New Train Time Table : రైళ్ల టైమింగ్స్ మార్చేసిన ఇండియన్ రైల్వే - జర్నీకి ముందు చెక్ చేస్కోవాలని సూచన
New Train Time Table : దేశంలో రైలు వేళలు మారనున్నాయి. కొత్త రైల్వే టైమ్‌టేబుల్ ను నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ (NFR) విడుదల చేసింది.
New Train Time Table : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇండియన్ రైల్వే కీలక మార్పులు చేసింది. జనవరి 1, 2025 నుంచి రైలు వేళల్లో మార్పులు రానున్నాయి. అందుకోసం రైల్వే తాజాగా కొత్త రైల్వే టైమ్ టేబుల్ ను రిలీజ్ చేసింది. ఇది జనవరి 1,2025 నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపర్చడం, కనెక్టివిటీని పెంచడంస కార్యాచరణను అనుకూలపర్చడం లక్ష్యంగా పెట్టుకున్న నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ (NFR).. రైల్వే ప్రయాణాలు చేసేవారు కొత్త టైమ్‌టేబుల్ చెక్ చేసుకోవాలని ఇండియన్ రైల్వేస్ సూచించింది.
రైలు రాకపోకల్లో కీలక మార్పులు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 1, 2025 నుంచి ఈ నూతన రైల్వే టైంటేబుల్ అమల్లోకి తెస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైళ్ల సమయాలను ముందే పరిశీలించుకోవాలని ప్రయాణికులకు సూచించారు. వివరాలకు www.irctc.co.in , నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టం(ఎన్‌టీఈఎస్)వెబ్‌సైట్‌ను సందర్శించటంతోపాటు స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించాలని తెలిపారు.
ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా దాదాపు 24 ఎక్స్ ప్రెస్ రైళ్ల సమయాలను సవరించారు. ఉదాహరణకు న్యూ జల్పైగురి - న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 12523) ఇప్పుడు 8:45 గంటలకు బయలుదేరుతుంది, సిల్చార్ - తిరువనంతపురం సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 12508) సిల్చార్ నుంచి సాయంత్రం 7:30 గంటలకు బయలుదేరడానికి రీషెడ్యూల్ చేశారు. వీటితో పాటు 16 ఇంట్రా-జోనల్ మెయిల్య/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 23 DEMU రైళ్ల షెడ్యూల్ ను సవరించారు.
ఈ మార్పుల లక్ష్యం ఇదే
"కనెక్టివిటీని మెరుగుపరచడం, మా ప్రయాణీకులకు సున్నితమైన ప్రయాణ అనుభవాలను అందించడమే ఈ మార్పుల లక్ష్యం" అని ఎన్ఎఫఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు. సవరించిన స్టాపేజ్‌లు, సమయాల వివరాలతో అప్డేట్ చేసిన టైమ్ టేబుల్ IRCTC వెబ్‌సైట్, NFR అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణీకులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి ముందు కొత్త షెడ్యూల్‌ను చెక్ చేయడం తప్పనిసరి అని సూచించారు.
ఇలా రైలు వేళల్లో మార్పులు చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు లేదా కొన్నిసార్లు ఏడాదికోసారో ఈ మార్పులు చేయడం చూసి ఉంటాం. కానీ ఇప్పుడు కొత్త ఏడాది ప్రారంభం కానున్న తరుణంలో మరోసారి రైళ్ల సమయాలు మార్చింది ఇండియన్ రైల్వే. దీనికి సంబంధించిన సమాచారమంతా అన్ని రైల్వే స్టేషన్లలోనూ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్నవాళ్లు సైతం టైమ్ టేబుల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త రైల్వే టైమ్ టేబుల్‌లో దాదాపు చాలా రైళ్ల సమయాల్లో మార్పులు ఉన్నట్టు సమాచారం.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్
2025లో నమో భారత్ ర్యాపిడ్ రైల్ (వందే మెట్రో), అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ కలిపి మొత్తం 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ను రైల్వే తీసుకురానుంది. ఈ అప్‌గ్రేడ్ ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం, ప్రయాణం సులభం కానుంది. 2024లో భారతీయ రైల్వేస్ మంచి పురోగతి సాధించగా... 64 వందే భారత్ రైళ్లు, 70 కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. అలా ఈ రైల్ నెట్‌వర్క్‌ని అంతకంతకూ విస్తరిస్తున్నారు.
Also Read : Nimisha Priya: భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు - విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ