By: Harish | Updated at : 15 Dec 2022 08:00 AM (IST)
ఆలయం పరిధిలోని కోనేరు అభివృద్ధికి చర్యలు చేపడుతున్న ప్రభుత్వం
464 సంవత్సరాల చరిత్ర గల లక్ష్మినరసింహ స్వామి వారి కోనేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 30 ఏళ్ల క్రితం కోనేరు అభివృద్ధికి ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యపడలేదు. ఇప్పుడు మరోసారి రూపురేఖలు మార్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. దీని కోసం కోటిన్నర రూపాయలు ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం.
దశాబ్దాల చరిత్ర...
మరుగున పడిన చరిత్ర మరోసారి వెలుగులో వచ్చింది. మంగళగిరి పెద్ద కోనేరును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోనేటిలో 60సంవత్సరాలపాటు జల దిగ్బంధంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం కూడా భక్తులకు దర్శనం ఇవ్వబోతోంది. కోనేటి అడుగున స్వర్ణ దేవాలయం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.
గుంటూరు జిల్లాలో....
గుంటూరు జిల్లా మంగళగిరి అనగానే ఠక్కున లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా మందికి గుర్తుకు వస్తుంది. చారిత్మక ఆలయంలో వెలసిన స్వామి వారి కళ్యాణ పుష్కరిణి పెద్ద కోనేరు చరిత్ర నేటి తరానికి చాలా మందికి తెలియదు. శిథిలావస్థకు చేరిన ఈ కొనేరుకు ఇప్పుడు మహర్దశ రానుంది. గతంలోనూ ఓసారి అధికారులు, పాలకులు ఓఎన్జీసీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అభివృద్ది పనులు చేపట్టారు. ఆ రోజుల్లో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో నీళ్ళ మోటార్లు పెట్టి కొనేటిలో నీళ్ళు తోడే ప్రయత్నం నిరంతరాయంగా చేపట్టినా పూర్తి స్థాయిలో నీటిని తోడటం సాధ్యం కాలేదు. దీంతో అభివృద్ధి పనులు అర్దాంతరంగా నిలిపివేశారు.
మంగళగిరి పట్టణం మధ్యలో అర ఎకరం వైశాల్యంలో కోనేరు ఉంది. ఈ కల్యాణ పుష్కరిణి 1558లో విజయనగర రాజుల అధీనంలో ఉండేది. ఆ రాజులే దీన్ని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి. లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు ఉన్నట్లుగా చరిత్ర చెబుతోంది. గుడికి తూర్పున ఈశాన్య భాగంలో శివలింగం ఉంటుంది. 1832 నాటి కరవులో కోనేరు ఎండిపోయి, 9,840 కర్ణాటక తుపాకులు, 44 తుపాకీ గుళ్ళు బయట పడ్డాయి. కోనేటి అడుగున బంగారు గుడి ఉందని ప్రజలు కథలు చెప్పుకుంటారని 1883లో గార్డన్ మెకెంజీ కృష్ణా జిల్లా మాన్యువల్‌లో రాసినట్లుగా చెబుతుంటారు. 19వ శతాబ్దిలో మారెళ్ళ శీనయ్యదాసు ఈ కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి స్వామి పేరున రెండెకరాల స్థలాన్ని దానమిచ్చారని అంటున్నారు. శతాబ్దాల పాటు ప్రజలు ఈ కోనేటి నీటితో స్వామి వారికి అభిషేకం జరిపించారు.
2004 పుష్కరాలకు....
2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కోనేటికి ప్రహరీగోడ నిర్మించారు. కోనేరు లోపల సుమారు 60 ఏళ్ళ క్రితం కోనేరు నీటిలో మునిగి పోయిన ఆంజనేయ స్వామి ఆలయం శిఖర భాగమే ఇన్నాళ్లు స్థానికులకు కనిపించేది. అభివృద్ధి పనుల్లో భాగంలో కోనేటి నీళ్లు తోడుతుండగా ఆలయ ఇప్పుడు బయటకు కనిపిస్తుంది. ఆలయంలో ఆంజనేయ స్వామి రాతి చెక్కడం ప్రతిమ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిమ కొనేటిలో 60 ఏళ్లుగా నీటి ముంపులో ఉంది. కొనేరులో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం పనులు చేపడుతున్నట్లు ఆలయ ప్రదాన అర్చకులు, శ్రీనివాస్ దీక్షితులు తెలిపారు.
AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం
Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?
Ministers On Tapping : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - కోటంరెడ్డికి మంత్రుల కౌంటర్ !
Nick Vujicic Met CM Jagan : ఏపీలో కార్పొరేట్ స్కూళ్ల తరహాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నిక్ వుజిసిక్ కితాబు
Sajjala : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో కల్లోలం - చర్యలపై సీఎంతో సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు !
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం