Kodali Nani : ఎన్ని గుంపులు కలిసొచ్చినా చెల్లాచెదురు చెయ్యడానికి సింహం రెడీ, పొత్తులపై మంత్రి కొడాలి నాని కామెంట్స్

Kodali Nani On Chandrababu : రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత ఉంటే ఇంకో పార్టీతో పొత్తు ఎందుకని చంద్రబాబును ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. 151 సీట్లకు ఒక్కటి కూడా తగ్గకుండా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

FOLLOW US: 

Kodali Nani On Chandrababu : మాజీ మంత్రి కొడాని నాని పేరు ఆ మధ్య మారుమోగిపోయింది. టీడీపీపై ప్రత్యేకించి చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు చేయాలంటే కొడాలి నాని మించిన వారు లేరన్నంతగా పాపులర్ అయ్యారు. అయితే ఇదంతా మంత్రిగా ఉన్నప్పుడు, కానీ ఈ మధ్య ఆయన విమర్శల జోరు కాస్త తగ్గింది. తాజాగా ఆయన మళ్లీ స్పీడ్ పెంచినట్లు కనిపిస్తుంది. సోమవారం సీఎం జగన్ తో కొడాలి నాని భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఎవరు కలిసినా జగన్ కు ఉన్న 55 శాతం పైగా ఓట్లు అలాగే ఉంటాయన్నారు. ఎన్ని గుంపులు కలిసి వచ్చినా చెల్లాచెదురు చెయ్యడానికి సింహం రెడీగా  ఉందన్నారు. చంద్రబాబు అబద్ధాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. 2019 ఎన్నికల ముందు మహిళలంతా తనకే ఓటు వేశారని చెప్పుకున్న చంద్రబాబు, ఇప్పుడు జగన్ కు వ్యతిరేకత ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 

2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరివి 

"జగన్ పై వ్యతిరేకత ఉంటే చంద్రబాబుకు ఇంకో పార్టీ అవసరం ఏముంది. చంద్రబాబు త్యాగాలు చెయ్యొద్దు. 2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు. 1978లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ప్రస్తుతం ఉందని పవన్ చెప్తున్నారు. ఆ కూటమి 14 నెలలు అధికారంలో ఉంది. తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. పవన్ థియరీ కూడా అలాగే ఉంది. ఎవరు కలిసినా విడివిడిగా పోటీ చేసిన అంతే. బాబుకు అధికారం కావాలి. పవన్ కు డబ్బు కావాలి. పవన్, లోకేశ్ ముందు ఎమ్మెల్యేలుగా గెలవాలి. తర్వాత చూద్దాం. జనసేన టీడీపీ పొత్తుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉండదు." అని కొడాలి నాని అన్నారు.  

151కి ఒకటి కూడా తగ్గదు 

"వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్ర పవన్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందుకే దత్తపుత్రుడ్ని రంగంలోకి వచ్చాడు. పుత్రుడు, దత్తపుత్రుడు, వృద్ధతండ్రి అందరూ కలిసి వచ్చినా జగన్ ఏం చేయలేరు. సింగిల్ వస్తే జగన్ పంజా దెబ్బకు చెల్లాచెదురు అయ్యారు. ఇంకొసారి కలిసి వస్తే మరో దెబ్బ పడుతుంది. ఈ రోజు నాలుగు ఊర్లు తిరిగి జగన్ కు తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. అయితే ఈ పొత్తులు ఎందుకు మరి. పవన్, చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలు. ఎమ్మెల్యేగా గెలవనేని వ్యక్తి అధికారంలోకి వస్తాడా?. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి 151 సీట్లు గెలిచిన జగన్ పై విమర్శలా. చంద్రబాబు, పవన్ కలిసినా, ఇంకో నాలుగైదు కలిసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం. 151 సీట్లకు ఒక్కసీటు కూడా తగ్గకుండా గెలుస్తాం" అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.   

Published at : 09 May 2022 08:56 PM (IST) Tags: AP News Chandrababu Amaravati News Kodali nani TDP Janasena alliance pawan kalan

సంబంధిత కథనాలు

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్ 

Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్ 

Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!

Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!

టాప్ స్టోరీస్

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?