Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
ఏపీలో జూన్ 12న స్కూళ్లు తెరుచుకోనున్నాయి. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు, కొత్త డిజైన్ యూనిఫామ్స్ పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ గురించి చూద్దాం.

Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవుల సందడి ముగిసింది. మళ్లీ బడి గంట మోగనుంది. 2026-27 నూతన విద్యాసంవత్సరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు, విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు, రాజకీయ రంగులు లేని సరికొత్త విద్యాసామాగ్రిని అందించడానికి రెడీ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభంకానున్నాయి. విద్యార్థులు పాఠశాలలో అడుగుపెట్టిన మొదటి రోజే వారి చేతికి విద్యా సామాగ్రి అందాలనేది ప్రభుత్వ సంకల్పం. జూన్ 12న పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ ప్రారంభమవుతుంది. జూన్ 20 లోపు కొత్త డిజైన్ యూనిఫామ్‌లు, షూ, సాక్స్ వంటి కి్ సామాగ్రిని విద్యార్థులకు అందజేస్తారు.
విద్యార్థులకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్‌లో విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులను అత్యుత్తమ నాణ్యతతో పొందుపరిచారు. సంబంధిత తరగతికి చెందిన అన్ని పుస్తకాల సెట్, అభ్యాసానికి అవసరమైన నాణ్యమైన పుస్తకాలు, 3 జతల సరికొత్త క్లాసీ డిజైన్ యూనిఫామ్. మన్నికైన, కొత్త రకం బ్యాగ్, ఒక జత షూ, రెండు జతల సాక్స్. బెల్ట్, విద్యార్థుల కోసం ఆక్స్‌ఫ్డ్ తెలుగు- ఇంగ్లిష్ డిక్షనరీ ఉంచారు.
విద్యాశాఖ యంత్రాంగం చెప్పిన వివరాల ప్రకారం కిట్‌లు, బుక్స్ 99 శాతం జిల్లా బుక్ డిపోల నుంచి మండల వనరుల కేంద్రాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్టాక్ సేకరించి విద్యార్థులకు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
కుట్టు కూలీ పెంపు
యూనిఫామ్ క్లాత్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులపై భారం పడకుండా ప్రభుత్వం యూనిఫామ్ కుట్టించుకునేందుకు డబ్బులు ఇస్తోంది. 1-8తరగతులు పిల్లల యూనిఫామ్‌కు జతకు 120 చొప్పున మూడు జతలకు నగదు అందుతుంది. 9-10 తరగతుల విద్యార్థుల యూనిఫామ్‌కు జతకు 240 రూపాయలు తల్లుల ఖాతాల్లో వేస్తారు.
ట్రెండింగ్ వార్తలు






















