Chandra Babu On Amit Shah Row: అంబేడ్కర్‌కు కాంగ్రెస్ చేసిందేమీ లేదు! జరుగుతున్న రగడపై స్పందించిన చంద్రబాబు
Amit Shah Row: పార్లమెంట్‌ను కుదిపేసిన, కేంద్ర ప్రభుత్వాన్ని షేక్ చేసిన అమిత్‌షా కామెంట్స్‌పై చంద్రబాబు స్పందించారు. అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు.
Andhra Pradesh News: గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా అమిత్‌షా వివాదం కుదిపేస్తోంది. అంబేడ్కర్‌ను ఆయన అవమానించి రాజ్యసభలో మాట్లాడారంటూ దేశవ్యాప్తంగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇందులో ఎన్డీఏ మిత్ర పక్షాలను లాగేందుకు ఇండీ కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కీలకంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేశాయి. అందుకే మంత్రివర్గ సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
గురువారం మంత్రివర్గ భేటీలో అజెండాలోని అంశాలపై చర్చ పూర్తి అయన తర్వాత అంబేడ్కర్ అంశాన్ని చర్చకు పెట్టారు. అదే టైంలో పార్లమెంట్ అవరణంలో ఘర్షణ జరిగిందని కూడా తెలుసుకున్నారు. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేసిన నారా లోకేష్ ఏం జరిగింతో తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వర్గంలోనే చంద్రబాబు మాట్లాడుతూ అంబేడ్కర్ వివాదంపై స్పందించారని తెలుస్తోంది.
ఒక విషయంపై కానీ వివాదంపై స్పందించే ముందు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ విషయంపై మాట్లాడితే అసలు అంబేడ్కర్ గురించి కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆయన ఎప్పుడు గెలిచారు... ఓడించింది ఎవరు అనే విషయాలు ప్రస్తావించారు. చనిపోయిన తర్వాత కూడా పార్లమెంట్‌లో విగ్రహం పెట్టింది వీపీ సింగ్ ప్రభుత్వంలోనే అని తెలిపారు.
Also Read: ఐపీఎస్ సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు - సీఐడీని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు
అంబేడ్కర్‌పైపై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తున్నారా లేదా ఖండిస్తున్నారా మీ వైఖరి ఏంటని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏపీ సీఎం చంద్రబాబుకు గురువారం లేఖ రాశారు. అంబేడ్కర్‌పైపై అమిత్‌షా చేసిన వ్యాక్యలు సరికాదని వాటిని ప్రధాని కూడా ఖండించలేదని అన్నారు. అంతే కాకుండా వాటిని సమర్థించేలా కామెంట్స్ చేశారని తెలిపారు. ఇలాంటి అంశంపై చంద్రబాబు లాంటి వ్యక్తి లోతుగా ఆలోచించి స్పందించాలన్నారు కేజ్రీవాల్. చంద్రబాబు ఎలా స్పందిస్తారనే ఆలోచన ప్రజల్లో ఉందని అన్నారు. అందుకే దీనిపై చంద్రబాబు స్పందన ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
అటు ఉద్ధవ్ ఠాక్రే కూడా కూటమి నేతలపై ఒత్తిడి తీసుకొచ్చింది. అమిత్‌షా చేసిన కామెంట్స్ వాళ్లు సమర్థిస్తారా లేకుండా వ్యతిరేకిస్తారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకంగా ఉండటంతో ఈ వివాదంపై స్పందించాలని ఈ ఇద్దరిపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పార్టీ నేతలు, మంత్రులు నోరు జారి కొత్త సమస్యలు తీసుకురాకుండా ఉండేందుకు చంద్రబాబు మాట్లాడారు. పార్టీ, ప్రభుత్వం లైన్ ఏంటో చెప్పేశారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో చిన్న క్లాస్ కూడా తీసుకున్నారు.
Also Read: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?