News
News
X

అంగన్‌వాడీల్లో క్వాలిటీ, క్వాంటిటీపై ప్రభుత్వం ఫోకస్- సిబ్బందికి సెల్‌ఫోన్లు పంపిణీ

పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై కూడా దృష్టిపెట్టాలన్నారు సీఎం. పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టిపెట్టాలన్నారు.

FOLLOW US: 
Share:

అంగన్‌వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలన్నారు సీఎం. ప్రతిరోజూ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. దీని కోసమే దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న సూపర్‌వైజర్ల నియామకాలను ప్రారంభించామని... దురదృష్టవశాత్తు కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని వాపోయారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేయాలని సూచించారు. అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలని దిశానిర్దేశం చేశారు సీఎం. అంగన్‌వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపైనా దృష్టిపెట్టాలన్నారు. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధంచేసుకోవాలని ఆదేశించారు.  

మహిళా, శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించి... బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారించడానికి మరిన్ని చర్యలు చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా నిర్దేశించుకున్న ప్రమాణాలతో అంగన్‌వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్‌లు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు.

అంగన్‌వాడీల్లో నాడు – నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలని తెలిపారు సీఎం జగన్. పాఠశాల విద్యాశాఖతో కలిసి ఈమేరకు కార్యాచరణ చేసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీల రూపురేఖలను సంపూర్ణంగా మార్చాలని వివరించారు. అంగన్‌వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఎలాంటి సదుపాయాలు కల్పించుకోవాలి? ఏ రకంగా వాటిని తీర్చిదిద్దాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. విడతల వారీగా ఆ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. 

పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా చూసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై కూడా దృష్టిపెట్టాలన్నారు సీఎం. పిల్లలు రోజూ తీసుకునే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టిపెట్టాలన్నారు. అంగన్‌వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్‌ ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలని సూచించారు. స్కూళ్లకు, అంగన్‌వాడీలకు సరఫరాచేసే ఆహారంపై నాణ్యత, పర్యవేక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

డిసెంబర్‌1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్‌ చేపట్టనుందని... దీన్ని ప్రత్యేక యాప్‌ ద్వారా పర్యవేక్షించాలన్నారు సీఎం. నవంబరు నుంచి గుడ్ల పంపిణీ కూడా యాప్‌ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. ఈ ఆహార నాణ్యత బాగుందా? లేదా? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్‌ పార్టీ పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. ఈలోగా పంపిణీ అవుతున్న ఆహారం క్వాలిటీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. క్వాలిటీ, క్వాంటిటీపై యాప్‌ల ద్వారా సమగ్ర పర్యవేక్షణ ఉండాలన్నారు సీఎం. అంగన్‌వాడీల పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజి క్లినిక్స్‌ ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. సచివాలయంలోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. 

శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయమే కాకుండా.. ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత పెంచేలా తగిన ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. దీనివల్ల రక్తహీనత, శారీరక బలహీనతలను మొదటి దశలోనే నివారించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంగన్‌వాడీలపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్‌ చేయాలన్న సీఎం... అంగన్‌వాడీలకు, సూపర్‌వైజర్లకు మొత్తంగా దాదాపు 57వేలమందికి సెల్‌ఫోన్ల్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు అందించే పౌష్టిహారం, ఇతర సేవలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడంతోపాటు, సమగ్రపర్యవేక్షణ కోసం అంగన్‌వాడీ సెంటర్లకు, వర్కింగ్‌ సూపర్‌ వైజర్లకు ఈ సెల్‌ఫోన్స్‌ అందిస్తోంది ప్రభుత్వం. 

సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవాలన్నారు సీఎం. గతంలో పిల్లల భోజనానికి నెలకు సుమారు రూ.500 కోట్లు ఖర్చు అయ్యేదని... ఇప్పుడు అది రూ.1900 కోట్లకు పెరిగిందని వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమాల కోసం చాలా పెద్ద ఎఫర్ట్‌ పెడుతున్నామన్నారు. ఇంగ్లిషు మీడియంను చిన్ననాటి నుంచే అలవాటు చేయడానికి ఫౌండేషన్‌ స్కూల్స్, శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌ తీసుకువచ్చామన్నారు. నాడు – నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. ఇన్నివేల కోట్లు ఖర్చుచేసి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని... ఇన్ని చేసినా సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదన్నారు. అధికారులు కూడా సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో నంబర్‌వన్‌ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం నిర్దేశించారు.

Published at : 19 Oct 2022 03:58 PM (IST) Tags: ANDHRA PRADESH CM Jagan Anganwadi

సంబంధిత కథనాలు

Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థికసాయం

Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థికసాయం

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...

Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం -  కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...

AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !

AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !

Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !

Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !

టాప్ స్టోరీస్

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!

Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!