అన్వేషించండి

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా రైతుల త్యాగాలను నేతలు గుర్తు చేసుకున్నారు.

Amaravati: ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీకి అమరావతే రాజధాని అని శనివారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానంపై మాట్లాడిన నేతలు రైతుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలపై విమర్శలు చేశారు. 

అసెంబ్లీలో ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. సరిగ్గా ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై సుమారు నాలుగు గంటల పాటు చర్చ  జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా 20 మందిపైగా సభ్యలు చర్చలో పాల్గొంటున్నారు. 

ముందుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ... ఈ సమావేశం ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతి రూపమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే పవిత్ర యజ్ఞం ఈ సమావేశంలో మొదలైందని ఆయన కామెంట్ చేశారు. ఈ చారిత్రాత్మక సమావేశానికి 11 మంది వైసీపీ సభ్యులు వస్తారని ఆశించామని  కానీ చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం లేక వారు రాలేదని స్పీకర్ విమర్శించారు. 

రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు తమ ప్రాణప్రదమైన 34, 400 ఎకరాల భూములను స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చారని మంత్రి నారాయణ గుర్తు చేశారు. 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వగా, ఫిబ్రవరి నాటికే రైతులు భూములను అప్పగించారని ఆయన తెలిపారు. వైసీపీ నాయకుల ఎన్ని దుష్ప్రచారాలు చేసినా రైతులు ఎక్కడా తలొగ్గలేదని కొనియాడారు. 

చట్టబద్ధమైన రక్షణ ఎందుకు?

వైసీపీ పాలనాకాలంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన రాజకీయ పరిణామాలతో అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని పూర్తిగా విస్మరించింది. ఐదేళ్లపాటు అమరావతిని గాయపరిచింది. అందుకే భవిష్యత్‌లో మరెవరూ అధికారంలోకి వచ్చినా రాజధానిని కదిలించకుండా ఉండాలంటే దీనికి చట్టబద్ధమైన రక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని  సెక్షన్ 5లో ఏపీ రాజధాని అమరావతి అని స్పష్టంగా చేర్చడం ద్వారా దీనికి తెరుగులేని చట్టబద్ధత లభిస్తుంది. ఈ దిశగా పార్లమెంట్‌లో చట్టసవరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అందుకే దిద్దుబాటు చర్యల కోసమే అసెంబ్లీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. 

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget