అన్వేషించండి

Kodi Katti Case: కోడికత్తి కేసు నిందితుడికి గతంలోనే నేరచరిత్ర, జగన్‌పై దాడి ప్రణాళిక ప్రకారమే - లాయర్ కీలక వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని ఇంకొల్లు వెంకటేశ్వర్లు చెప్పారు. ఇది హత్యాయత్నం అని ఎన్‌ఐఏ కూడా చెప్పిందని అన్నారు.

ఏపీలో గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా సీఎం జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి ఘటనలో న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన సీఎం జగన్ తరపు న్యాయవాదిగా ఉన్నారు. 25 - 10 - 2018 న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన ఈ హత్యాయత్నం ఘటనపై ఎన్ఐఏ 39 మంది సాక్షులను విచారణ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ ఘటనకు ముందే నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసిందని వెంకటేశ్వర్లు వెల్లడించారు. 

న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు బుధవారం (ఆగస్టు 30) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నంపై కేసులో ఎన్‌ఐఏ 39 మంది సాక్షులను విచారణ చేసిందని అన్నారు. ఇప్పటివరకు ఎన్‌ఐఏకి సిట్‌ ఎలాంటి వివరాలు ఇవ్వలేదని అన్నారు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర 2017 నుంచే ఉందని, అతను పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసిందని వివరించారు. 2018లో డీజీపీగా ఉన్న వ్యక్తి ఎన్‌ఐఏకి రికార్డ్‌ చేయవద్దని సిట్‌కి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. అందుకే ఆ రికార్డులను ఎన్‌ఐఏకి పోలీసులు తొలుత అప్పగించలేదని చెప్పారు.

సీఎం జగన్‌పై పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని ఇంకొల్లు వెంకటేశ్వర్లు చెప్పారు. ఇది హత్యాయత్నం అని ఎన్‌ఐఏ కూడా చెప్పిందని అన్నారు. అయితే, ఈ హత్యాయత్నం ఘటనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో నిందితుడు శ్రీనివాస్‌ తన నేరాన్ని ఒప్పుకున్నాడని గుర్తు చేశారు. తమ మీదకి కేసు రాకుండా ఉండేందుకే హత్యాయత్నం తీవ్రతను తగ్గించేందుకు కొందరు కేసు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

అసలు నిందితుడు శ్రీనివాస్ ను ఎయిర్‌ పోర్టులోకి రావడమే తప్పుడు మార్గంలో వచ్చాడని అన్నారు. ఎయిర్‌ పోర్టు అథారిటీకి శ్రీనివాస్‌ చాలా మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారని అన్నారు. శ్రీనివాస్‌ది ఎయిర్‌పోర్టులో ఇల్లీగల్‌ ఎంట్రీ అని.. కత్తితో ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్‌ ఎలా తిరిగగలుగుతాడని ప్రశ్నించారు. శ్రీనివాస్‌పై కేసు ఉన్నందుకు ఎయిర్‌ పోర్టులో ఉద్యోగానికి అతను అనర్హుడని అన్నారు. ఎయిర్‌ పోర్టులో ఉద్యోగం చేసే సమయానికి శ్రీనివాస్‌పై అప్పటికే ఓ కేసు పెండింగ్‌లో ఉందని న్యాయవాది తెలిపారు. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది అబద్దం. ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీట్‌ వేశారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget