News
News
వీడియోలు ఆటలు
X

Supreme Court : ఆర్- 5 జోన్‌పై సుప్రీంకోర్టుకు అమరావతి రైతులు - విచారణ ఎప్పుడంటే ?

ఆర్ 5 జోన్‌పై రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్టానికి విరుద్ధంగా అమరావతి భూముల్లో సెంట్ స్థలాలు పంచుతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

FOLLOW US: 
Share:

Supreme Court :   ఆర్- 5 జోన్‌పై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఆర్-5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని కోరుతూ రైతులు సుప్రీంను పిటిషన్‌లో కోరారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు పేర్కొన్నారు.  గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ను రైతులు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ నేతృత్వంలోని ధర్మాసనం అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేశారు.

మధ్యంతర ఉత్తర్వులకు తిరస్కరించిన ఏపీ హైకోర్టు 

అమరావతిలో  ఆర్-5 జోన్‌ అంశంపై రైతులు దాఖలు చేసిన  పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.  ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలన్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు  నిరాకరించింది. దీంతో రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చడం చట్ట విరుద్ధమని ఇంతకు ముందు అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి..  రాజధాని అవసరాల కోసమే తాము ఇచ్చిన భూముల్ని ఇతరులకు రాజకీయ కారణాలతో పంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.                   

రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో సెంట్ స్థలాలు
  
అమరావతిలో గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో కీలక నిర్మాణాలు ప్రతిపాదించిన చోట విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసింది. ఇందు కోసం  సీఆర్‌డీఏ చట్ట సవరణ చేసింది ప్రభుత్ం.  తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో  1134 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.   ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్‌-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది.   ఆర్‌-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇవ్వగా.. దీనిపై  రైతులు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేయడంతో  ఆర్‌-5 జోన్‌తో రాజధాని భూములను ఇతరులకు కేటాయించేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమం అయినట్లయింది.   

సోమవారం సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించే అకాశం               

సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసన ముందు అమరావతి రైతుల తరపు న్యాయవాదులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.మే 9 వతేదీన సుప్రీంకోర్టులో అమరావతి అంశంపై విచారణ జరగనుంది.  మే 9న జరిగే విచారణ కేవలం చనిపోయిన ప్రతివాదుల స్థానంలో వారి వారసులను చేర్చడం మాత్రమే జరుగుతుందని న్యాయవాదులు చెబుతున్నారు.  

Published at : 06 May 2023 04:06 PM (IST) Tags: Amaravati Farmers Supreme Court Amaravati Cent Places

సంబంధిత కథనాలు

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

టాప్ స్టోరీస్

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?