అన్వేషించండి

Ambati Rambabu: పవన్ స్పీచ్ చంద్రబాబు స్క్రిప్టే, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం - అంబటి కౌంటర్

తాడేపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కూడబలుక్కొనే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

పవన్ కల్యాణ్ స్పీచ్ మొత్తం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కల్యాణ్ చేసే ఉడత ఊపులకు భయపడేది వైఎస్ఆర్ సీపీ కాదని అన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్న పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారాహి అనే అమ్మవారి వాహనం పేరు పెట్టుకొని దానిపైకి ఎక్కి పిచ్చి వాగుడు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రెండుసార్లు ఓడిపోయిన పవన్ కల్యాణ్, అమ్మవారి శాపంతో మళ్లీ ఓడిపోతారని అన్నారు. తాడేపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు.

వైఎస్ జగన్ రెక్కల కష్టం మీద పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారని, ఎవరిదగ్గరో పార్టీని లాక్కోలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోబోమని అన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కూడబలుక్కొనే వ్యాఖ్యలు చేస్తున్నారని, సత్యహరిశ్చంద్రుల్లా కలరింగ్ ఇస్తూ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.

‘‘దిగజారి మాట్లాడే పవన్‌ రాజకీయాలకు అస్సలు పనికి రాడు. షూటింగ్‌ బ్రేక్స్‌లోనే ఆయన ఆంధ్రాలో అడుగు పెడతారు. ఏపీలోనే ఉంటానని పవన్‌ కల్యాణ్ చెప్పగలరా? దమ్ముంటే ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటానని పవన్ కల్యాణ్ చెప్పగలడా? తనకు ప్రాణహాని ఉందంటూ పవన్‌ కల్యాణ్ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పవన్‌కు ఎవరి మీద అనుమానం ఉందో కచ్చితంగా చెప్పి తీరాలి. నిజంగా ప్రాణహాని ఉంటే ప్రభుత్వానికి సాక్ష్యాధారాలు ఇవ్వాలి. ప్రాణహాని ఉంటే పోలీసులకు కంప్లైంట్‌ ఎందుకు చేయలేదు’’

క్లారిటీలేని పార్టీ జనసేన, పవన్‌ ఓ పిరికి పంద. చంద్రబాబుకు మద్దతు పలకడానికి పుట్టిందే జనసేన పార్టీ. జనసేనను ఉంచుతాడో, మూసేస్తాడే పవన్‌ కల్యాణ్ కే తెలీదు. చంద్రబాబును సీఎంగా చేయడమే పవన్‌ లక్ష్యంగా పెట్టుకున్నాడు. పవన్‌ కల్యాణ్ లక్ష్యం నెరవేరే అవకాశమే లేదు. ఆయన మాటలు నమ్మి యువత మోసపోకండి. పవన్‌ పిచ్చి చేష్టలకు పిల్లలను బలి చేయవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా’’

శ్రీవాణి ట్రస్టుపైనా అంబటి స్పందన

‘‘శ్రీవాణి ట్రస్టు గురించి చంద్రబాబు, పవన్‌ మాట్లాడుతున్నారు. తిరుమలలోని శ్రీవాణి ట్రస్టులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు. ఇక ముందు జరిగే ప్రసక్తి లేదు. పవన్‌ కల్యాణ్ చెప్పులు పొగొట్టుకున్నట్లు బట్టలు కూడా పొగొట్టుకుంటాడు. కేవలం అండర్ వేర్ తోనే కనిపిస్తాడు. ఎమ్మెల్యే ద్వారంపూడిని కొడతానని అంటున్నాడు. పవన్‌ కల్యాణ్ అంత మగాడివా? పవన్‌ రాజకీయం చేస్తున్నారా? రౌడీయిజం చేస్తున్నారా?’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

" కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అవుతుందట! ఇప్పటికే కౌరవ వధ జరిగింది కదా. వైఎస్ఆర్‌, వైఎస్‌ జగన్‌ చేతిలో ఇప్పటికే కౌరవ వధ జరిగింది. రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ వచ్చే ఎన్నికల్లో మరోసారి ఓడిపోతారు. వారాహి అంటే అమ్మవారు. అమ్మవారి పేరుతో పవన్‌ కల్యాణ్ వాహనం పేరు పెట్టుకొని దాని పైకి ఎక్కి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అమ్మవారి శాపంతో ఇక పవన్‌ కల్యాణ్ సినిమాలేవి హిట్‌ కావు. ఇది అమ్మవారి శాపం "
-అంబటి రాంబాబు

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget