News
News
X

Lokesh Photo : లోకేష్ "ఛిల్" ఫోటోలు చూపించి మరీ ప్రశ్నించిన బాలకృష్ణ - లోకేష్ ఆన్సర్ ఏమిటంటే ?

లోకేష్ గురించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సర్క్యూలేట్ అవుతూంటాయి. ఆ ఫోటోలను అన్‌స్టాపబుల్ ఇంటర్యూలో చూపించిన బాలకృష్ణ.. లోకేష్‌ను ప్రశ్నించారు. లోకేష్ ఏం చెప్పారంటే ?

FOLLOW US: 

Lokesh Photo : అన్ స్టాపబుల్ అన్నీ ప్రశ్నలకు అదే సమాధానమా...? ఓ పాపులర్ టీవీ షో ను తెలుగుదేశం పార్టీ.. నాయకత్వం తమపై వస్తున్న విమర్శలకు సమాధానంగా వాడుకుందా.. అంటే.. ప్రోమో చూస్దే..డీకోడ్ చేస్తే.. డెలివర్ అవుతున్న ఆన్సర్ అదే.. !

మీ అందరికీ.. బాబుగారు.. నాకు బావగారు.. అంటూ..  అన్ స్టాపబుల్ బాలయ్య..తన బావ, వియ్యంకుడితో.. రెండో సీజన్ ఒకటో ఎపిసోడ్ మొదలుపెట్టారు. అసలు బాలకృష్ణ ఓ ప్రోగ్రామ్ కు హోస్ట్.. చేయడం.. దానిని ఆహా లో చేయడం.. అది ఓహో అనే రేంజ్ లో మొదటి సీజన్ హిట్ కావడం ఊహించనివన్నీ మొదటి ఫేజ్ లో జరిగిపోయాయి. రెండో సీజన్ ను మరింత దహీట్ పెంచేశాడు బాలయ్య. నారావారిని.. అందునా బావగారిని .. ఎదురుగా కూర్చుండబెట్టేశాడు. ఈ న్యూస్ లీక్ అయి.. ఫోటోలు బయటకొచ్చినప్పటి నుంచి ఒకటే బజ్.. అయితే.. ఈ హీట్ ను మరింత పెంచుతూ.. ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో..  అనేక సంగతలును బయటకు తెచ్చింది. 

చంద్రబాబు కాలేజీ రోజుల్లో వేసిన రోమియో వేషాలు దగ్గర నుంచి.. ఆయన భార్యను పిలిచే ముద్దుపేర్ల వరకూ ప్రోమోలో చాలా విషయాలు వచ్చాయి. ఇవన్నీ నార్మల్ పబ్లిక్ కు మంచి ఇంట్రస్టింగ్ టాపిక్సే. కానీ అంతకు మించి.. పొలిటికల్ మసాలా కూడా యాడ్ అయింది. మరి షో  మామూలుది కాదు కదా.. అక్కడ కూర్చుంది.. ఓ మాజీ ముఖ్యమంత్రి .. ఆయన కొడుకు... ఎదురుగా ఉంది ఇంకో మాజీ ముఖ్యమంత్రి కొడుకు... బ్యాక్ గ్రౌండ్ లో బోలెడు స్టఫ్ ఉంది డిస్కస్ చేయడానికి.. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోననట్లుగా  ఉంది... 

ఎప్పటి నుంచో ఉన్న 1995 ఎపిసోడ్ గురించి మరోసారి మాట్లాడేశారు. చంద్రబాబు అనేకసార్లు దీనిపై మాట్లాడారు కానీ.. ఈసారి స్పెషల్ .. ఎందుకంటే.. ఈ ఎపిసోడ్ లో భాగస్వామ్యం అయిన బాలకృష్ణ ఆ ఇంటర్వూను చేస్తున్నారు కాబట్టి. మామను వెన్నుపోటు పొడిచారని.. చంద్రబాబు.. దానికి సహకరించారని బాలకృష్ణ ఫ్యామిలీ మెంబర్లు ఎప్పటి నుంచో విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.ఏం జరిగింది..తప్పెవరిది అన్న దానిపై ఎవరి వాదనలు వారికున్నా.. ఇవాళ దానిపై ఓ క్లారిటీ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. పూర్తి ఎపిసోడ్ రాలేదు కాబట్టి.. ఏం చేప్పారో పూర్తిగా తెలీదు. 

News Reels


ఇక అన్నింటికంటే ఇంట్రస్టింగ్ టాపిక్ లోకేష్ చిల్ అవుతున్న ఫోటో.. వైసీపీ దీనిని చాన్నాళ్లుగా ప్రచారాస్త్రంగా వాడుతోంది.  మంత్రి రోజా వంటి వాళ్లు.. లోకేష్ తాను విద్యార్థిగా ఉన్నప్పుడు.. విదేశీ సహచర విద్యార్థులతో సరదాగా గడిపిన ఫోటోలతో విమర్శలు చేస్తూనే ఉన్నారు. లోకేష్ గురించి ప్రత్యర్థి పార్టీల నేతలు ఎవరైనా విమర్శలు చేయాలంటే ముందుగా కొంత మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్న ఫోటోలను చూపిస్తారు. లోకేష్‌ను ప్లే బాయ్ అన్నట్లుగా విమర్శలు చేస్తారు. ఇది చాలా కాలంగా ఉంది. ఆయన ఫోటోలు తరచూ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసి.. ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు చేస్తూంటారు. 

టీడీపీ దీనిని సమర్థించుకుంటూ వస్తూనే ఉంది. అయితే ఇవాళ లక్షలాది మంది చూసే.. .ఈ షో లో బాలకృష్ణ తన అల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ చిల్ అవుతున్న పే..ద్ద ఫోటోను స్క్రీన్  పై పరిచేశారు. బహుశా..  దీని ద్వారా ఒకే ఫైనల్ ఆన్సర్ చెప్పాలనుకున్నారు ఏంటో తెలీదు. ఏమైనా కానీ.. టీడీపీ ఈ ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోంది. అందుకు ఇదే సరైన వేదిక అనుకుని ఉండొచ్చు. బహుశా ఇది ముందస్తు గా ప్లాన్ చేసుకునే చేసి ఉండొచ్చు. కానీ ఈ వేదిక ద్వారా  దీనికి ఆన్సర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది..  లోకేష్ , చంద్రబాబు ఏం మాట్లాడారు అన్నది ప్రోమో లో పూర్తిగా లేదు లే కానీ.. ఇది అసెంబ్లీ వరకూ వెళ్లింది.. అంటూ బాలకృష్ణ లోకేష్ ను ఆటపట్టించారు. ఆల్రెడీ ప్రోమో రావడంతో టీడీపీ వర్గాలు.. వీటిని బాగా షేర్లు చేస్తున్నాయి. ..అన్నింటికీ ఆన్సర్లు చెప్పేస్తున్నాం అంటూ వాళ్లు మరింత జోరు మీద ఉన్నారు.
 

ఇలాంటి ఫోటోల విషయంలో వచ్చే విమర్శలకు సమాధానం చెప్పకుండా సంశయిస్తే వాటినే పదే పదే ప్రచారం చేసే అవకాశం ఉంది. అందుకే లోకేష్ ఏ మాత్రం కంగారు పడకుండా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను కూడా స్టూడెంట్ లైఫ్‌ ను ఎంజాయ్ చేశానని .. అందరి లాంటిదే తన జీవితం అని లోకేష్ తన చేతల ద్వారా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  మైనా కానీ.. టీడీపీ ఈ ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోంది. అందుకు ఇదే సరైన వేదిక అనుకుని ఉండొచ్చు. బహుశా ఇది ముందస్తు గా ప్లాన్ చేసుకునే చేసి ఉండొచ్చు. కానీ ఈ వేదిక ద్వారా  దీనికి ఆన్సర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది..  

Published at : 11 Oct 2022 08:32 PM (IST) Tags: Balakrishna Lokesh Unstoppable Lokesh Photo

సంబంధిత కథనాలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- కొనేవాళ్లకు భారీ ఊరట !

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- కొనేవాళ్లకు భారీ ఊరట !

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Breaking News Live Telugu Updates: జగిత్యాలలో ఉద్రిక్తత, బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు!

Breaking News Live Telugu Updates: జగిత్యాలలో ఉద్రిక్తత, బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు!

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Anakapalle Road Accident: అనకాపల్లి జిల్లాలో విషాదం, కారు ఢీకొని అన్నాచెల్లెలు సహా ముగ్గురు దుర్మరణం

Anakapalle Road Accident: అనకాపల్లి జిల్లాలో విషాదం, కారు ఢీకొని అన్నాచెల్లెలు సహా ముగ్గురు దుర్మరణం

టాప్ స్టోరీస్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని