అన్వేషించండి

Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌కు ఉన్న ఇబ్బందులేంటి? చంద్రబాబుకు వివరించిన ఎయిమ్స్ డైరెక్టర్

Mangalagiri AIMS: మంగళగిరి ఎయిమ్స్ సమస్యలను డైరెక్టర్ డా.మధబానందకర్ సీఎం చంద్రబాబుకు వివరించారు. సాధ్యమైనంత త్వరలో సమస్యలు పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

AP Latest News: మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618 కోట్ల కేంద్ర నిధులతో ఎయిమ్స్ ఏర్పాటు అయ్యింది. ఎయిమ్స్ నిర్మాణానికి అవసరమైన భూములు, అనుమతులు ఇచ్చి నాటి తెలుగుదేశం ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేసింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఈ ప్రతిష్టాత్మక సంస్థను సమస్యలు చుట్టుముట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన చేయూత ఇవ్వకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఎయిమ్స్ సమస్యల బారిన పడింది. ఈ రోజు (జూన్ 28) సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఎయిమ్స్ డైరెక్టర్  డా.మధబానందకర్ సంస్థ సేవలపై వివరించారు. 

ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా తీవ్ర నీటి కొరతతో సేవలను విస్తరించలేకపోతున్నామని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం కోసం తలపెట్టిన పైప్ లైన్ పనులు కూడా ఆగిపోయాయని తెలిపారు. రోజుకు 7 ఎఎల్ డి నీరు అవసరం పడగా.. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా కేవలం 2 ఎంఎల్ డి నీరు మాత్రమే అందుబాటులో ఉంటుందని డైరెక్టర్ వివరించారు. అటవీ భూమిగుండా పైప్ లైన్ నిర్మాణం విషయంలో సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా విద్యుత్ సరఫరా విషయంలో కూడా ఉన్న సమస్యలు సీఎం దృష్టికి తెచ్చారు. 192 ఎకరాలకు గాను 182 ఎకరాలు సంస్థ కోసం ఇచ్చారని.. మరో 10 ఎకరాలు ఇస్తే ఎయిమ్స్ విస్తరణ పనులు చేస్తామని సీఎంకు డైరెక్టర్ వివరించారు. 

ఎయిమ్స్ లో అందుతున్న సదుపాయాలపై ఒకసారి వచ్చి పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడుని డైరెక్టర్ ఆహ్వానించారు. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో దీనిపై పూర్తి స్థాయి సమీక్ష చేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వం కనీసం నీటి సమస్య తీర్చకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సాంకేతిక, ఆర్థిక సమస్యలతో  ఎయిమ్స్ కు తాగునీటి సరఫరా చేసే పనులు నిలిచిపోవడం సరికాదని సీఎం అన్నారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget