By: ABP Desam | Updated at : 18 May 2022 09:13 PM (IST)
మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
AP Ministers Will Do Bus Tour From May 26: ప్రతిపక్ష టీడీపీ నేతలకు చెక్ పెట్టేందుకు ఏపీ మంత్రులు వ్యూహాలు రచిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏపీ మంత్రులు బస్ యాత్రకు రెడీ అవుతున్నారు. మే 26 నుంచి నాలుగు రోజులపాటు ఏపీ మంత్రులు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు, సామాజిక న్యాయం ఈ అంశాలన్నీ జనంలోకి తీసుకువెళ్లేందుకు మంత్రులు యాత్రలో పాల్గొననున్నారు.
ఏపీ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడమే ప్రధాన అజెండాగా ఈ బస్సు యాత్ర జరగనుంది.. జగన్ కేబినెట్‌లో అధిక ప్రాధాన్యం కల్పించిన 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొని బస్సు యాత్రను విజయవంతం చేయనున్నారు. ఇప్పటికే గడప గడపకు వైఎస్సార్ పేరుతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ నేతల జోరుకు బ్రేకులు వేయాలంటే మైనారిటీ మంత్రులు నాలుగు రోజులపాటు బస్సు యాత్రలు చేసి, ప్రభుత్వ పథకాలపై మరింత ఎక్కువగా ప్రచారం చేసి, తమ పాలనపై ప్రజలలో మరింత అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ బస్ యాత్రకు మంత్రులు శ్రీకారం చుట్టనున్నారు.
శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నాలుగు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర, బహిరంగ సభలకు ఏపీ మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీ విభాగాల మంత్రులు యాత్రలో భాగస్వాములు కాబోతున్నారు.
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజల దగ్గరకు వెళ్లడానికి అధికారులు, అన్ని శాఖల కార్యదర్శులు బాగా దృష్టి పెట్టాలని సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడంలో కార్యదర్శుల పాత్ర కీలకం అన్నారు సీఎస్. బుధవారం నాడు రాష్ట్ర సుస్థిరాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు అంశాలపై అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు.
Also Read: Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు
Guntur News : వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్క పిల్ల మృతి, రోడ్డుపై బైఠాయించిన ఓ కుటుంబం
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Chandrababu Letter : సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై సీఐడీ వేధింపులు, డీజీపీకి చంద్రబాబు లేఖ
TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో సత్తాచాటిన ఏపీ యువతి - రెండు టాప్ ర్యాంకులు సాధించిన ప్రకాశం అమ్మాయి
Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్