By: ABP Desam | Updated at : 30 Oct 2021 02:30 PM (IST)
నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ అభ్యర్థులపై గురి
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా ఎలాంటి షెడ్యూల్ , నోటిఫికేషన్ రాలేదు . కానీ రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ప్రచారం బరిలోకి దిగడమే కాదు.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని వేధించడం కూడా ప్రారంభించేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, గత మున్సిపల్ ఎన్నికల్లో అనేక చోట్ల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం, వారి వ్యాపారాలను దెబ్బతీయడం వంటివి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు నెల్లూరులో ఇంకా అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందే అవే రిపీట్ అవుతున్నాయి. ఇవి రాజకీయ వివాదానికి కారణం అవుతోంది.
Also Read : డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా ?
నెల్లూరు కార్పొరేషన్‌ోల 11వ డివిజన్‌కు తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా అల్లారెడ్డి విజయనిర్మలను ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆమె ప్రచారం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అలా ప్రకటించిన తర్వాతి రోజే ఆమె ఇంటిపై నెల్లూరు మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. ఎందుకంటే ఆమె జీవనోపాధి క్యాటరింగ్ సర్వీస్. వెంటనే ఫు్డ సేఫ్టీ పేరుతో అధికారులు అల్లారెడ్డి విజయనిర్మల ఇంటిపై దాడులు చేసి సోదాలు చేశారు. ఈ విషయం వెంటనే టీడీపీ నేతలందరికీ తెలియడంతో పెద్ద ఎత్తున విజయనిర్మల ఇంటికి చేరుకున్నారు.
నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హుటాహుటిన అభ్యర్థి ఇంటికి వచ్చి హెల్త్ ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తమపై ఇలా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ అధికారులు వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ తరపున కార్పొరేషన్ ఎన్నికలలో పోటీచేస్తే ఇలా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు.
నెల్లూరులో వైసీపీ గెలుపును మంత్రి అనిల్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తన పరిధిలో క్లీన్ స్వీప్ చేయడమే కాదు.. జిల్లా మంత్రిగా నెల్లూరులో అత్యధిక స్థానాలను గెలిపించాలని లక్ష్యంగా పెట్టుకుని అక్కడే పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటర్ల కంటే పోటీ చేసే అభ్యర్థుల్ని టార్గెట్ చేసుకుంటే లక్ష్యం సులువు అవుతుందన్న అంచనాకు వచ్చినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి !
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Dharmana Prasada Rao : అమ్మ ఒడి డబ్బులు పంచే కార్యక్రమం కాదు, విపక్షాలకు మంత్రి ధర్మాన కౌంటర్
VIMS Jobs : విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి!
Breaking News Live Telugu Updates: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు