News
News
X

ఏపీ అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం - 12 మంది టీడీపీ సభ్యులపై వేటు - కోటంరెడ్డిపై కూడా !

ఏపీ అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని కూడా ఈ సెషన్ మొత్తం అసెంబ్లీకి రాకుండా సస్పెన్షన్ వేటు వేశారు.

FOLLOW US: 
Share:

AP Assembly :  ఏపీ అసెంబ్లీ నుంచి  12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. వీరిలో 
  పయ్యావుల కేశవ్ , నిమ్మల రామానాయుడు ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు.  మిగిలిన సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. 
హౌస్‌ను మిస్ లీడ్ చేసినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

మంగళవారం గవర్నర్ ప్రసంగం సందర్భంగా .. జగన్ ఆలస్యంగా వచ్చారని .. ఆయన కోసం గవర్నర్ వేచి చూశారని  పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేశవ్ వ్యాఖ్యల్ని ఓ పత్రిక ప్రచురించింది. అలా జరగలేదని పయ్యావుల తప్పుడు ఆరోపణలు చేశారని ప్రివిలేజ్ మోషన్ ను  అధికార పార్టీ సభ్యులు ప్రవేశ పెట్టారు ఈ సందర్భంగా మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనకు  ని పదే పదే అడిగారు. సుమారు 40 నిమిషాలకు పైగా సభలో అధికారపార్టీ మంత్రులు, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల అడ్డుతగిలారు. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

ముందుగా ఎలాంటి తీర్మానం లేకుండా నేరుగా సస్పెండ్ చేశారు.  ఎలాంటి ప్రతిపాదన లేకుండా తమరెలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించడంతో  సభా వ్యవహారాల మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  మరలా వీరిద్దరి సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు వినతి చేశారు. అప్పుడు స్పీకర్ మరోసారి ఇద్దరు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తేనే వెళతామని అంటున్నారని... వీరి మొత్తాన్ని సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగనివ్వరని మంత్రి అంబటి రాంబాబు   అన్నారు.   

సస్పెండ్ అయిన వారిలో టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవని, చినరాజప్ప, గణబాబు, పయ్యవుల కేశవ్, గద్దె రామ్మెహన్, రామరాజు, ఏలూరి సంబశివరావు, డోలా వీరాంజనేయస్వామి, రవికుమార్‌లు  ఉన్నారు.   వీరితో పాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ రోజు ఉదయం సభ మొదలైనప్పటి నుంచి కోటంరెడ్డి నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. తన నియోజక వర్గ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సభలో పోడియం ముందు నిలబడి నియోజకవర్గ సమస్యలపై స్పీకర్‌కు కోటంరెడ్డి విజ్జప్తి చేశారు. కోటంరెడ్డిపై అధికార పక్ష సభ్యులు మండిపడ్డారు.  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ షెషన్ మెత్తానికి సస్పెండ్ చేస్తూ నిర్ణయం స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.           

Published at : 15 Mar 2023 02:09 PM (IST) Tags: Speaker Tammineni Sitaram Suspension of AP Assembly Payyavula Nimmal

సంబంధిత కథనాలు

Swaroopanandendra: తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి, ప్రధానిది కూడా - స్వరూపానందేంద్ర స్వామి

Swaroopanandendra: తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి, ప్రధానిది కూడా - స్వరూపానందేంద్ర స్వామి

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

Narasarao pet News : కోటప్పకొండ అభివృద్ధిపై చర్చకు సవాళ్లు - నర్సరావుపేటలో టీడీపీ నేత అరెస్ట్ !

Narasarao pet News : కోటప్పకొండ అభివృద్ధిపై చర్చకు సవాళ్లు - నర్సరావుపేటలో టీడీపీ నేత అరెస్ట్ !

CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ

CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ

TTD Budget: 2023-24 ఏడాదికి బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ, కీలక నిర్మాణాలకు బోర్డు ఆమోదం

TTD Budget: 2023-24 ఏడాదికి బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ, కీలక నిర్మాణాలకు బోర్డు ఆమోదం

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!