Posani Krishna Murali: పవన్ కల్యాణ్ ఒక ఉన్మాది, దేవుడే కాపాడాలి - పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు
AP News Latest: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Posani Krishna Murali comments on Chandrababu Pawan Kalyan: వివిధ కేసుల్లో స్టేలపై బతుకుతున్న చంద్రబాబును జైల్లో పెట్టండి అని పురందేశ్వరి లేఖలెందుకు రాయడం లేదని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. మహిళా వాలంటీర్లపై అడ్డగోలు ఆరోపణలు చేసిన పవన్ క్షమాపణలు చెప్పాలి. విజయవాడలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన ఇంత ఉన్మాదిగా తయారయ్యాడంటే.. ఇక ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు.
‘‘వాలంటీర్లు నీ కొడుకులా తాగుబోతులు, తిరుగుబోతులు కాదు బాబూ.. కొన్ని వేల మంది ఆడపిల్లల జీవితాలను వాలంటీర్లు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఈ మధ్య కన్నీరు కార్చాడు. మగ వాలంటీర్లు ఆయన దృష్టిలో గోతాలు మోసేవారట. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వాలంటీర్లు తలుపు కొడతారని కూడా చంద్రబాబు మాట్లాడాడు. వీళ్లు చాలా దుర్మార్గులు అని చంద్రబాబు తెగ బాధ పడిపోయాడు. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కూడా, అర్ధరాత్రి పూట లేచి వాలంటీర్లు ఇంట్లోని ఆడపిల్లలని ఏం చేస్తున్నారో అంటూ బాధపడ్డాడట.
ఆడపిల్లలంటే నాకంతటి మమకారం, ప్రేమ అంటూ చెప్పుకొస్తున్నాడు. లక్ష్మీపార్వతి నాకు తల్లిలాంటిదంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మా అమ్మ అమ్మణమ్మ కంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తానని కూడా అన్నాడు. అలాంటి గొప్ప ఆడవాళ్లను, ఈ జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను పెట్టి దుర్మార్గం చేస్తారా అని చంద్రబాబు ఏడ్చాడు. వాలంటీర్లు ఒక మనవడిలా, అన్నలా, బిడ్డలా ఉంటారు కానీ.. నీ కొడుకులా ఓ పక్క పళ్లెం.. మరో పక్క గొళ్లెం మెయింటేన్ చేయరు.
జయప్రద జీవితం నాశనం
నారా చంద్రబాబుకి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే జయప్రద లాంటి పెద్ద హీరోయిన్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఎన్టీఆర్ ఇల్లాలిని బజారుకు ఈడ్చాడు. ఇదంతా చంద్రబాబు అండ్ కో.. హయాంలోనే జరిగింది. అరేయ్ రామోజీ అనడంలో తప్పేమి లేదు. మేమిద్దరం చాలా క్లోజ్. రోజూ పత్రికలో లక్ష్మీపార్వతి దుష్టశక్తి అని రాతలు రాసి ఆమె జీవితం నాశనం చేశాడు రామోజీ. కిలాడి రాధాకృష్ణ.. డెబ్బై ఏళ్ల ఎన్టీఆర్ ఇల్లాలిని.. ముప్పై ఏళ్ల కుర్రాడితో అంటగట్టాడు. వీళ్లందరికీ ఆడదంటే చాలా చీఫ్. బాలకృష్ణ మాటలే దానికి నిదర్శనం. ఆడది కనిపిస్తే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలని బాలకృష్ణ అంటాడు.
చంద్రబాబు కొడుకు తాగుతాడు.. తిరుగుబోతు. అతను ఎలాంటి వాడో, ఆడదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటాడో అందరికీ తెలుసు. అలాంటి వారిని వైఎస్సార్సీపీలో చూపించగలరా?జగన్ గురించి ఒక్క మాటైనా చెప్పగలరా? ఈ దొంగ వెధవలను అసలు నమ్మవద్దు. వాళ్ల ఏడుపు ఏంటంటే.. జగన్ గారిని దించాలి. దింపడానికి పైకైనా పంపిద్దాం.. ఏమైనా చేద్దాం అనేది వాళ్ల ఆలోచన.
సుజనా చౌదరిపై కరపత్రాలు పంచుతా
కమ్మ వాడైన సుజనా చౌదరి రూ.5,700 కోట్లు తిన్న మోసగాడు అని మరో కమ్మ వాడు రాధాకృష్ణ గ్రాండ్‌గా రాశాడు. అటువంటి కిలాడి విజయవాడ వెస్ట్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. సుజనా చౌదరి గురించి, అతని అక్రమాల గురించి నేను విజయవాడలో ప్రతి ఇంటికి కరపత్రాలు పంచుతా. వేల కోట్లు తిని మహారాజులా విజయవాడ వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు.. మనం ఓట్లు వేస్తామా? ఇలాంటి దొంగలను మనం కులం పేరిట ఎందుకు వదిలేయాలి? ఇతని కంటే నంబర్ వన్ కిలాడి.. నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబు ప్రారంభంలో నాకంటే పేదవాడు.. నాకంటే చిన్న ఇళ్లు. అలాంటి వ్యక్తి లక్ష కోట్లు ఎలా సంపాదించాడు?
గేదెలు కాచుకునే వారు కూడా పవన్ లా మాట్లాడరు
చిరంజీవి విరాళాలు ఇచ్చే లోపే ఎన్నెన్నో జరిగిపోతున్నాయి కదా? అదొక పార్టీ, ఒక కూటమి అనుకునే లోపే ఇచ్చిన సీట్లలో కూడా తన వాళ్లను పెట్టుకోలేకపోయాడు కదా?ఆడపిల్లలను వాలంటీర్లు ట్రాఫికింగ్ చేస్తున్నారు అన్నాడు.. పవన్ కల్యాణ్. గేదెలు కాచుకునే వాడు కూడా ఈ మాటలు మాట్లాడడు. అతనికి కూడా అమ్మ, అక్క అంటే ఏంటో తెలుసు. అలాంటిది తాను ఒక పార్టీ పెట్టాడని వాలంటీర్లను, ఆడపడుచులను వ్యభిచారం, అక్రమసంబంధాలని నిర్ధయగా అన్నాడంటే ఇంకేం చెప్తాం? రెండు లక్షల పుస్తకాలు చదివినానన్నావ్.. ఏపీలో దేవతల్లాంటి వాలంటీర్ల ఆడపడుచుల్ని ఇలా మాట్లాడటం తగునా? ఇంత ఉన్మాదిగా అతను తయారయ్యాడంటే ఇక దేవుడే కాపాడాలి’’ అని పోసాని కృష్ణ మురళి మాట్లాడారు.