అన్వేషించండి

Chandrabau : అమరావతిని అంగీకరించి మోసం చేసిన జగన్ - మళ్లీ ప్రజాతీర్పు కోరాలని చంద్రబాబు సవాల్

జగన్ అంగీకారంతోనే అమరావతి నిర్ణయం తీసుకున్నామని.. ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేసినందున మళ్లీ ప్రజాతీర్పు కోరాలని చంద్రబాబు సీఎం జగన్‌కు సవాల్ చేశారు.


అమరావతి రాజధానిగా అందరి ఆమోదంతో అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామని అప్పుడు జగన్ కూడా అంగీకరించారని ... ఇప్పుడు మడమ తిప్పి ప్రజల్ని మోసం  చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ప్రజాతీర్పు కోరాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు అన్ని విషయాలుప పరిసీలించిన తర్వాత తీర్పు ఇచ్చింది ఇందులో తప్పేంటని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరుడికీ హక్కులు బాధ్యతలు ఉంటాయి. చట్టాలు ఎలా చేయాలి పార్టీలు ఎలా  ఉండాలి.. అదే పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి చట్టాలు చేయాలి అనేది స్పష్టంగా హక్కులు విభజించిందని చంద్రబాబు గుర్తు చే్సారు. కార్యనిర్వాహక శాఖ స్వతంత్రంగా ఉండాలి. పక్షపాతం లేకుండా పనిచేయాలని ఆల్‌ఇండియా సర్వీస్ తీసుకు వచ్చారు. ఈ వ్యవస్థల్లో చేసిన తప్పులను మీడియా ఎత్తి చూపుతుంది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుంది. న్యాయస్థానంలో న్యాయం జరగలేదంటే... పై కోర్టుకు వెళ్లొచ్చు. ప్రజలను చంపేస్తామని చట్టం తీసుకుంటే చెల్లుబాటు కాదని చంద్రబాబు స్పష్టం చేసారు.  

ఆనాడు అమరావతి ఒప్పుకున్నారుగా జగన్: చంద్రబాబు

సీఎంలపై కోర్టులు కామెంట్‌ చేస్తే చాలా మంది రిజైన్ చేశారు. మంత్రులపై కామెంట్ చేస్తే రాజీనామా చేశారు. కానీ మేం చెప్పిందే చేస్తాం.. చెసిందే చట్టం అంటే కుదరదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  మూడు రాజధానుల గురించి మాట్లాడే అర్హత లేదని చంద్రబాబు స్పష్టం చేఏశారు.ఆనాడు అమరావతి ప్రతిపాదన తీసుకొస్తే ఓకే చెప్పారు. ఆనాడు 33 వేల ఎకరాలను రైతులు ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విదంగా భూములు ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా తీసుకున్నాం. ఆరోజు అమరావతికి జై కొట్టారు. ఎందుకంటే ఆనాడు కాదు అంటే సీట్లు రావని తెలుసు. అందుకే అప్పుడు ఓకే చెప్పారు. నమ్మకద్రోహం చేశారు. మూడు రాజధానులు అంటున్నారు అదే అంశంపై రాజీనామ ాచేసి ప్రజల్లోకి వెళ్లండి. అప్పుడు చెప్పండి.  ఇద్దరు ఒప్పందం చేసుకుంటే ఒకరు ఏకపక్షంగా వెనక్కిపోవడానికి వీల్లేదన్నారు.  సెల్ఫ్ ఫ్‌ ఫైనాన్స్‌ గురించి తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరం. దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది స్పష్టంగా ఉంది. అక్కడ డెవలప్‌మెంట్‌ జరిగితే ఆదాయం పెరుగుతుంది. అబివృద్ది చేయకపోతే పన్నులు రావు. ఇందులో ఒక్కరూపాయి కూడా ప్రభుత్వం పెట్టనవసరం లేదు. జగన్ మోసం రెడ్డి అని పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. 

మోసం రెడ్డి అని పేరు మార్చుకో : చంద్రబాబు

అన్ని మోసాలు అబద్దాలేనని చంద్రబాబు తప్పు పట్టారు. అప్పట్లో కౌన్సిల్‌ను రద్దు చేస్తామన్నారు. బలం పెరిగిన తర్వాత రద్దును వెనక్కి తీసుకున్నారు. ఇది రాజ్యాంగ వ్యవస్థపై దాడి చేస్తున్నారు. నిన్న సీబీఐపై దాడి చేస్తారు. దాన్ని హైకోర్టూ చూస్తూ ఉండాలా... సీబీఐపై కేసు పెడతారా. న్యాయమూర్తులపై దాడి చేస్తే కోర్టులు జోక్యం చేసుకోవా. మాట్లాడే హక్కు లేదా.. ఎంపీ మాట్లాడితే తప్పుడు కేసు పెట్టి కేసులు టార్చర్‌ పెట్టారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వ్యక్తులను ఎలిమినేట్ చేస్తారా..? అని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్‌లో రియల్ ఎస్టేట్‌ ఏంటి... బినామీలు అంటున్ననారు.. ప్రభుత్వం మీదేగా ఏం చేశారు. ప్రభుత్వం విశ్వసనీయత పోగొట్టుకున్నప్పుడు రైతులపై దాడులు చేసినప్పుడు ఆర్టికల్ 222 ప్రకారం హైకోర్టు జోక్యం చేసుకుంది. ఇక్కడ ప్రజలే సుప్రీం... ఇక్కడ నిన్ను నిరంకుశ పాలన చేయమని చెప్పలేదు. నీవు ప్రజల ఆస్తులకు రక్షకుడేవే కానీ డిక్టేర్‌వి కావని చంద్రబాబు స్పష్టం చేశారు. కేసులు పెడతా... మీ ఇంటిపైకి వస్తానంటే ఊరుకుంటామా... మీడియాపైనే జీవోలు తీసుకొస్తారా... మీరు ప్రజాస్వామ్యం గురించా మాట్లాడేదా... మీ కాళ్ల బేరానికి రావాలని కోరుకోవడం ప్రాజస్వామ్యమా.. రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం హైకోర్టులు జోక్యం చేసుకుంటాయి. ప్రైడే రావడం అరెస్టు చేసేవాళ్లు సుప్రీంకోర్టు జోక్యంతో వెనక్కి తగ్గారు.

ప్రాథమిక హక్కులను కాలరాస్తూంటే కోర్టులు జోక్యం చేసుకోకూడదా ?: చంద్రబాబు

అదే సీఆర్డీఏలో రైతులు వెనక్కి పోతామంటే ప్రభుత్వం అంగీకరిస్తుందా... ఎవరూ అతిక్రమంచి వద్దని చెప్పాక కూడా ప్రభుత్వం ఎందుకు ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు.  రాష్ట్రంలో మూడు రాజధానులు అని చెప్పి విధ్వేశాలు రెచ్చగొట్టారు. ఇంకా రాష్ట్రంపై అభిమానం ఉంటే మరో మాట్లాడకుంటా ఈ పనులు చేసి ఉండాలి. మూర్ఖత్వంతో ముందుకెళ్తున్నారు. ఏం చేసినా జరుగుతుందని అనుకుంటున్నారు. పోలీసులతో ప్రతిపక్షాలను అణచి వేయాలని చూస్తున్నారు. మేం ఎప్పుడు ప్రజల తరపున పోరాడుతాం. విజ్ఞత ఉంటే... సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే. అక్కడ ఇచ్చిన తీర్పున బట్టి ప్రవర్తించాల్సి ఉంటుంది. అప్పుడెందుకు అంగీకరించారు. అప్పుడెందుకు అమరావతికి ఓటు వేశారు. అది మోసం కాదా... ప్రాథమిక హక్కులను కాలరాసి కొందరు చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. కౌరవులు కూడా విర్రవీగారు.. కానీ అంతిమ విజయం పాండవులదే. అదే పరిస్థితి వైసీపీకి వస్తుందన హెచ్చరించారు.  

జగన్‌కు ఇల్లు లేనిదెక్కడ?

తనకు అమరావతిలో ఇల్లు లేదనడంపై చంద్రబాబు స్పందించారు. నీకు విశాఖలో ఇల్లు కట్టుకుంటున్నావ్‌. విజయవాడలో కట్టుకున్నావ్‌ హైదరాబాద్‌లో ఉంది. చెన్నైలో ఉంది. బెంగళూరులో కూడా ఉంది. ఇడుపులపాయలో కూడా ఉందని గుర్తుచేశారు.    శివరామకృష్ణ కమిటీ కూడా విజయవాడ గుంటూరు జిల్లా మధ్యలో పెట్టాలన్నారు. అప్పుడు దీనికి అంగీకరించామన్నారు.  నువ్వుకూడా అంగీకరించావు. లేని చట్టం కాదు... పిటిషనర్లు న్యాయం చేయాలని కోరారు. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పనులుచేయాడానికి ముందుకెళ్లలేదు. ఆ రైతులకు హక్కులు లేవా.. ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కోర్టుకు వెళ్లే హక్కు లేదా.. మీ హద్దులు మీరు దాటుతున్నారు. రాజ్యాంగంలోని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. నీవు విధ్వంసంకరమైన పాలనసాగుతోంది. వాళ్లకు కోర్టులు తీర్పులు ఇవ్వకూడదు.. మీడియా వార్తలు రాయకూడదు.. నేతలు నాకు వ్యతిరేకంగా మాట్లాడరాదన్నదే వాళ్ల ఉద్దేశం. వ్యతిరేకంగా తీర్పు వస్తుందని తీసుకున్నారు. కానీ స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. ఆ నేపథ్యంలో వచ్చిన తీర్పు ఇది. ఐదేళ్ల కాలంలో ప్రజలను చంపేస్తాం ఎవరూ మాట్లాడొద్దని అంటే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

అభివృద్ధి వికేంద్రీకరణతోనే ప్రగతి సాధ్యం. విశాఖలో ఏం చేశారో చూశాం. ఇప్పుడు ఇరవై మూడు జిల్లాలు అంటున్నావ్‌... రొటేట్‌ రాజధాని పెట్టండి.. అలాగే మోదీతో మాట్లాడి... పార్లమెంట్‌ను కేంద్రం పాలన కూడా ట్రైన్‌లో దేశమంతా తిప్పండీ.. మేం అభివృద్ధి చెందుతామని చెప్పండి.. దీనిపై చర్చకు వస్తారా... మా పార్టీ సిద్ధంగా ఉందని జగన్‌కు సూచించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
World Travel Market: లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
Embed widget