అన్వేషించండి

ప్రజలకు మరిన్ని రుణాలు ఇచ్చి సహకరించండి- బ్యాంకర్లకు మంత్రి బుగ్గన సూచన

దేశ ఆక్వారంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో 40 నుంచి 50 శాతం వాటా రాష్ట్రం నుంచే జరుగుతున్నాయని వివరించిన మంత్రి బుగ్గన...ఈ రంగం తోడ్పాటును బ్యాంకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో బ్యాంకింగ్ సెక్టార్ కీలకపాత్ర పోషిస్తోందని కితాబు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాబట్టి రైతులకు వ్యవసాయ పంట రుణాలు, కౌలు రైతులకు రుణాలు అందించుటలో బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ణప్తి చేశారు.

ఎంఎస్ఎంఇ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా బ్యాంకర్లకు వివరించారు బుగ్గన. ఆ రంగంలో కూడా బ్యాంకులు తమ వంతు తోడ్పాటును అందించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరారు. టిడ్కో గృహాలు, ఇతర గృహనిర్మాణ పథకాల లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరులో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలులో బ్యాంకులు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమైనదని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అభిప్రాయపడ్డారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ (SLBC) సమావేశం జరిగింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక(ఎసిపి)అమలులో వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతి, వివిధ ఇండికేటర్ల వారీ సాధించిన లక్ష్యాలు సమీక్షించారు.

ఆక్వా రంగం పై ...

దేశ ఆక్వారంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో 40 నుంచి 50 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే జరుగుతున్నాయని వివరించిన మంత్రి...ఈ రంగంలో తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు అన్ని విధాలా కృషి చేయాలని బ్యాంకరులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గానికి ఒక నైపుణ్య హబ్ ఏర్పాటు చేస్తోందని నైపుణ్యాభివృద్ధిని ఇంటిగ్రేట్ చేసేందుకు వీలుగా బ్యాంకులు తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సూచించారు.  ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్ధులు బ్యాంకులతో ఇంటర్నషిప్పు చేసేందుకు వీలుగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సబ్ కమిటీ ముందుకు రావాలని అన్నారు. 

బ్యాంకుల మాటేంటంటే....

సమావేశంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్, కంట్రీ హెడ్ ఫర్ అగ్రికల్చర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు బ్యాంకులు తగిన సహకారాన్ని అందిస్తు న్నాయని పేర్కొన్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు వార్షిక రుణ ప్రణాళిక మొత్తం 3లక్షల 19వేల 480 కోట్ల రూపాయల రుణాలు అందించాల్సి ఉండగా జూన్ 30 వరకూ లక్షా 39వేల 798 కోట్లు సహాయం అందించినట్టు వివరించారు. 43.76 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. రంగాల వారీగా చూస్తే ప్రాధాన్యతా రంగం కింద 2లక్షల 35వేల 680 కోట్లు అందించాల్సి ఉండగా 74వేల 177 కోట్లు అందించి 31.47శాతం లక్ష్యాన్ని సాధించాయని వివరించారు. వ్యవసాయానికి సంబంధించి లక్షా 64వేల 740 కోట్లు అందించాల్సి ఉండగా 53వేల 732 కోట్లు అందించి 32.62శాతం లక్ష్యాన్ని అందుకున్నామని తెలిపారు. ఎంఎస్ఎంఇ కింద 50 వేల 100 కోట్లు అందించాల్సి ఉండగా 17 వేల 847 కోట్లు అందించి 35.62 శాతం లక్ష్యాన్ని సాధించారని పేర్కొన్నారు. ప్రాధాన్యేతర రంగానికి సంబంధించి 83వేల 800 కోట్లు అందించాల్సి ఉండగా జూన్ 30 నాటికి 65 వేల 622 కోట్లు సహాయం అందించి 78.31 శాతం లక్ష్యాన్ని అధిగమించినట్టు శ్రీనివాసరావు చెప్పారు. 

ఎస్ఎల్బీసి కన్వీనర్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ మాట్లాడుతూ... జూన్ 30 వరకూ వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతి వివరించారు. వివిధ ఆన్ గోయింగ్ ప్రచార కార్యక్రమాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు గురించి మాట్లాడారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ఇన్చార్జి అనిల్ మిశ్రా మాట్లాడుతూ కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు మరింత తోడ్పాటును అందించాలని సూచించారు. నాబార్డు జనరల్ మేనేజర్ ఎన్.ఎస్.మూర్తి మాట్లాడుతూ గత ఏడాది నాబార్డు ద్వారా రాష్ట్రంలో 26వేల కోట్లు సహాయం అందించగా ఈ ఏడాది 37వేల 500 కోట్లు సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 14వేల కోట్లు అందించినట్టు చెప్పారు. జిల్లాల పునర్వవస్థీకరణతో పొటెన్సియల్ లింక్డ్ ప్లాన్(పిఎల్పి) ఒక సవాలు కానుందని పేర్కొన్నారు. 

ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళిక అమలులో వివిధ బ్యాంకులు మెరుగైన ఫలితాలను సాధించాయని చెప్పారు ఎన్‌ఎస్‌ మూర్తి. ముఖ్యంగా వ్యవసాయ టర్మ్ రుణాలలో మంచి లక్ష్యాలు సాధించాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓ)కు మరిన్ని రుణాలు అందించాలని సూచించారు. వ్యవసాయ సాంకేతికతలో భాగంగా డ్రోన్ల వినియోగానికి తగిన తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు అన్ని విధాలా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Embed widget