అన్వేషించండి

Lokesh Counter to Jagan: లోకేష్ సంచలన ట్వీట్: జగన్ పై తీవ్ర విమర్శలు, 'అర్థమైందా రాజా?' అంటూ స్ట్రాంగ్ కౌంటర్!

Lokesh Counter to Jagan: ‘అర్థమైందా రాజా’ అంటూ ఐటీ మంత్రి నారాలోకేష్.. వైకాపా అధ్యక్షుడు జగన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Lokesh Counter to Jagan:  వైఎస్ జగన్‌కు చెందిన సాక్షి చానల్‌లో  అమరావతిపై జరిగిన డిబేట్‌ గురించి రచ్చ రచ్చ అవుతోంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజధాని మహిళలు, తెలుగుదేశం, కూటమి పక్షాలు..  అక్రమ అరెస్టులు చేశారంటూ వైఎస్సార్సీపీ గోడవ పడుతున్నాయి. సాక్షి చానల్‌లో జరిగిన ఓ డిబేట్‌లో కృష్ణంరాజు అనే విశ్లేషకుడు అమరావతి వేశ్యల రాజధాని అంటూ చేసిన కామెంట్లు అగ్గి రేపాయి. ఓ ప్రాంతంలోని మహిళల గౌరవాన్ని అగౌరవపరిచేలా సాక్షి టీవీ.. అందులో డిబేట్ నిర్వహించిన ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణంరాజుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై కేసులు నమోదవ్వడం.. కొమ్మినేని అరెస్ట్ కావడం.. ఈ గొడవంతా రెండు రోజుల నుంచి నడుస్తూనే ఉంది.

ఈ ఘటనకు కొనసాగింపుగా రెండు వైపులా వాదనలు జరుగుతున్నాయి. తెలుగుదేశం నాయకులు కూడా స్థాయి దాటి వ్యాఖ్యలు చేశారని... వైఎస్సార్సీపీ చెబుతోంది. ఎవరో విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలకు పార్టీకి, చానల్‌కు ఏం సంబంధం అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. జర్నలిజానికి సంకేళ్లు వేశారంటూ సాక్షి పాత్రికేయులు నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు వరుసగా పెస్‌మీట్లు పెడుతూ కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నారు. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ జగన్ అధికారంలో ఉండగా జరిగిన అరెస్టులు.. అర్థరాత్రి ఇంట్లోకి జొరబడి పోలీసులు దౌర్జన్యం చేయడం వంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. కొమ్మినేని డిబేట్‌లో జరిగిన వ్యాఖ్యలకు తమ పార్టీకి, ఛానెల్‌కు సంబంధం లేదని జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారని ట్వీట్ చేశారు. దీనికి నారా లోకేష్ ఓ వీడియోతో గట్టి కౌంటర్ ఇచ్చారు.

నాది కాలేజ్ లైఫ్ నీది జైలు లైఫ్- అర్థమైందా రాజా...?

జగన్‌కు కౌంటర్‌గా ట్వీట్ చేసిన లోకేష్‌.. అందులో వైఎస్సార్సీపీ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వీడియోను ఉంచారు. “జగన్ గారు  మీ హిపోక్రసీని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది... నాకు కాలేజ్ లైఫ్ ఉంది...మీకు జైల్ లైఫ్ ఉంది.. నాకు క్లాస్‌మేట్స్ ఉన్నారు.. మీకు జైల్ మేట్స్ ఉన్నారు. అర్థమైందా ... రాజా..? ” అంటూ ట్వీట్ చేశారు. తాను మహిళలను గౌరవించే పెంపకంలో పెరిగానని .. కానీ జగన్ తన సొంత తల్లిని, చెల్లిని కూడా కోర్టుకీడ్చారని లోకేష్ ఆ ట్వీట్‌లో జగన్‌పై విమర్శలు చేశారు. జగన్ న్‌ ఐదేళ్ల పాలన అకృత్యాల మయం అని.. ప్రతీకార రాజకీయాలు దళితుల, సమాన్యులపై దాడులతో ఎవరికీ ప్రశాంతత అన్నదే లేదని లోకష్ అన్నారు.  

 

అమరావతి ప్రాంతాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంటలు రేగుతూనే ఉన్నాయి. కూటమి పక్షాలు మంగళవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించాయి. మరోవైపు ఈ కేసుపై జాతీయ మహిళా కమిషన్‌ దీనిపై స్పందించింది. మహిళల గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాఖ్యలు చేసిన చర్యలు తీసుకోవాలని మూడు రోజుల్లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీకి లేఖ రాసింది. 

టాప్ హెడ్ లైన్స్

Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
MPTC and ZPTC Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
Cyclone Arnab Live Updates: కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
Cyclone Arnab Landfall: నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను.. గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు
నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను.. గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget