అన్వేషించండి

YS Jagan Review: స్కూల్ విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్ - బడికి రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్

CM Jagan: విద్యాశాఖపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బడికి వచ్చే విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని సూచించారు.

CM Jagan: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులకు నిరంతరం ట్రాకింగ్ ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్థాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉందని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలిపారు. దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలని సూచించారు. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్తుందన్నారు. అయినప్పటికీ పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారన్నారు. పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నామని.. ఇంటర్మీడియట్‌ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుందని గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అందిస్తున్నామన్నారు. ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఇలా ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్‌ చేస్తున్నామన్నారు. ఈ పద్ధతిలోనే డ్రాప్‌ అవుట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ వివరించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలని సూచించారు. 

వచ్చే విద్యా సంవత్సరంలో విద్యాకానుకపై సీఎం సమీక్ష...

విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే మే 15  నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామని అధికారులు తెలిపారు. సబ్జెక్టు టీచర్ల పైనా సీఎం సమీక్ష నిర్వహించారు. పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం ఈ విధానాన్ని తీసుకు వచ్చామన్న పేర్కొన్నారు. దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయని స్పష్టం చేశారు. గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాల జారీ చేశారు. ఈ క్రమంలోనే సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ కోర్సులు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సు ఏర్పాటు చేశారు. వచ్చే రెండేళ్ల పాటు ఈ సర్టిఫికెట్‌ కోర్సు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఇక ప్రతి ఏటా కూడా దీనిపై సమీక్ష చేసుకోవాలన్న సీఎం... ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. పిల్లలకు ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదన్నారు. 

ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ) ఏర్పాటుపై.. 
సీఎం జగన్ ఆదేశాల మేరకు జూన్‌ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారుల వెల్లడించారు. స్కూలు పిల్లలకు టోఫెల్‌ సర్టిఫికేట్‌ పరీక్షలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 3 నుంచి 5 గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉత్తీర్ణులైన వారికి టోఫెల్‌ ప్రైమరీ సర్టిఫికెట్‌ ఇస్తామని.. 6 నుంచి 10 గ్రేడ్ల వారికి జూనియర్‌ టోఫెల్‌ పరీక్షలు పెడతామన్నారు. వీరికి జూనియర్‌ స్టాండర్డ్‌ టోఫెల్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మొత్తం మూడు దశల్లో వీరికి టోఫెల్‌ పరీక్షలు పెడతామన్నారు.

ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్‌.. జూనియర్‌ స్టాండర్డ్‌ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్‌..  నైపుణ్యాల పరీక్షలు పెడతామన్నారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ – కంటెంట్‌ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై పూర్తి వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్‌ఓపీ తయారు చేశామని అధికారులు వెల్లడించారు. 

ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య  వచ్చినా.. వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నంబరును స్కూల్లో ఉంచాలన్న సీఎం వివరించారు. ఏ సమస్య వచ్చినా, రెండు మూడు రోజుల్లో పరిష్కరించి తిరిగి విద్యార్థులకు అప్పగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.  

ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. నో మొబైల్‌ జోన్స్‌గా పరీక్ష కేంద్రాలను మార్చామని, ఎవ్వరికీ కూడా మొబైల్‌ అనుమతి లేదని అధికారులు తేల్చిచెప్పారు. ప్రశ్న ప్రత్రాల్లో క్యూ ఆర్‌ కోడ్‌ ప్రతీ ప్రశ్నకూ ఇచ్చామని వివరించారు. దీనివల్ల ఎక్కడ నుంచి, ఏ సెంటర్‌ నుంచి, ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్‌ అయ్యిందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ చర్యలు కారణంగా ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నామని అన్నారు. ప్రతి పరీక్షా గదిలో కూడా సీసీ కెమెరాలు పెట్టామని స్పష్టం చేశారు. 

మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని, ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ పూర్తి స్థాయిలో చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేయి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్‌ అయ్యాయని, మిగిలిన స్కూళ్లు కూడా చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు – నేడు కింద పనులపై కూడా సీఎం సమీక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అధికారులు వివరించారు.

సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ప్రభుత్వ సలహాదారు ఎ సాంబశివా రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహార్‌ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతులు) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ బి శ్రీనివాసులు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీఎన్‌ దీవాన్‌రెడ్డి, నాడు నేడు టెక్నికల్‌ డైరెక్టర్‌ మనోహర్‌ రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బి ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం

వీడియోలు

India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget