Chandra Babu: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ లీడర్లకు షాక్ ఇచ్చిన హైకోర్టు
Andhra Pradesh: చంద్రాబబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ లీడర్ల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారిని ఎప్పుడైనా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద హడావుడి చేసి దాడికి వెళ్లిన నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. వాళ్లు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్‌తోపాటు వైసీపీ లీడర్లు దాడికి వెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసును టీడీపీ పెట్టినా పోలీసులు విచారణ వేగంగా సాగలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఎంక్వయిరీ వేగంగా జరుపుతున్నారు.
Also Read: వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా?
విచారణ జోరుగా సాగుతున్న టైంలో తను అరెస్టు చేస్తారేమో అన్న కారణంతో వైసీపీ లీడర్లు నందిగం సురేష్, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ కేసుపై ఏపీ హైకోర్టుకు వెళ్లారు. కేసును పూర్తిగా విచారించిన న్యాయస్థానం వీళ్ల ముందస్తు బెయిల్ పిటిషన్‌లను తిరస్కరించింది.
ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణలో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇప్పటి వరకు కోర్టు చెబుతూ వచ్చింది. ఇప్పుడు పిటిషన్లు తిరస్కరించడంతో వీళ్లను ఎప్పుడైనా విచారణకు పిలిచే అవకాశం ఉంది. అదే టైంలో వైసీపీ నేతలు కూడా ఈ కేసులో మరోసారి కోర్టులో పోరాటం చేయాలని భావిస్తున్నారు.
Also Read: మార్నింగ్ టాప్ టెన్ హెడ్‌లైన్స్