అన్వేషించండి

AP TDP Politics: టీడీపీకి దూరం అవుతున్న కమ్మ నేతలు, ఏపీ పాలిటిక్స్ మారుతున్నాయా?

కమ్మ సామాజిక వర్గం అంటే టీడీపీ అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. ప్రత్యర్థి పార్టీలు కూడా ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకొని  టీడీపీని టార్గెట్‌ చేయటం కూడ చాలా సార్లు జరిగింది.

టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు దూరం అవుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు వాళ్లంతట వాళ్లు దూరం కావటం ఒక ఎత్తయితే, మరి కొందరు కమ్మ నేతలను పార్టీనే దూరంపెడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

టీడీపీ అంటే వారి పార్టీనే అనే ముద్ర...
టీడీపీ అంటే కమ్మ సామాజిక వర్గం.. కమ్మ సామాజిక వర్గం అంటే టీడీపీ అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. ప్రత్యర్థి పార్టీలు కూడా ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకొని  టీడీపీని టార్గెట్‌ చేయటం కూడ చాలా సార్లు జరిగింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చినట్టే అనే అభిప్రాయం పార్టీలో చర్చ జరుగుతోంది. కమ్మ సామాజిక నేతలకు టీడీపీలో నెమ్మదిగా ప్రాధాన్యత తగ్గుతుందని అంటున్నారు. నమ్మటానికి అంత ఈజీ కాకపోయినా తాజాగా జరుగుతున్న పరిణామాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు లీడర్లు వస్తుంటే చాలు.. వారికి రెడ్‌ కార్పెట్‌ వేసి, స్వాగతం పలికేవారు. పార్టీలో వారు చెప్పిందే వేదం. వారి క్యాడర్ ఎదయినా సరే, కమ్మ కులం అనే ట్యాగ్ ఉంటే చాలు, ఆ హోదా వేరుగా ఉంటాయనే వ్యాఖ్యలు లేకపోలేదు. అయితే అవన్నీ పాత రోజులని అంటున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్దితులు ఇక కనపడవని చెబుతున్నారు.  
 
కమ్మ నేతల పరిస్థితి ఇలా....
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లో దేవినేని ఉమ, కేశినేని నాని ఉన్నారు. వీరిలో దేవినేని ఫ్యామిలి అయితే పార్టీ జండా పురుడు పోసుకున్న నాటి నుండి టీడీపీకి అండగా ఉంటున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఫ్యామిలిని, సైతం కమ్మ సామాజిక వర్గం అదే విధంగా ఓన్‌ చేసుకుందనే చెప్పాలి. ఈ క్రమంలో వీరిద్దరి హవా ప్రస్తుతం టీడీపీలో అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. దేవినేని ఉమ దాదాపు 15 ఏళ్ల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా నడిపించారు. అధికారంలో ఉన్నారంటే దేవినేని ఫ్యామిలిదే పై చేయి.. అంతటి స్దాయిలో ఉన్న దేవినేని ఉమకు ఇప్పుడు టీడీపీలో అలాంటి పరిస్దితి లేదంటున్నారు. పవర్ లో లేకపోయినా, పార్టిని సింగల్ గా నడిపించే ఉమా ప్రస్తుతం అలా కన్పించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధినాయకత్వం వద్ద కూడా దేవినేని ఉమ పెద్దగా చెల్లుబాటు అవుతున్న సందర్భాలు తక్కువగానే కన్పిస్తున్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అసలు  మైలవరంలో దేవినేని ఉమ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఉంటుందో.. ఉండదోననే డౌట్‌ కు కూడ దేవినేని అనుచరులే వచ్చేసారని అంటున్నారు. ఇక  కేశినేని నాని వ్యవహరం కూడా క్రమక్రమంగా పార్టీ అధినాయకత్వానికి దూరంగా ఉంటున్నారు. ఆయన చేస్తున్న కామెంట్స్ సైతం సోషల్ మీడియా ను షేక్ చేసేస్తున్నాయి. కేశినేని నాని టీడీపీలో కొనసాగుతారా లేదా..  అనే అనుమానం కూడా నేతల నుండి వస్తోంది. వీరిద్దరి హవా తగ్గిందంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో బ్రాండ్ ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలు దాదాపు లేనట్టే లెక్క అనే వాదన వినిపిస్తోంది.

గుంటూరు కమ్మ లీడర్లు అదే దారి...
ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కన్పిస్తోంది.  జిల్లాలో కమ్మ సామాజిక వర్గ నేతలు ఎందరు ఉన్నా.. పల్నాటి పులిగా పేరొందిన కొడెల శివప్రసాద్‌ అంటే కమ్మ సామాజిక వర్గంలో ఓ క్రేజ్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కుటుంబానికి ఏకంగా సీటు దక్కని పరిస్థితి వచ్చేసింది.  కొడెల వారసుడికి టిక్కెట్‌ లేకుండాపోయిందనే  చర్చ కేవలం గుంటూరునే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా  హాట్ టాప్ టాపిక్ అవుతోంది. కొడెల శివరాం కోసం కాకున్నా.. కొడెల శివ ప్రసాద్‌ కోసమైనా కొడెల కుటుంబానికి టిక్కెట్‌ ఇవ్వాలనే సూచనలు చేసినా.. పార్టి వాటిని లైట్ తీసుకుందని అంటున్నారు. వేరే రకంగా కొడెల ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇద్దామని దాటవేసే ధోరణికి వెళ్లారంట. కోడెల కుటుంబమే కాకుండా.. గుంటూరు జిల్లాలోని కొందరు కీలక కమ్మ సామాజిక నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఎంత వరకు వస్తాయో అనే దానిపై స్పష్టత లేదు.

ఆ మరక.. మంచిది కాదనా...
2016 నుంచి టీడీపీ పై విపరీతమైన కమ్మ సామాజిక ముద్ర ఉండేది. ఈ ముద్ర కారణంగానే ఇతర సామాజిక వర్గాలు టీడీపీకి దూరం అయ్యాయని చాలా సందర్బాల్లో చర్చ కూడ జరిగింది.ఇక కారణాలేమైనా.. ఇన్నాళ్లూ పెత్తనం చేసిన కమ్మ సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యత తగ్గుతున్న దాఖలాలు కన్పిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇది నిజమైతే.. మిగిలిన వర్గాలు.. మిగిలిన సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఫ్రీ హ్యాండ్ వస్తుందని అంటున్నారు. ఇది  ఒకందుకు మంచిదేనని భావిస్తున్నారని అంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Tirumala Kalyana Ratham:   తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు  శ్రీవారి కళ్యాణ రథం!
తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Tirumala Kalyana Ratham:   తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు  శ్రీవారి కళ్యాణ రథం!
తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం!
Harish Rao Tweet: కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
Pradeep Machiraju: బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం
బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం
Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
Embed widget