అన్వేషించండి

Amaravati High Alert: అమరావతిలో హై అలర్ట్‌! ఆరు చెక్‌పోస్టులు, డ్రోన్లతో భద్రత కట్టుదిట్టం! అసలేం జరిగిందంటే?

Amaravati High Alert: అమరావతిలో భద్రతను పోలీసులు పెంచారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో విద్రోహ చర్యలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమరావతిలో అవాంఛనీయ ఘటనల నివారణకు హై అలర్ట్.
  • రాజధానిలోకి ప్రవేశించే వాహనాల తనిఖీకి చెక్‌పోస్టులు ఏర్పాటు.
  • అనుమానిత కదలికల పర్యవేక్షణకు డ్రోన్‌లతో నిఘా వ్యవస్థ.
  • నిర్మాణ సంస్థలకు సీసీటీవీ, సెక్యూరిటీ, ఫైర్ సేఫ్టీ ఆదేశాలు.

Amaravati High Alert: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజధాని నగర పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కీలక ప్రకటన విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలో ఇటీవల జరుగుతున్న కొన్ని అవాంఛనీయ ఘటనలు, అమరావతి నిర్మాణం తిరిగి ఊపందుకుంటున్న వేళ విద్రోహక శక్తులు తలదూర్చకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. 

ఈ భద్రతా వ్యూహంలో భాగంగా తక్షణమే అమలులోకి వచ్చేలా ఆరు ప్రధాన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కేవలం పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం ఈ కొత్త ప్రోటోకాల్‌ ప్రధాన ఉద్దేశం. 

రాజధాని లోపలికి వచ్చే, బయటకు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసేందుకు 6 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దీని వల్ల అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఆధునిక సాంకేతికతను జోడించి, రాత్రి సమయాల్లో క్షేత్రస్థాయిలో పోలీసులు వెళ్లలేని ప్రాంతాలను సైతం గమనించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్ కెమెరాలు నిరంతరం ఆకాశం నుంచి నిఘా వేసి, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తాయి. పోలీసు వాహనాలు నిరంతరం రాజధాని రహదారులపై గస్తీ తిరుగుతూ ఉంటాయి. ఇది నేరస్తుల్లో భయం కలిగించడమే కాకుండా, స్థానికుల్లో, నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికుల్లో భద్రతా భావాన్ని కల్పిస్తుంది. 

నిర్మాణ సంస్థలకు కఠిన ఆదేశాలు 

అమరావతిలో ప్రస్తుతం అనేక నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా నిర్మాణ సంస్థలకు ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం పోలీసులదే కాదని, సంబంధిత సంస్థలు కూడా సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. 

ప్రతి నిర్మాణ ప్రాంగణంలో హైడెఫినిషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. నిర్మాణ సంస్థలు తమ సొంత సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకొని, పగలు, రాత్రి వేళల్లో గస్తీ కాయాలి. నిర్మాణ సమయంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ హెచ్చరించారు. 

Frequently Asked Questions

అమరావతి ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ఎందుకు ప్రకటించారు?

రాజధానిలో ఇటీవల జరుగుతున్న అవాంఛనీయ ఘటనలు, అమరావతి నిర్మాణం పురోగమిస్తున్న నేపథ్యంలో విద్రోహ శక్తుల కదలికలను అడ్డుకోవడానికి ఈ హై అలర్ట్ ప్రకటించారు.

భద్రతా వ్యూహంలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

ఆరు ప్రధాన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లోనూ నిరంతర నిఘా, అనుమానితుల కదలికలను పర్యవేక్షించడం దీనిలో భాగం.

అమరావతిలో భద్రత కోసం డ్రోన్లను ఎలా ఉపయోగిస్తున్నారు?

డ్రోన్లను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి, రాత్రిపూట పోలీసులు వెళ్లలేని ప్రాంతాలను కూడా గమనిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తాయి.

నిర్మాణ సంస్థలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు?

ప్రతి నిర్మాణ ప్రాంగణంలో హైడెఫినిషన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సొంత సెక్యూరిటీ సిబ్బందితో పగలు, రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలి.

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget