By: ABP Desam | Updated at : 01 Nov 2021 12:53 PM (IST)
అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం !
ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేపట్టిన " న్యాయస్థానం టు దేవస్థానం " పాదయాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభమయింది. అమరావతి జేఏసీ నేతృత్వంలో ఈ మహాపాదయాత్ర సాగనుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు నిర్వహించారు. తర్వాత సర్వమత ప్రార్థనలు చేసి .. రైతులు నడక ప్రారంబించారు.
Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షించాలని అలాగే.. అమరావతి వల్ల 13 జిల్లాలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తామని రైతులు ప్రకటించారు. ఈ పాదయాత్ర.. మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి ర్యాలీగా వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాలు కిక్కిరిసిపోయాయి.
Also Read : ఏపీ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
పాదయాత్రకు వైసీపీ మినహా అన్నిరాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు. తమ తమ ప్రతినిధుల్ని పంపారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ వంటి పార్టీలతో పాటు ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానిక ిటీడీప ీతరపున దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నేతలు తెనాలి శ్రవణ్‌కుమార్, మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేవరకు తమ మద్దతు కొనసాగుతుందని టీడీపీ నేతలు భరోసా ఇచ్చారు. అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రను ఆదరించాలని రాష్ట్ర ప్రజలకు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 45 రోజుల పాటు జరిగే మహా పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలకాలని కోరారు.
రైతుల పాదయాత్రకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘిభావం తెలియచేశారు. ఇది పాదయాత్ర కాదు, రాష్ట్ర పరిరక్షణ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమితల్లి వారసులు చేస్తున్న ఉద్యమమన్నారు.
ఓ వైపు విజన్ 2020 ఫలితాలు చూసి సంతోషం కలుగుతున్నా... మరో వైపు విజన్ 2029 ప్రణాళికల అమలుపై గొడ్డలి వేటుతో బాధగలుగుతోంది. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం. అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకారమవుతుంది.(3/4) #AmaravatiFarmersMarch
— N Chandrababu Naidu (@ncbn) November 1, 2021
టీడీపీ యువనేత లోకేష్ కూడా రైతులకు సంఘిభావం తెలిపారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో ప్రజారాజధాని అమరావతి పరిరక్షణకి మీరు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
రాజధాని కోసం త్యాగం, భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం. అణిచివేతకి గురైనా, అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా జై అమరావతి అంటూ నినదిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు ఉద్యమాభివందనాలు.(1/2)#AmaravatiFarmersMarch
— Lokesh Nara (@naralokesh) November 1, 2021
Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ
Salman Khan: వైజాగ్ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు
Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం
Vruksha Bandhan: రక్షా బంధన్ కాదిది వృక్షా బంధన్- విశాఖలో మహిళల వినూత్న వేడుక
AP Government : నాయీ బ్రాహ్మణలను అలా పిలిస్తే కేసులు - ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం !
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?