Minister Roja : డేటా చౌర్యం బాబా డేరా బాబా కన్నా పెద్ద దొంగ- మంత్రి ఆర్కే రోజా
Minsiter Roja : మంత్రి రోజా మరోసారి టీడీపీ, జనసేనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డేటా చౌర్యం బాబా అంటూ విమర్శలు చేశారు.
![Minister Roja : డేటా చౌర్యం బాబా డేరా బాబా కన్నా పెద్ద దొంగ- మంత్రి ఆర్కే రోజా Amaravati Minister RK Roja fires on Chandrababu Pawan Kalyan about Pegasus spyware case DNN Minister Roja : డేటా చౌర్యం బాబా డేరా బాబా కన్నా పెద్ద దొంగ- మంత్రి ఆర్కే రోజా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/8a726f7d80bd03433398c6b4c25739541663664491525235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minsiter Roja : టీడీపీ నేతలు పిచ్చి పట్టినట్లు శాసనసభలో వ్యవహరిస్తున్నారని మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజా మాట్లాడుతూ... టీడీపీ నేతలకు దేనిమీద పోరాడాలో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాసాధికారత సర్వే ద్వారా డేటా సేకరించి దుష్ట పన్నాగం పన్నారని ఆరోపించారు. ఈ డేటా బాబా డేరా బాబా కంటే పెద్ద దొంగ అని విమర్శించారు. 30 లక్షల మంది డేటాను చోరీ చేశారన్నారు. డేటా చౌర్యంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నానన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపించారు. 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ కు బాడీతో పాటు మైండ్ లో గుజ్జు కూడా కరిగిపోయిందని విమర్శించారు.
టీడీపీ నేతలను మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి
"నిజంగా ఎన్టీఆర్ పైన చంద్రబాబుకు ప్రేమ ఉంటే సీఎంగా సంతకం పెట్టిన మొదటి రోజే అన్న క్యాంటీన్ పెట్టుండేవారు. టీడీపీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా పెళ్లి కానుక ఇస్తున్నాం. 200 యూనివర్శిటీల్లో విద్యాకానుకను అమలుచేస్తున్నాం. చంద్రబాబుకు సిగ్గుందా? ఏనాడైనా అమ్మఒడి గురించి ఆలోచన చేశారా? ప్రజలను అభిమానిస్తారు కాబట్టే జగన్ అమ్మఒడి తీసుకొచ్చారు. టీడీపీ నేతలందరినీ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని జనం ఎదురు చూస్తున్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టిన నేత చంద్రబాబు. అక్కచెల్లెమ్మలు బాగుండాలనే జగన్ ఆసరా పథకం పెట్టారు. టీడీపీ నేతలు కళ్లుండి చూడలేని వాళ్లు. ఏనాడైనా మంచి పథకం పెట్టాలన్న ఆలోచనైనా చంద్రబాబు చేశారు." - మంత్రి ఆర్కే రోజా
షూటింగ్ లు లేని సమయంలో పవన్ ప్రెస్ మీట్లు
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీకి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చినరాజప్ప హోంమంత్రిగా ఉన్నప్పుడు హోంకే పరిమితమయ్యారని ఆరోపించారు. దేశమంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారని, ఏపీ అందిస్తున్న పథకాలన్నీ సంక్షేమం కోసమే అన్నారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ ,మైనార్టీలకు పెద్ద మొత్తంలో సంక్షేమం అందించిన వ్యక్తి సీఎం జగన్ అని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదన్నారు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. తనను విమర్శించే జనసేన పార్టీ నాయకులు నగిరిలోని తన ఇంటికొచ్చి మాట్లాడాలన్నారు. పవన్ కల్యాణ్ విలువలు లేని వ్యక్తి అని మండిపడ్డారు. ఏ ఎన్నికల్లో ఎవరికి ఓటేయమని చెబుతాడో ఆయనకే తెలియదన్నారు. షూటింగ్ లు లేని సమయంలో ప్యాకేజీ తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టడమే పవన్ పని అన్నారు. మమ్మల్ని తిడితే ఆకాశం మీద ఉమ్మినట్లే అని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Pegasus House Committe : డేటా చోరీ జరిగిందన్న హౌస్ కమిటీ - రిపోర్ట్ ఇవ్వాలని టీడీపీ సభ్యుల డిమాండ్ !
Also Read : Renuka Vs Kodali : కొడాలి నానిపై పోటీకి రేణుకా చౌదరి సై - అసెంబ్లీలో అలా అన్నారని ఫైర్ బ్రాండ్ నిర్ణయం !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)