News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Pegasus House Committe : డేటా చోరీ జరిగిందన్న హౌస్ కమిటీ - రిపోర్ట్ ఇవ్వాలని టీడీపీ సభ్యుల డిమాండ్ !

పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీ నియమించిన హౌస్ కమిటీ డేటా చోరీ జరిగిందని ప్రాథమకంగా నిర్ధారించింది. తమకు రిపోర్ట్ ఇవ్వాలని టీడీపీ సభ్యులు సభలో ఆందోళన చేశారు.

FOLLOW US: 
Share:

Pegasus House Committe :  పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వ్యక్తులపై నిఘా పెట్టారా లేదా అన్న అంశంపై తేల్చేందుకు గత అసెంబ్లీ సమావేశాల్లో నియమించిన హౌస్ కమిటీ ఏపీ అసెంబ్లీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. హౌస్ కమిటీ ఛైర్మన్  భూమన కరుణాకర్ రెడ్డి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.  గత ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందని కమిటీ ప్రాథమికంగా నిర్ధారించిందని తెలిపారు. దీనిపై ఇంకా విచారణ జరగాల్సి ఉందన్నారు.  డేటా చౌర్యం ఆరోపణలపై మార్చి 23న శాసనసభ ఒక సభా సంఘాన్ని వేసిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 

స్టేట్ డేటా సెంటర్‌లో ఉండాల్సింది టీడీపీ వ్యక్తులకు చేరిందన్న హౌస్ కమిటీ 

గత ప్రభుత్వ హాయాంలో 2016 నుంచి 2019 మే 30 వరకూ టీడీపీ ప్రభుత్వం స్టేట్ డేటా సెంటర్ ఉండాల్సిన సమాచారాన్ని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేరుగా ఆ సమాచారాన్ని పంపించారని తెలిపారు. తద్వారా వారు ప్రత్యేక లబ్ధి చేకూర్చుకున్నారని ఆరోపించారు. 2018, 2019 మధ్య కాలంలో వాళ్ల ప్రైవేటు సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, టీడీపీ వారు ఏర్పాటు చేసిన సేవా మిత్ర అనే యాప్ ద్వారా దాదాపు 30 లక్షలకు పైగా తమ ప్రభుత్వానికి వేయని ఓటర్ల ఓటు హక్కును రద్దు చేసిందని కమిటీ పరిశీలనలో తెలిపిందన్నారు.  

మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందన్న కమిటీ చైర్మన్

వివిధ శాఖల అధిపతులు, సంబంధిత అధికారులతో డేటా చౌర్యంపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశామని భూమన తెలిపారు. మొత్తం 85 పేజీలతో నివేదిక ఉంది. ఇది మధ్యంతర నివేదిక మాత్రమనని చెప్పడంతో హౌస్ కమిటీ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే హౌస్ కమిటీ నివేదికను ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఆ తర్వాతే చర్చ ప్రారంభించాలన్నారు. అయితే నివేదిక ఇవ్వకపోవడంతో టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. వారి నిరసనల మధ్య సభా కార్యక్రమాలు కొనసాగించారు. 

చంద్రబాబు పెగాసస్ వాడారని మమతా బెనర్జీ అన్నట్లుగా వార్తలు రావడంతో హౌస్ కమిటీ 

పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను చంద్రబాబు ఉపోయగించారంటూ బెంగాల్‌లో మమతా బెనర్జీ వ్యాఖ్యానించారని ఓ సారి ప్రచారం జరగడంతో  అసెంబ్లీలో దీనిపై చర్చించారు.  సభా సంఘం వేయాలని నిర్ణయించి.. ఆ కమిటీ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. అయితే  పెగాసస్ అంశాన్ని ఉపయోగించారా లేదా అన్నదాని కన్నా ఎక్కువగా ఈ కమిటీ డేటా చౌర్యంపై విచారణ జరిపినట్లుగా కనిపిస్తోంది. 

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ 

ఉదయం నుంచి సంక్షోభంలో సంక్షేమం పేరుతో టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.  హౌస్ కమిటీ నివేదిక విషయంలోనూ వారు నివేదిక ఇవ్వాలని పట్టుబట్టారు. ఇవ్వకపోవడంతో  స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

Published at : 20 Sep 2022 12:26 PM (IST) Tags: AP Assembly Meetings House Committee on Pegasus AP Assembly Data Theft Report

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్

Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్

Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Balineni YSRCP :  మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా  - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Andhra News: 'తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు అందించాలి' - సీఎం రైతుల బాధలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం

Andhra News: 'తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు అందించాలి' - సీఎం రైతుల బాధలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం

Rajahmundry Airport: రూ.347 కోట్లతో రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులు: మార్గాని భరత్

Rajahmundry Airport: రూ.347 కోట్లతో రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులు: మార్గాని భరత్

టాప్ స్టోరీస్

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే