అన్వేషించండి

Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!

Thalliki Vandanam Scheme AP:ఏపీలో తల్లికి వందనం పథకం కింద 15000 జమ  చేయడానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 19న నిధులు విడుదల కానున్నాయి. అర్హతలు, అప్లికేషన్‌ స్టేటస్‌, నగదు జమ వివరాలు గురించి తెలుసుకుందా. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జూన్ 19న విడుదల.
  • రూ.13వేలు తల్లికి, రూ.2వేలు పాఠశాల నిర్వహణకు, కిట్లు పంపిణీ.
  • పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఈ పథకం ఉద్దేశ్యం.
  • అర్హులు ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం, KYC అప్డేట్ చేయాలి.

Thalliki Vandanam Scheme AP: ఆంధ్రప్రదేశ్‌ మరో నాలుగు రోజుల్లో స్కూల్స్ ప్రారంభంకానున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం పథకం నిధులు ఎప్పుడు వస్తాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 19న నిధులు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. 

అధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2026 జూన్ 19వ తేదీన నిధులు విడుదల చేయనుంది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు. అదే రోజున విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్లను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

15000 ఎలా అందుతాయి?

తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 ఆర్థిక సాయం అందుతోంది. అయితే ఈ నిధుల వినియోగం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. 13వేలు విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఒక వేళ తల్లి లేని పక్షంలో కండ్రి లేదా చట్టబద్ధమైన సంరక్షకుడి ఖాతాలో నగదు వేస్తారు. మిగతా రెండు వేల రూపాయలను పాఠశాల లేదా కళాశాల నిర్వహణ నిధి కోసం కేటాయిస్తారు. ఇది పాఠశాలల్లో మౌలిక వసతులు, టాయిలెట్లు పరిశుభ్రత కోసం వినియోగిస్తారు. 

రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బడికి వెళ్లాలని, ఆర్థిక ఇబ్బందులు వల్ల ఏ ఒక్కరు కూడా చదువుకు దూరం కాకూడదని లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూల్స్‌లో చదివే పేద విద్యార్థులు కూడా ఈ పథకం వర్తింపజేయడం గమనార్హం. 

తల్లికి వందనం పథకానికి ఎవరు అర్హులు 

ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది వీటిని ధృవీకరిస్తున్నారు. విద్యార్థి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతూ ఉండాలి. గత విద్యా సంవత్సరంలో విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి, పది ఎకరాల లోపు మెట్ట భూమి మాత్రమే ఉండాలి. గత 12 నెలల సగటు కరెంటు వాడకం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. తప్పనిసరిగా వైట్‌రైస్ కార్డ్ కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కమ్‌ టాక్స్‌ చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు. 

ఎలా చెక్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటీ?

మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం సులభమైన మార్గాలను కల్పించింది. నవశకం పోర్టల్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఆధార్ నెంబర్‌ ఉపయోగించి అప్లికేషన్ స్టేటస్‌ను స్వయంగా చూసుకోవచ్చు. మీ సమీప గ్రామ లేదా వారు సచివాలయానికి వెళ్లి కూడా అర్హుల జాబితా గురించి ఆరా తీయవచ్చు. 

మీ బ్యాంకు అకౌంట్ అప్‌డేట్‌ చేశారా?

డబ్బులు అకౌంట్‌లో పడక ముందే విద్యార్థుల తల్లులు ఈ పనులు పూర్తి చేసుకోవాలి. తల్లిపేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా రన్నింగ్‌లో ఉండాలి. ఆధార్ నెంబర్‌, బ్యాంక్ ఖాతాను ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. ఒకవేళ మీ బ్యాంకులో కేవైసీ అప్‌డేట్ లేకపోతే వెంటనే పూర్తి చేయండి. లేదంటే నగదు బదిలీలో టెక్నికల్ ఇబ్బందులు తలెత్తవచ్చు. 

Frequently Asked Questions

తల్లికి వందనం పథకం నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి?

జూన్ 19న నిధులు విడుదల చేయనున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను బదిలీ చేస్తారు.

తల్లికి వందనం పథకం కింద ఎంత ఆర్థిక సాయం అందుతుంది, అది ఎలా వినియోగిస్తారు?

ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందుతుంది. రూ.13,000 తల్లి ఖాతాలో, రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధికి కేటాయిస్తారు.

తల్లికి వందనం పథకానికి అర్హత ప్రమాణాలు ఏమిటి?

విద్యార్థి 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదవాలి, 75% హాజరు ఉండాలి. కొన్ని భూమి, కరెంటు వినియోగ పరిమితులు, వైట్‌రైస్ కార్డ్ తప్పనిసరి.

తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను ఎలా తనిఖీ చేయాలి?

నవశకం పోర్టల్‌లో ఆధార్ నెంబర్ ఉపయోగించి స్టేటస్ చూడవచ్చు. లేదా సమీప గ్రామ/వార్డు సచివాలయంలో ఆరా తీయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Tension in Punganur: పుంగనూరు, రాయచోటిలో టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
పుంగనూరు, రాయచోటిలో టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget