ట్ర రాజధాని నిర్ణయంలో కేంద్రానికి అధికారం లేదని ప్రభుత్వమే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ రాజధాని మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఈరోజు అసెంబ్లీలో మార్పులు, సవరణలు చేసిన వాళ్లు మరోసారి, మరో ప్రభుత్వం అసెంబ్లీలో ఇలాంటి సవరణ చట్టాలు తేవడం వీలు కాదా?. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపితే కేంద్రం సానుకూల వైఖరితో ఆమోదం తెలుపుతుంది.

చంద్రబాబు ప్రకారం అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్ల ఖర్చు..

అమరావతి కోసం 50 వేల ఎకరాల్లో రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, వాటర్ వీటి కల్పనకు చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన లెక్కల ప్రకారం ఎకరాకు 2 కోట్లు అన్నారు. అంటే లక్ష కోట్లు అవుతుంది. సడన్‌గా మరో 50 వేల ఎకరాలు చేర్చారు. అంటే మరో లక్ష కోట్ల ఖర్చు పెరుగుతుంది. వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. చంద్రబాబు రూపొందించిన మాస్టర్ ప్లాన్ సడన్ గా ఎందుకు మార్చారు. దశబ్దాలు పట్టే ఈ పనులకు 2 లక్షల కోట్ల ఖర్చు ఇంకెంత పెరుగుతోంది. వారి నిర్ణయాల్లో క్లారిటీ లేదు. సింగపూర్ అన్నారు. వరల్డ్ క్లాస్ రాజధాని అని చెప్పి బహుబలి సెట్టింగ్స్ చూపించారని సెటైర్లు వేశారు.
  చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి ఏడేళ్లలో విడుదల చేసిన మొత్తం కేవలం 8 వేల కోట్లు మాత్రమే. ఈ లెక్కన 2 లక్షల కోట్లు ఖర్చుచేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది.  చేసిన పనులకు కూడా 10 శాతం బిల్లులు మంజూరు చేసి 8 శాతం కమీషన్లు పొందారు. అమరావతి రైతులకు చేసిందేమీ లేదు, కానీ వరల్డ్ క్లాస్ రాజధాని పేరుతో ఖర్చు మాత్రం లక్షల కోట్లకు పెంచుతూ పోతున్నారని జగన్ మండిపడ్డారు.

మండలి సభ్యులను చర్చకు ఎందుకు పిలవలేదు..
‘50 వేల ఎకరాలు అయితే అమరావతి మున్సిపాలిటీగా మాత్రమే ఉండిపోతుంది. అందుకే వేల ఎకరాలు చేర్చుతూ లక్షల కోట్ల ఖర్చు పెంచుతూ పోతున్నారు. SFTకి ఎక్కడా లేని విధంగా 11 నుంచి 14 వేలు ఎందుకు అవుతుంది. ఏ స్కామ్ ల వల్ల అమరావతి ఖర్చు పెరుగుతుంది. ఏం చేస్తున్నారని ఖర్చు పెరిగిందో ఐదున్నర గంటల అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు. కేవలం జగన్, వైసీపీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజలను డైవర్షన్ చేయడానికి చర్చించినట్లు నమ్మించారు. కానీ ఎమ్మెల్యేలను చర్చకు పిలిచి, చట్టసభల్లో భాగమైన కౌన్సిల్ సభ్యులను చర్చకు ఎందుకు పిలవలేదు. రాజధాని అమరావతిపై చర్చ జరిపితే కౌన్సిల్ లో వైసీసీ సభ్యులు కడిగి పారేస్తారని చంద్రబాబు ప్రభుత్వం భయపడింది. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఇటాంటి ట్రిక్స్ ప్లాన్ చేశారు.

2014 నుంచి ఇప్పటివరకూ 11 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా అమరావతిలో చంద్రబాబు ఉన్నారా. ఇప్పటికీ మీ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి. 2019 వరకు హైదరాబాద్ కు షటిల్ సర్వీస్ చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా వారానికి 5 రోజులు ఏపీలో, 2 రోజులు హైదరాబాద్ లో ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏపీలో ఉంటారో తెలియదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కో విమానం షటిల్ సర్వీస్ లా మారింది. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. చంద్రబాబు, కూటమి నేతలు ఇంకా గ్రాఫిక్స్ తో తమ అవినీతిని కప్పిపుచ్చుకుంటూ కుట్రలు చేస్తున్నారని’ జగన్ విమర్శించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget