News
News
X

Year Ender 2022 ; ఏపీలో 6 లక్షల ఉద్యోగాల భర్తీ - ప్రభుత్వం విడుదల చేసినలెక్క ఇదిగో !

ఏపీలో మొత్తంగా ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇందులో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసీ సహా అనేక విభాగాల వారు ఉన్నారని తెలిపింది.

FOLLOW US: 
Share:

Year Ender 2022   ;    2022 సంవత్సరంలో ఉద్యోగాల కల్పనలో కూడ బీసీలకే ప్రాదాన్యత ఇచ్చామని వైఎస్ఆర్సీపీ వర్గాలు ప్రకటించారు.  మూడున్నర సంవత్సరాలలో ప్రజలకు ప్రతి పథకాన్ని ప్రభుత్వం ప్రజలకు గ్రామ వాలంటీర్ లా ద్వారా ప్రతి గడపకు సేవలందించిందని..   దాదాపు 89శాతం ఇళ్లకు పూర్తిగా ప్రతి ఒక్క పథకం అందుతోందని ప్రభుతవ్వం చెబుతోంది.  అవినీతికి చోటు లేకుండా ప్రజలకు పథకాలను అందజేస్తుంది . గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇది సాధ్యం అవుతుందని వైసీపీ చెబుతోంది.  వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారదిలా ఎల్లపుడూ పని చేస్తున్నారు అని చెప్పవచ్చని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతి గడపకు వెళ్తూ ప్రజలకు వారికి ఉన్న పథకాల పైన అవగాహన కల్పిస్తున్నారు వాలంటీర్లు  ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పని చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలి అన్న వాలంటీర్ల వల్ల ప్రజలకు ఆ పని సులభం అయ్యే విధంగా వాలంటీర్ల పనితీరు ఉంది అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ, వార్డు  సచివాలయాలలో 84 శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలకే ఉన్నాయన్నారు. 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలలో కూడా బీసీలదే హవా అని ... సచివాలయం ఉద్యోగుల మీద ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేస్తూ 25–06–2022న ప్రభుత్వం జీవో విడుదల చేసింది.  రెండేళ్లు పూర్తిచేసుకుని పరీక్ష పాస్‌ అయిన అందరికీ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసే అధికారాన్ని కూడా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం జీవో పాస్ చేసింది . వారి జీతాల విషయంలో కూడా ప్రభుత్వం ఎన్నో మార్పులు చేసింది, ఇతర సచివాలయం ఉద్యోగులకు బేసిక్‌ పే రూ.22,460 – 72,810గా నిర్ణయించారు. పంచాయతీ సెక్రటరీ, వార్డ్‌ సెక్రటరీలకు బేసిక్‌ పే రూ.23,120 – 74,770.గా నిర్ణయించారు.  

ఉద్యోగాల విషయానికొస్తే  ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.  మరో 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులు అయిన వాళ్లేనన్నారు.  ఇక ఆరోగ్యరంగం విషయానికి వస్తే  46 వేల పోస్టులు భర్తీ చేశామని..  అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా కూడా ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా వారికి మెరుగైన జీతాలు అందజేసన్నామని ప్రభుత్వం ప్రకటించింది.  ఎటువంటి కమీషన్ల తీసుకోవాలనే ఆలోచన లేకుండా జీతాలను టైమ్ కి అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించారు. కాంట్రాక్ట్‌లో పనిచేస్తున్న వారికి కూడా  మినిమమ్‌ టైం స్కేల్‌ను  తీసుకొచ్చింది. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు పథకాల ద్వారా ఎన్నో మార్పులు చేసిందని చెబుతున్నారు. 

ప్రతి గడపకు వాలంటీర్ల ద్వారా  సేవలందించడంలోకి ముందు ఉంది. సచివాలయాల వల్ల ప్రజలకు జగన్ గారి ప్రభుత్వం సేవలు చేస్తుంది అని చెప్పవచ్చు. సచివాలయాల పరిధిలోనె దాదాపు 2.60 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. ఈ వాలంటీర్లు అనే అంశం తిసుకుని వచ్చి వారి ద్వారా రాష్ట్రంలో చైతన్యం తీసుకువచ్చిన ఘనత మన జగన్ గారి ప్రభుత్వానికే చెందుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారిలో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉండడం మంచి విషయం నిరుద్యోగులకు ఈ విధంగా ఉపాధి కల్పించిందని ప్రభుత్వం ప్రకటించుకుంది.  మొత్తంగా 6 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను భర్తీ చేసినట్లుగా తెలిపింది. 

Published at : 27 Dec 2022 05:11 PM (IST) Tags: AP Jobs ANDHRA PRADESH AP Politics CM Jagan Year Ender 2022 YCP 2022 Govt Jobs in AP

సంబంధిత కథనాలు

AP Cabintet :  ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు - వాటన్నింటికీ గ్రీన్ సిగ్నల్

AP Cabintet : ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు - వాటన్నింటికీ గ్రీన్ సిగ్నల్

APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!

APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

CM Jagan Work Shop: ఎమ్మెల్యేలతో త్వరలో సీఎం జగన్ వర్క్‌షాప్! అజెండా ఇదే!

CM Jagan Work Shop: ఎమ్మెల్యేలతో త్వరలో సీఎం జగన్ వర్క్‌షాప్! అజెండా ఇదే!

Pawan Kalayan Fans: దుర్గమ్మకు పవన్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్- తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్‌!

Pawan Kalayan Fans: దుర్గమ్మకు పవన్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్- తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్‌!

టాప్ స్టోరీస్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్  !

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!