Top Headlines: శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు - తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు అర్హులు?, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
6th December Top Headlines In AP And Telangana:
1. శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆర్మీ కాలింగ్ సెంటర్ పేరుతో విద్యార్థులకు చిత్ర హింసలకు గురిచేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిరుద్యోగ యువతను కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయించుకొని చిత్రవధ చేస్తున్న రమణ అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పి అభ్యర్థులను రాచిరంపాన పెడుతున్న వైనం ఇప్పుడు బహిర్గతమైంది. వెంకట రమణ పేరుకే కోచింగ్ ఉచితమని ప్రకటనలు చేస్తారు. అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తారని అంటున్నారు. అంతే కాకుండా తన సొంత పనులు కూడా వారితో చేయించుకుంటారని అభ్యర్థులు అంటున్నారు. ఇంకా చదవండి.
2. పుష్ప 2 సినిమాతో వైసీపీ రాజకీయం!
పుష్ప పార్ట్ వన్ సినిమా వచ్చినప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు టిక్కెట్ రేట్ల పెంపుకు ఆమోదం లభించలేదు. మామూలు రేట్లతోనే పుష్ప రిలీజ్ అయింది. మంచి హిట్ అయింది. ఇక్కడ కన్నా నార్త్ లో ఇంకా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ఎంత హిట్ అన్న సంగతి పక్కన పెడితే ఈ పుష్ప సినిమాపై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో స్మగ్లర్లు అందరికీ ఒకే సామాజికవర్గం పేరు పెట్టారని మండిపడ్డారు. అయితే ఇప్పుడు అదే పుష్ప సినిమాకు సీక్వెల్ ను వైఎస్ఆర్సీపీ నేతలు పనిగట్టుకుని మరీ ప్రమోట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్లు రోజూ అదే పని చేస్తున్నారు. ఇంకా చదవండి.
3. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు అర్హులు?
కాంగ్రెస్ పార్టీ గత శాసన సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటి ఇందరిమ్మ ఇళ్లు. ఆ గ్యారంటీని నిలబెట్టుకొనే దిశగా రేవంత్ సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. రానున్న బడ్జెట్‌లో ఈ మేరకు నిధులు కేటాయించనుంది. ఇవాళ్టి నుంచే లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక చేసేందుకు ప్రత్యేక యాప్ సీఎం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఇంకా చదవండి.
4. తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు
హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో బాలుడు చావుతో పోరాడుతున్నారు. దీంతో ప్రబుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇకపై ఏసినిమాకి కూడా బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిపిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తొక్కిసలాట కారణంగా ఓ మహిళ మృతి చెందింది. మరో ఏడేళ్ల బాలుడు కూడా ప్రాణాపాయ స్థితికి వెళ్లిపోయాడు. ఇంకా చదవండి.
5. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం?
హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. దీని నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలకాంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్‌లో డీజిల వాహనాలు పూర్తిగా నిషేధిస్తామన్నారు. ఆర్టీసీలో ఉన్న వాటిని కూడా తిరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంకా చదవండి.